Sensex, Nifty end at record closing high సరికొత్త గరిష్టాలకు చేరిన దేశీయ సూచీలు..

Closing bell sensex nifty end at record closing high hul itc drag

BSE SENSEX, NIFTY 50, Oil and Natural Gas Corporation, Goods and Services Tax, Business, Technology

Benchmark indices began the week on a positive note, with the Nifty closing above 10,350-mark. The Sensex closed up 108.94 points at 33266.16, while the Nifty ended higher by 40.70 points at 10363.70.

సరికొత్త గరిష్టాలకు చేరిన దేశీయ సూచీలు..

Posted: 10/30/2017 07:42 PM IST
Closing bell sensex nifty end at record closing high hul itc drag

దేశీయ స్టాక్ మార్కెట్ లో నూతనోత్తేజం పరఢవిల్లింది. దేశీయ సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్ కొత్త రికార్డులను నమోదు చేయడంతో ఇవాళ మదుపరులలో సంతోషం కూడా వెల్లివిరుస్తుంది. ఆసియా మార్కెట్ల సానుకూల ప్రభావంతో ఆరంభ ట్రేడింగ్ నుంచే లాభాల్లో దూసుకెళ్లిప మార్కెట్లు.. జొరును కొనసాగించాయి. కాగా మధ్యాహ్నం సూచీలు కొంత అటుపోట్లను ఎదుర్కోన్నాయి. దీంతో కుదుపులకు గురైనా.. తరువాత తట్టుకుని నిలబడ్డాయి.

ఈ క్రమంలో ముగింపు సమయానికి లాభాలను గడించాయి. ఇవాళ మార్కెట్లు అందుకున్న లాభాలతో మార్కెట్లు కొత్త హైట్స్ కు చేరకున్నాయి. ఇటు సెన్సెక్స్, అటు నిఫ్టీలు రెండూ కూడా కొత్త ఉన్నత శిఖరాలను అందుకున్నాయి. ఇలా జోరు కొనసాగుతున్న క్రమంలోనే సూచీలు సరికొత్త జీవనకాల గరిష్ఠాలను చేరుకున్నాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 10,400 మార్క్‌కు చేరువైంది.

ఈ ఉదయం 150 పాయింట్ల లాభంతో ఉత్సాహంగా ప్రారంభమైన సెన్సెక్స్‌.. ఆ తర్వాత కాస్త ఒడుదొడుకులకులోనైంది. అయితే బ్యాంకింగ్‌, చమురు కంపెనీల అండతో లాభాలను నిలబెట్టుకుంది. నేటి ట్రేడింగ్‌లో 109 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌.. 33,266 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠస్థాయిలో ముగిసింది. అటు నిఫ్టీ కూడా 41 పాయింట్లు లాభపడి 10,364 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.83గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో యస్‌బ్యాంక్‌, లుపిన్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఐషర్‌ మోటార్స్‌, టాటామోటార్స్‌ షేర్లు లాభపడగా.. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హిందుస్థాన్‌ యునిలివర్‌, ఐటీసీ లిమిటెడ్‌, విప్రో, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు నష్టపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles