Late silk smitha is in news

late Silk Smitha is in news ,pictures, Silk Smitha wallpapers, images, stills, Photoshoots and images of Silk Smitha, dirty picture, Vidhya balan

late Silk Smitha is in news

Dirty Picture..GIF

Posted: 11/29/2011 04:38 PM IST
Late silk smitha is in news

silk-smitha

ఆడవారి అందాలను కమర్షియలైజ్ చేసి అమ్ముకోవటం ఇప్పటిది కాదు. అది మానవ జాతి అంత పాతది.కాకపోతే మన సినిమా వాళ్ళు దానిని మన పాపులర్ కల్చర్ తో మేళవించి మనకు స్లో పాయిజన్ లా ఎక్కిస్తున్నారు. ను నా ఫ్రెండ్ ఒకతనిని తో సినిమాల లో సెక్స్ గురించి వాపోతుంటే, అతను “మనం చేసే టప్పుడు లేని తప్పు ఎవరో చూపిస్తుంటే ఏమిటి? ఇది హిపోక్రసీ నే కదా?”, అన్నాడు. అతని వాదన నాకు మరీ సింప్లిస్టిక్ గా అనిపించి, “హిపోక్రసీ అనేది సామాజిక విలువల కి మాత్రమే వర్తిస్తుంది. మనం నాలుగు గోడల మధ్యా చేసే పనులకి కాదు”, అని చెప్పబోయాను కానీ నా వాదన కి నేనే కన్విన్స్ కాలేదు.

“నెట్లో బూతు సినిమాలు చూసి ఆనందించే ప్రేక్షక సామాన్యానికి సినిమాల లో ని బూతు ని గురించి ఫిర్యాదు చేసే హక్కు ఎక్కడిది?”, అని కూడా అతను అన్నాడు. నేను, “నిర్మాతలు ప్రేక్షకుల బలహీనతలను క్యాష్ చేసుకొంటున్నారు..”, అన్నాను. “నెట్లో ఇవన్నీ ఫ్రీగానే వస్తాయి..అయినా నువ్వు నీ అభిమాన హీరో చేసే డాన్సులూ, ఫైట్లూ చూసి ఆనందిస్తావు. ఎవరైనా అది నీ బలహీనత అంటే నువ్వు ఒప్పుకొంటావా? నీ అభిమాన దర్శకుడు తీసిన సినిమా ని నువ్వు ఆనందిస్తావు.అది నీ బలహీనత కాదు. అలానే నీ అభిమాన తార గుడ్డలిప్పి చూపిస్తే నువ్వు ఆనందిస్తావు. ఇది కూడా నీ బలహీనత కాదు”,అన్నాడు.

ఈ మధ్యే ఏదో హిందీ సినిమా లో ఒంటిమీద నూలు పోగు లేకుండా నటించిన నగ్న కళా విదుషీమణి ని ఒక బుధ్ధిలేని విలేఖరి, “మీ సినిమా లో అసభ్యత ఎక్కువయింది అంటున్నారు..?”, అని ప్రశ్నిస్తే ఆమె, “అసభ్యత అనేది చూసే వారి కళ్ళలోనే ఉంటుంది”, అని దబాయించింది. కొంత మంది నటీమణులు పాత్రస్వభావాన్ని బట్టి ఎక్స్-పోజింగ్ చేస్తున్నామనీ, తాము నిజజీవితం లో పతివ్రతలమనీ చెబుతారు!నిజ జీవితం లో, “లో దుస్తులు” బయటికి కనపడితేనే సిగ్గుతో చితికిపోయే వారు, పాత్రాపరం గా ఎక్స్-పోజింగ్ ఎలా చేయగలరు?ఒక పాత్ర ఎక్స్-పోజింగ్ చేయాలంటే దానిని పోషించే అసలు మనిషి కూడా ఎక్స్-పోజింగ్ చేయాలి కదా!అలానే ఆ వ్యక్తి ఎక్స్-పోజింగ్ ని సినిమా సెట్లోని ఇతర పాత్రల వెనుక ఉండే అసలు మనుషులూ,, టెక్నీషియన్లూ చివరికి ప్రేక్షకుల వెనుక ఉండే అసలు మనుషులూ చూస్తారు కదా? ఒక్క డబ్బు కోసం పాత్రా పరమైన వెధవపనులు చేస్తున్నారంటే, వారు నిజ జీవితం లో కూడా ఇతర ప్రలోభాలకు లొంగి అలాంటి పనులు చేయగలరన్న మాట! ఒక పాత్ర యొక్క దుష్ట స్వభావాన్ని ఆవాహన చేసుకొని నటించటం వేరు. దానికోసం అసలు మనిషి దుష్టుడు గా మారనవసరం లేదు

నిజ జీవితం లో చెడు పనులు చేయనవసరం లేదు. రావు గోపాల రావు,సూర్యకాంతం వంటి వారు సినిమాలలో దుష్ట పాత్రలు వేసినప్పటికినీ నిజ జీవితం లో సాత్వికులుగానే ప్రసిధ్ధి చెందారు. మానసిక స్థాయి లో అంతర్గతం గా మనలో ప్రతి ఒక్కరి లోనూ అనేక మంచీ చెడూ పాత్రలు ఉంటాయి. నటుడు సందర్భాను సారం గా తన లోని ఈ పాత్రలను ముందుకు తీసుకొని వచ్చి అభినయిస్తాడు. అంతర్గతంగా ఉన్న మంచి పాత్రను బాహ్యం గా నిజ జీవితం లో మనం పోషించలేక పోవచ్చు, మన వ్యక్తిగత మనుగడ వంటి విషయాలు అడ్డు రావటం వలన. అలానే ,అంతర్గతం గా ఉన్న చెడు పాత్రని నిజ జీవితం లో మనం పోషించలేము. అలా పోషిస్తే పక్క వాడు మనకి దేహశుధ్ధి చేసి పోలీస్ కేస్ పెడతాడు కాబట్టీ. నిజ జీవితం లో మన బాహ్య వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దటం లో మన ఆచరణ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎక్స్-పోజింగ్ అనే భౌతిక మైన పని నిజం గానూ, పాత్రాపరం గానూ ఒకేసారి జరిగిపోతుంది. రెండిటినీ వేరు చేసి చూడలేము.

కానీ వ్యక్తిత్వాన్ని అభినయించటం మానసికమైన పరిధిలోనిది. వేరే వ్యక్తిత్వాన్ని అభినయించి, మళ్ళీ కాసేపటికి తన నిజ జీవితం లో అసలు వ్యక్తి గా అవ్వవచ్చు. మా చుట్టాలలో ని ఒక ఫెమినిస్టు గారిని, “ఈ అర్ధ నగ్న ప్రదర్శనలు చేసే వారూ ఆడవారే కదా?” అని అడిగాను. దానికి ఆమె నామీద ఇంతెత్తున లేచి, ” మీ మగాళ్ళే పేద స్త్రీల బలహీనతను ఆసరాగా తీసుకొని వారి చేత ఇలాంటి పనులు చేయిస్తున్నారు”, అంది. ఎందుకనో నాకు, ” తరతరాల నట వారసులైనటువంటి కరీనా కపూర్లూ, ఇంగ్లాండ్ నుంచీ ఊడిపడే కట్రీనా కైఫ్లూ పేదవారనుకోవటానికి మనసొప్పలా..! కాకపోతే సరదాగా ఖర్చు పెట్టుకోవటానికి ఓ రెండు మూడు కోట్ల పాకెట్ మనీ కోసం ఎక్స్-పోజింగ్ చేస్తే తప్పేమిటి?”, అనిపించింది.

ఇక అసలు విషయానికి వచ్చేద్దాం, ఈ మధ్యే డర్టీ పిక్చర్ ని నిర్మించిన బాలాజీ పిక్చర్స్ అధినేత్రి ఏక్తా కపూర్ కూడా ఒక స్త్రీనే కదా..?! ఆమె కూటికి గతి లేని పేద రాలు కాదు. కొన్ని వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి రాణి. మధ్య తరగతి విలువలను మనం ఆమె కు అంటగట్ట రాదు.ఆమె ఎగువ తరగతి కి చెందిన ప్రభావవంతమైన స్త్రీ. ఆమె విలువలు డబ్బు చేతా, ప్రాక్టికల్ గా ఉండే సాధ్యాసాధ్యాల చేతా, న్యాయ వ్యవస్థ చేతా , ఆ పై ఆమె వ్యక్తిగత ఇష్టాఇష్టాల చేతా నిర్ణయింపబడతాయి. ఇక సిల్క్ స్మిత అమలాపురం దగ్గర ఒక పల్లె నుంచీ పొట్టచేత పట్టుకొని మద్రాస్ చేరి, సినిమాలలో శృంగార పాత్రలు వేసి గడుపుకొంది. పాపం, ఏ కష్టమొచ్చిందో ఏమో, ఆత్మహత్య చేసుకొంది. ఆమె శృంగార పాత్రలు తన అవసరాన్ని బట్టి వేసి ఉండవచ్చు. తన కడుపు కోసంకొన్ని అక్రమ సంబంధాలలో ఇన్వాల్వ్ అయి ఉండవచ్చు.

కానీ ఆమె జీవితం లో కనిపించేది దయనీయత మాత్రమే. శృంగారం ఏ మాత్రం కాదు. అటువంటి సిల్క్ స్మిత జీవితం లోకి శృంగారాన్ని జొప్పించి డబ్బు చేసుకోవాలనుకొనే ఏక్తా కపూర్ కూడా ఒక స్త్రీనే. కాబట్టీ ధన జాఢ్యానికి లింగ వివక్ష లేదు. ఇది అన్ని తరగతులకీ సమానం గా వర్తిస్తుంది. మధ్య తరగతినే తీసుకొందాం.టీ వీ ల లో అసభ్య దృశ్యాలు వచ్చినపుడు, “ఛీ.. ఛీ.. వీళ్ళకి అసలు విలువలే లేవు” అనుకోవటం చాలా సులువు.

కానీ మన విలువలు వదిలి పెడితే మనకు డబ్బు వచ్చిపడుతున్నపుడు, మనం ఈ విలువల వలువలను వదిలి డబ్బు ఇచ్చిన కొత్త వలువలు వేసుకోవటానికి ఏమాత్రం సందేహించం. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో విప్పి చూపించిన విద్యా బాలన్ గారు మధ్య తరగతి నుంచే వచ్చారు. ఈమె స్టూడియో లో చేసిన ఎక్స్పోజింగ్ చూడలేక ఈమె నాన్న గారు స్టూడియో బయటికి వచ్చి కారులో కూర్చొన్నారంట. ఆహా…! ఏమి మధ్య తరగతి విలువలూ ఎంత హిపోక్రసీ..? హిపోక్రసీ లేనిది ఒకటే ..అది డబ్బు..కాసుకు లోకం దాసోహం.. ! మొత్తానికి..తీసే వాళ్ళు తీస్తున్నారు, చేసే వాళ్ళు చేస్తున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు, మధ్య లో మనకెందుకు బాధ? ప్రతి విషయం లోనూ మంచిని చూడాలంటారు.

.కాబట్టీ ఈ విషయం లో కూడా అలా చూడటానికి ప్రయత్నిద్దాం! పోనీలే.., సిల్క్ స్మిత జీవితం ఏదైనా, ఈ సినిమా వలన బాలాజీ పిక్చర్స్ లో పని చేసే వారికి కొంత కాలం కడుపైనా నిండుతుంది అని సరి పెట్టుకొందాం!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anushka to act with rajinikanth in rana
Dhanushs kolaveri di song is the new youth anthem  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles