Nokia 5 With 3GB RAM Launched in India 3 జీబి ర్యామ్ తో సరికొత్త నోకియా 5 విడుదల

Nokia 5 3gb ram variant launched in india price specifications

Nokia 5, Nokia 5 3GB RAM, Nokia 5 Flipkart, Nokia 5 Rs 13499, Nokia 5 launch, HMD Global, Nokia India, Android, Android 8.0 Oreo

HMD Global, the Finnish company behind Nokia's comeback into the smartphone game has launched a 3GB RAM variant of the Nokia 5.

3 జీబి ర్యామ్ తో సరికొత్త నోకియా 5 విడుదల

Posted: 11/06/2017 06:14 PM IST
Nokia 5 3gb ram variant launched in india price specifications

నోకియా స్మార్ట్ ఫోన్లను విడుదల బాధ్యతలను భుజానికెత్తుకున్న హెచ్ఎమ్‌డీ గ్లోబల్... మంచి జోరుమీద వుంది. ఇటీవలే అత్యంత చౌకధరలో 4జీ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన ఈ సంస్థ.. తాజాగా నోకియా 5 స్మార్ట్ ఫోన్ ను భారతీయ విఫణిలోకి విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ లోనూ ఈ స్మార్ట్ ఫోన్ విడుదలైంది కదా... మళ్లీ లాంచ్ ఏంటీ అంటారా..? జూన్ లో విడుదల చేసిన నోకియా 5ను అప్ డేట్ చేయడంతో పాటు ఒక గిగా బైట్ ర్యామ్ ను పెంచి అదే వెర్షన్ లోని 3జీబీ ర్యామ్ వేరియంట్ ను తాజాగా మార్కెట్లోకి తీసుకొచ్చింది హెచ్ఎండీ సంస్థ..

ఇవాళ భారతీయ మార్కెట్లోకి విడుదలైన ఈ 4జీ స్మార్ట్ ఫోన ... ప్రముఖ ఈ కామెర్స్ దిగ్గజం సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ఎక్స్ క్లూజివ్ గా రూ.13,499కి లభ్యమవుతోంది. మంగళవారం నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 14 నుంచి రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులోకి రానుంది. నోకియా5 3జీబీ ర్యామ్ వేరియంట్ మాట్ బ్లాక్, టెంపెడ్ బ్లూ కలర్స్‌లో లభ్యమవుతోంది.

ఫీచర్ వివరాలు ఇలా ఉన్నాయి...

*    5.2 అంగుళాల హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
*    1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిసొల్యూషన్
*    ఆండ్రాయిడ్ 7.1 నూగట్ ఓఎస్ (ఓరియోకి అప్‌గ్రేడ్ చేసుకునే సదుపాయం)
*    1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్
*    16 జీబీ స్టోరేజ్, 128 జీబీ వరకు పెంచుకోవచ్చు
*    4జీ వోల్ట్ టెక్నాలజీ
*    13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
*    8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
*    3000 ఎంఏహెచ్ బ్యాటరీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles