Ntt docomo breaks with tata

ntt docomo with tata groups, ratan tata with ntt docomo groups, ntt docomo breaks with tata groups, tata tie up with ntt docomo company, ntt docomo sells their shares, huge loss to ntt docomo, huge loss to ratan tata in business, business news, business news in Telugu

ntt docomo breaks with tata because of huge loss in 2014 year and more

ఇక నుంచి ‘‘టాటా డొకొమొ’’ పేరు వినిపించకపోవచ్చు!?

Posted: 04/26/2014 05:42 PM IST
Ntt docomo breaks with tata

2008 నవంబర్ నెలలో భారతీయ దిగ్గజ సంస్థ అయిన టాటా టెలిసర్వీసెస్, జపాన్ టెలికాం సంస్థ అయిన ఎన్టీటీ డొకొమొ సంస్థ వారు సంయుక్తంగా కలిసి భారతీయ సెల్యూలార్ సంస్థ ‘‘టాటా డొకొమొ’’ను ఏర్పాటు చేశారు. అయితే తాజాగా ఎన్టీటీ డొకొమొ కంపెనీవారు మార్చి 25వ తేదీన టాటా డొకొమొలో వున్న తమ షేర్స్ అన్నింటిని అమ్మేసి, భారతీయ టెలికాం సర్వీసుతో, టాటా వారితో తెగతెంపులు చేసుకుంటోంది ప్రకటించింది. 

ఎందుకంటే.. ఒప్పందం ప్రకారం 2014 మార్చి 31వ తేదీవరకు ఎన్టీటీ సంస్థ వారికి 780 మిలియన్ డాలర్లవరకు భారీగా నష్టం వాటిల్లింది. దాంటో కంపెనీకి చెందిన మొత్తం వాటా (124.9 కోట్ల షేర్లు లేదా 26.5 శాతం వాటా)ను విక్రయించేందుకు బోర్టు డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు డొకొమొ సంస్థలవారు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.

ముందుగా వొడాఫోన్ సంస్థలవారు ఈ వాటాను కొనుగోలు చేస్తుందనే వార్తలు వినిపించినప్పటికీ... ఇంతవరకు స్పందించలేదని వాదనలు వినిపిస్తున్నాయి. సాధ్యమైనంతవరకు ఈ వాటాను టాటా గ్రూప్ సంస్థల వారే కొనుగోలు చేసే అవకాశం వుందని చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడే ఎటువంటి నిర్ణయాలను తీసుకోలేమని కూడా టాటా సన్స్ వారు ప్రకటించారు కూడా!

ఒప్పందం ప్రకారం... ఎన్టీటీ డొకొమొ, టాటా టెలీ సర్వీసెస్, టాటా సన్స్ గ్రూపుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం... టాటా టెలీ సర్వీసెస్ కంపెనీవారు కొన్ని లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే కొన్న ధరలో 50 శాతానికి లేదా వాస్తవిక ధర... ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే ఆ ధరకు అమ్మేయడానికి అధికారం వుంటుంది.

అమ్మేయడానికి కారణాలు... 3జీ సేవలకు అందించడంలో చాలా ఆలస్యం చేయడం వల్ల సంస్థ పనితీరు చాలా దెబ్బ తిన్నదని.. దాంతో 2012-13వ ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి సుమారు రూ. 658.77 కోట్ల నష్టం వాటిల్లిందని డొకొమొ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన కౌరు కటోకటో వెల్లడించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles