Xiaomi Mi Max 2 to launch in India on July 18 భారతీయ విఫణిలోకి త్వరలో షియోమి కొత్త ఫోన్

Xiaomi mi max 2 to launch in india on july 18

xiaomi mi max 2, mi max 2 india launch, mi max 2 price in india, xiaomi mi max 2 india price, xiaomi mi max 2 features, xiaomi mi max 2 specifications, xiaomi mi max, xiaomi mi max review, xiaomi, mobiles, smartphones

Another month. Another Xiaomi phone. This time around the Chinese company is launching Mi Max 2 in India on July 18.

భారతీయ విఫణిలోకి త్వరలో షియోమి కొత్త ఫోన్

Posted: 07/11/2017 08:56 PM IST
Xiaomi mi max 2 to launch in india on july 18

భారత స్మార్ట్ ఫోన్‌ ప్రియుల మదిని గెలుచుకుని మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న షియోమి, మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకురానుంది. అందుకు ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసింది. వచ్చే వారంలో న్యూఢిల్లీలో ఓ లాంచ్ ఈవెంట్ ను నిర్వహిస్తోంది. ఈ లాంచ్ ఈవెంట్ కోసం ఆహ్వానాలు సైతం పంపిస్తోంది. ఇంతకీ ఈ ఈవెంట్ లో లాంచ్‌ చేయబోయేది ఏంటో తెలుసా.? మే నెలలో చైనాలో లాంచ్‌ చేసిన ఎంఐ మ్యాక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌. ఈ నెల 18న ఎంఐ మ్యాక్స్ 2 స్మార్ట్ ఫోన్ ను షియోమి భారత్ లో లాంచ్‌ చేయబోతుందని తెలుస్తోంది. దీని ధర కూడా  సుమారు రూ.16,100గానే ఉండబోతుందట. ''బిగ్‌ ఈజ్ బ్యాక్'' అనే ట్యాగ్ లైన్‌తో కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ను చైనాలో ఆవిష్కరించింది. దీని ప్రత్యేక ఆకర్షణ పెద్ద స్క్రీన్‌, బ్యాటరీ. ఎంఐ మ్యాక్స్ ను పోలిన మాదిరిగానే ఎంఐ మ్యాక్స్ 2 డిజైన్ కూడా ఉంది.
 
ఎంఐ మ్యాక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు:-

6.44 అంగుళాలతో ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
5300ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఆక్టా-కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ఎస్‌ఓసీ
4జీబీ ర్యామ్‌
64జీబీ, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్లు
12ఎంపీ రియర్‌ కెమెరా
5ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా
ఎంఐయూఐ ఆధారిత ఆండ్రాయిడ్‌ నోగట్‌
4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, క్విక్ చార్జ్ 3.0.
అయితే రెండు స్టోరేజ్‌ వేరియంట్లను భారతీయ విఫణిలో లాంచ్‌ చేస్తుందా అన్న విషయమై ఇంకా క్లారిటీ రాలేదు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Xiaomi  Mi Max 2  Launch  Indian market  -commerce  business  technology  

Other Articles