Mukesh ambani india richest for sixth year

Forbes billionaires list, mukesh ambani, Carlos Slim, Warren Buffett, Bill Gates, Amancio Ortega

On Forbes annual list of the world billionaires, Reliance Industries’ Mukesh Ambani retains top spot among Indians.

Mukesh Ambani India richest for sixth year.png

Posted: 03/05/2013 08:55 PM IST
Mukesh ambani india richest for sixth year

ambaniబిజినెస్ మ్యాగజీన్ ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన బిలియనీర్ల జాబితాలో భారతీయ కుబేరుడిగా ముకేష్ అంబానీ మళ్లీ టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. తద్వారా వరుసగా ఆరో ఏడాది అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు. ముకేష్ సంపద 21.5 బిలియన్ డాలర్లుకాగా, 16.5 బిలియన్ డాలర్ల ఆస్తులతో స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ రెండో ర్యాంక్‌ను పొందారు. ఇక విప్రో అధినేత ప్రేమ్‌జీ 11.2 బిలియన్ డాలర్లతో మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

కాగా, ప్రపంచ కుబేరుల్లో మెక్సికన్ వ్యాపారవేత్త కార్లోస్ స్లిమ్ వరుసగా నాలుగోసారి అగ్రస్థానాన్ని పొందడం విశేషం. 73 బిలియన్ డాలర్ల సంపదతో స్లిమ్ తన స్థానాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు. ఫోర్బ్స్ సోమవారం విడుదల చేసిన బిలియనీర్ల 72వ వార్షిక జాబితాలో ప్రపంచం మొత్తం మీద అత్యధిక స్థాయిలో 1,426 మంది స్థానాలను పొందగా, 55 మంది భారతీయులకు చోటు లభించింది. ఇక ప్రపంచ ధనవంతుల ర్యాంకింగ్‌లో ముకేష్‌కు 22వ ర్యాంక్ లభించగా, లక్ష్మీ మిట్టల్ 41, ప్రేమ్‌జీ 91వ స్థానాల్లో నిలిచారు.

అపర కుబేరుల జాబితాలో 67 బిలియన్ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ప్రపంచాన రెండో స్థానంలో నిలవగా, స్పెయిన్‌కు చెందిన ఎమనికో ఓర్టెగా (57 బి.డా) మూడో ర్యాంక్‌ను, వారెన్ బఫెట్ (53.5 బి.డా) నాలుగో స్థానాన్ని పొందారు. ఇక 43 బిలియన్ డాలర్ల ఆస్తులతో లారీ ఇల్లిసన్ ఐదో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles