ప్రపంచ మార్కెట్ల గమనం సానుకూల దిశగా సాగుతున్న క్రమంలో యుద్ద సన్నాహాలకు ఉత్తర కోరియా సిద్దమై వైమానిక దళ విన్యాసాలు చేయంచడంతో ఒక్కసారిగా అవి తిరోగమనం వైపు పయనించాయి. ఇక తాజాగా మయన్మార్ సరిహద్దుల్లో భారత సైన్యానికి, ఉగ్రవాదుల మధ్య భీకర పోరుతో దేశీయ సూచీలు నష్టాలను మూటగట్టకున్నాయి. మయన్మార్ సరిహద్దులో భారత ఆర్మీ సర్జికల్ దాడులను చేసి నాగా తీవ్రవాదులను అణిచివేస్తుందన్న వార్తలతో మార్కెట్లు కుదేలయ్యాయి.
సెప్టెంబర్ డెరివేటివ్ల గడువు ముగింపు నేపథ్యంలో ఆరంభం నుంచే డీలా పడ్డ సూచీలు.. తాజాగా మయన్మార్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలో నిన్నటి క్లోజింగ్ తో పాల్చితే సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 9,800 కిందకు దిగజారింది. ఇవాళ ఉదయం ఆరంభంలో మార్కట్ స్వల్ప లాభాలతో ప్రారంభమైనా అవి ఎంతోసేపు నిలువలేదు.
సెప్టెంబర్ వెరివేటివ్ నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో మార్కెట్లు లాభాల తరువాత నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే మయన్మార్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొందన్న వార్తలు దవాణంలా వ్యాపించడంతో ఒక్కసారిగా మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో ముగింపు సమయానికి సెన్సెక్స్ 440 పాయింట్లు కోల్పోయి.. 31,160 మార్కు వద్దకు చేరుకోగా, నిఫ్టీ 136 పాయింట్లు నష్టపోయి 9,736 పాయింట్ల వద్ద జారుకున్నాయి. కాగా, భారతీ ఇన్ ఫ్రాటెల్, టీసీఎస్, టెక్ మహింద్రా, అంబుజా సిమెంట్, గెయిల్ సంస్థల షేర్లు స్వల్పంగా లాభపడగా.. అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, సన్ ఫార్మా, ఆల్ట్రాటెక్ సిమెంట్ సంస్థల షేర్లు అత్యధిక నష్టాలను చవిచూశాయి.
(And get your daily news straight to your inbox)
Jan 30 | అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తన కొత్త ఎక్స్7 సిరీస్ 5జీ మొబైల్ ఫోన్లను ఫిబ్రవరి 4న భారత్ లో అవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు ఎలా వుంటాయన్న... Read more
Dec 30 | ప్రస్తుత సంవత్సరం 2020 నెటిజనుల విమర్శలు, వ్యంగోక్తుల తరహాలోనే నిజంగా ఈ ఏడాదికే వైరస్ సోకిందా.? అంటే కాదనక తప్పదు. కరోనా వైరస్ సోకిన ఈ ఏడాది వస్తూనే యావత్ ప్రపంచ వాణిజ్యాన్ని లాక్... Read more
Dec 09 | కేఫ్ కాఫీ డే దేశవ్యాప్తంగా పలువురు కాఫీ ప్రియులను అలరించే ఓ పెద్ద బ్రాండ్. ఈ సంస్థ ఎవరిది.. ఎవరు ప్రారంభించారు.. అన్న వివరాలు గత ఏడాది వరకు ఎవరికీ తెలియదు. అయితే గత... Read more
Sep 25 | అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా... Read more
Aug 22 | దేశీయ విపణిలోకి మరో విద్యుత్ ద్విచక్రవాహనం వచ్చింది. పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ టెక్నో ఎలెక్ట్రా మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది, ఈ సరికొత్త ఇ-మోపెడ్ ‘సాథీ’ని దేశీయ విపణిలోకి తీసుకువచ్చింది.... Read more