AirAsia offers low fares starting at Rs.2,999 on International Flights

Airasia offers low fares starting at rs 2 999 on international flights

AirAsia offers low fares starting Rs.2, 999 on International Flights, AirAsia, Rs.2, 999 for Kuala Lumpur from Kochi, Chennai or Hyderabad, Thai AirAsia, AirAsia chief commercial officer Siegtraund Teh, Air asia offers

Low-cost carrier AirAsia said on Sunday it will offer tickets on select domestic and international routes at a discount, starting from Rs.1,099 and applicable on tickets booked online from March 7-13 ,for travel between October 1, 2016 and May 22, 2017.

ఎయిర్ ఏషియా దేశీయ, అంతర్జాతీయ సర్వీసులపై చౌకధర ఆఫర్

Posted: 03/07/2016 02:05 PM IST
Airasia offers low fares starting at rs 2 999 on international flights

చౌకధరలకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తూ.. చౌక విమానయాన సంస్థగా ప్రఖ్యాతి చెందిన ఎయిర్‌ ఏషియా విమానయాన సంస్థ నిర్ణీత సర్వీసులపై ఆఫర్లను ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ సర్వీసులపై మరోమారు చౌకగా ప్రయాణికుల్నిచేరవేసేందుకు సిద్దమైంది. చౌకధర యుద్దంలో ప్రస్తుతం ఎయిర్ ఏషియాకు పోటీగా ఏ ఇతర విమానయాన సంస్థ ఇంకా ప్రకటనలు గుప్పించలేదు. తాజాగా ప్రకటించిన నిర్ణీత సర్వీసులపై ఆఫర్లు రూ.1099 నుంచి మొదలవుతాయి.

దేశీయంగా బెంగళూరు, విశాఖపట్నం, గోహతి, కోచ్చి, ఇంపాల్, గోవా సహా ఢిల్లీలకు విమాన సర్వీసులను అందజేస్తుంది. ఈ నిర్ణీత సర్వీసులకు విమానయాన  సంస్థ కేవలం 1099 రూపాయల నుంచి రుసుమును వసూలు చేయనుంది,. కాగా దీంతో్ పాటు అంతర్జాతీయంగా నిర్ణీత సర్విసులను ధర మూడు వేల నుంచి ప్రారంభం కానుంది. కౌలాలంపూర్ నుంచి కోచ్చి, చెన్నై, హైదరాబాద్ లకు చేరుకునే విమాన సర్వీసులపై ఈ ఆఫర్ ను సంస్థ ప్రకటించింది.

దీంతో పాటు బ్యాంకాక్ నుంచి చెన్నూ, బెంగళూరుల మధ్య ప్రయాణించాలనుకునే ప్రయాణికులకు కూడా చౌకధరను సంస్థ ప్రకటించింది. ఈ సర్వీసును ధర నాలుగు వేల రూపాయల నుంచి ప్రారంభం కానుందని  సంస్థ ఓ ప్రకటనలో పేర్కోంది. 1 అక్టోబర్‌ 2016 నుంచి 22 మే 2017 మధ్య ప్రయాణాల కోసం ఆన్‌లైన్‌లోని తమ సంస్థ వెబ్ సైట్ లో టిక్కెట్లను బుక్ చేసుకున్నవారికి మాత్రమే ఈ సదుపాయాన్ని సంస్థ ప్రకటించింది. దీంతో పాటు మార్చి 7 నుంచి 13 వరకు మాత్రమే ఈ ఆఫర్ కింద టిక్కట్లను బుక్ చేసుకోవాలని తెలిసింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AirAsia  offers  low fares  International Flights  

Other Articles