Sensex up 517 pts, Nifty ends tad below 8500; banks lead

Sensex up 517 pts nifty ends tad below 8500

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE

The market staged spectacular performance on Monday with the Nifty reclaiming 8500 level and Sensex hitting 28000-mark led by banking & financials, FMCG, capital goods and IT stocks.

భారీ లాభాలను ఆర్జించిన స్టాక్ మార్కెట్లు

Posted: 03/30/2015 06:23 PM IST
Sensex up 517 pts nifty ends tad below 8500

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల బాటలో పయనించాయి. గత వారంతం మిగిల్చిన పెను నష్టాలతో ఇవాళ ఉదయం ప్రారంభమైన స్టాక్ మర్కెట్లు.. ఆరంభంతోనే లాభాల భాటలో పయనించాయి. ఇవాళ దేశీయ సూచీలు ముగిసే సమయానికి సెన్సెక్ 28 వేల మార్కు పైన ముగియగా, నిఫ్టీ కూడా మళ్లీ 8500 పాయింట్ల మార్కును అదిమి పట్టుకుంది. బ్యాంకింగ్, ఫైన్సాన్స్, ఎఫ్ ఎం జీ సీ, క్యాఫిటల్ గూడ్స్ ఐటీ సెక్టార్లు అత్యధిక లాభాలను నమోదు చేసుకోవడంతో.. మార్కెట్లు లాభాలను గడించాయి. అన్ని సెక్టార్లు ఇవాళ లాభాలను నమోదు చేసుకున్నాయి.

ఉదయం మార్కెట్ ఆశాజనకంగా ప్రారంభం కావడంలో ఎలాంటి ప్రతికూల పవనాలు లేకపోవడంతో.. మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. మదుపుదారులు కోనుగోళ్లకు పోటీ పడటంతో.. లాభాలను మూటగట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 517 పాయింట్ల లాభంతో 27 వేల 976 వద్ద ముగియగా, నిఫ్టీ 151 పాయింట్ల లాభంతో 8492 వద్ద ముగిసింది. ఈ క్రమంలో ఐడియా సెల్యూలార్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, హెచ్ డీ ఎప్ సీ, భారతీ ఎయిర్ టెల్ సంస్థల షేర్లు అధిక లాభాలను ఆర్జించగా, టెక్ మహేంద్ర, హిండాల్కో, కాయిర్న్ ఇండియా, టాటా పవర్, రిలయన్స్ తదితర సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  

Other Articles