Xiaomi Launches Poco F1 With Snapdragon 845 భారతీయ విఫణిలోకి షియోమి ‘పోకో’ ఎఫ్-1

Xiaomi debuts poco sub brand in india with f1 smartphone

Xiaomi, Poco F1, Launched, Liquid Cooling technology, INDIAN Market, mobiles, Flipkart.in, Mi,com, HDFC bank, e-commerce, smart phones, mobiles, technology, business, Technology News, Tech News, Best Gadgets

The Poco F1 smartphone comes with a liquid cooling technology. The company claims that there is a copper pipe inside the phone that helps keep the CPU cool during intense usage sessions.

భారతీయ విఫణిలోకి షియోమి ‘పోకో’ ఎఫ్-1.. ధరెంతో తెలుసా.?

Posted: 08/22/2018 07:02 PM IST
Xiaomi debuts poco sub brand in india with f1 smartphone

చైనాకు చెందిన ప్రఖ్యాత స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి అనుబంధ సంస్థ ‘పోకో’ తన తొలి స్మార్ట్ ఫోన్ ను భారత విఫణీలోకి ఇవాళ విడుదల చేసింది. అత్యంత అధునాతన ఫీచర్లు కలిగిన ఈ మోబైల్ ను అత్యంత ఆకర్షణీయంగా అందుబాటు ధరలో విడుదల చేసింది షియోమి. 845 స్నాప్ డ్రాగన్ తో విడుదలైన ఈ ఫోన్ పెర్ఫర్మెన్స్ స్పీడ్ అధికంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. లిక్విడ్ కూల్ టెక్నాలజీ వాడటం వల్ల ఫోన్ లోని వేడిని ఎప్పటికప్పుడు తగ్గించి, డివైస్ ను కాపాడుతుందని ఓ ప్రకటనలో పేర్కొంది.

4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో విడుదలైన ఈ ఫోన్ 8జీబీ ర్యామ్ కలిగివుంది. అంతే కాకుండా ఈ ఫోన్లో ఇంటర్నట్ స్టోరేజిని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకోవడం అదనపు ఆకర్షణ. ఇండియా మార్కెట్లో సరికొత్త రికార్డులు సృష్టించనుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఈ ఫోన్ ప్రారంభ ధరను రూ.20,999 గా నిర్ణయించారు. 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999గా నిర్ణయించింది.

కాగా 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999.. అలాగే 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999గా కంపెనీ నిర్ణయించింది. హెచ్‌డీఎఫ్‌స బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై కొనుగోలు చేసే వారికి రూ.1000 రాయితిని ప్రకటించింది. ఈఎమ్ఐపై కొనుగోలు చేసే వారికి కూడా ఇది వర్తించనుంది. అంతే కాకుండా జియో కస్టమర్లకు రూ.8000 విలువ చేసే 6టీబీ డాటా, క్యాష్ బ్యాక్ ను అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ నెల 29 మద్యాహ్నం 12 గంటలకు ఎమ్ఐ.కామ్, ఫ్లిప్ కర్ట్ లలో మొదటి సేల్ ను నిర్వహిస్తారు.
 
ఫీచర్స్:
6.18 అంగుళాల డిస్‌ప్లే
ఆక్టాకోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.1
6జీబీ/8జీబీ ర్యామ్
64జీబీ/128జీబీ/256జీబీ ఇంటర్నల్ మెమోరి
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఫ్రంట్ కెమెరా 20 ఎంపీ సెల్ఫీ కెమెరా
12+5ఎంపీ మెయిన్ కెమెరా

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Xiaomi  Poco F1  Launched  INDIA  mobiles  Flipkart.in  Mi  com  HDFC bank  e-commerce  smart phones  

Other Articles