Mukesh ambani son akash joins ril

Wholesale price index,settlement option, Sandip Das, RIL,Reliance Industries, reinstatement. net worth| Mukesh Ambani| Insurability| Dhirubhai Ambani| Bharti| 4G telecom

Mukesh Ambani son Akash has joined Reliance Industries Ltd, starting at its telecom unit at a critical time.

రిలయన్స్ వ్యాపారంలోకి మరో వారసుడు

Posted: 02/20/2014 12:40 PM IST
Mukesh ambani son akash joins ril

ప్రముఖ వ్యాపార దిగ్గజాలు తమ తమ వారసుల్ని వ్యాపార రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో వ్యాపార దిగ్గజం అయిన ముకేశ్ అంబానీ తన పెద్ద కుమారుడు ఆకాశ్ ని వ్యాపార రంగంలోకి దింపుతున్నాడు.  రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)కు చెందిన టెలికం విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ త్వరలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఆకాశ్ దీనిలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధం కావడం విశేషం.

కీలకమైన మార్కెట్ వ్యూహాన్ని ఖరారు చేయడంలో ఆకాశ్ కూడా పాలుపంచుకున్నట్లు సమాచారం. ‘కంపెనీకి క్రమంతప్పకుండా ఆకాశ్ వస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార వ్యూహాల్లో కీలక పాత్ర పోషించే మనోజ్ మోడి, చైర్మన్ ముకేశ్‌తో సమీక్షా సమావేశాల్లో కూడా పాల్గొనడమే కాకుండా, రిలయన్స్ జియో గ్రూప్ ప్రెసిడెంట్ సందీప్ దాస్ తో సన్నిహితంగా పనిచేస్తున్నారట. ప్రస్తుతం 22 ఏళ్ళ వయస్సు ఉన్న ఆకాశ్ అమెరికాలో బ్రౌన్ యూనివర్సిటీలో అండర్ గ్యాడ్యుయేషన్ పూర్తి చేసి వచ్చాడు.

wముఖేశ్ అంబానీలా చిన్న వయస్సులోనే వ్యాపారంలోకి అగుడుపెట్టిన ఆకాశ్ భవిష్యత్తులో తన తండ్రిలాగా రాణిస్తాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles