Ford driverless car to hit California roads

Ford will test driverless cars in california next year

Ford, Ford Fusion Hybrid, autonomous cars, driverless cars, Google, Palo Alto, ford driverless car, Nissan, Volkswagen, driverless car, California public roads, car-tech, consumer-electronics, martyn-williams, news

The Detroit auto giant has received a permit to begin operating a driverless car on public streets as part of the the California Autonomous Vehicle Testing Program.

ఫోర్ట్ సంస్థ నుంచి త్వరలో డ్రైవర్ లెస్ కార్లు..

Posted: 12/16/2015 07:27 PM IST
Ford will test driverless cars in california next year

డెట్రాయిట్ కు చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మరో నూతన అవిష్కరణకు సిద్దం కానుంది. ఫోర్డ్ సంస్థ నుంచి కూడా గూగుల్ తరహాలో డ్రైవర్ లేని కారు త్వరలోనే అమెరికా రోడ్లపై పరుగులు తీయనుంది. కాలిఫోర్నియా రహదారులపై సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు టెస్ట్ డ్రైవ్ నిర్వహించేందుకు అనుమతి లభించిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అనుమతులు లభించడంతో నూతన సంవత్సరం టెస్ట్ డ్రైవ్ నిర్వహించనున్నామని వెల్లడించారు.

సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీ కోసం వంద మంది పరిశోధకులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు పని చేస్తున్నారని ఫోర్డ్ కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతానికి టెస్ట్ డ్రైవ్ నిర్వహిస్తామని, సాంకేతిక సమస్యలను అంచనావేసి, వాటిని పరిష్కరించి, ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. 2020 నాటికి పూర్తి స్థాయిలో ఫోర్డ్ డ్రైవర్ లెస్ కార్లు కాలిఫోర్నియా రోడ్లపై పరుగులు తీస్తాయని వారు వివరించారు. కాగా, ఇప్పటికే గూగుల్ సంస్థ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను టెస్టు చేసిన సంగతి తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ford  driverless car  california  autonomus cars  

Other Articles