Ms rama rao biography sundarakanda hanuman chalisa famous telugu first singer

ms ramarao biography, singer ms ramarao life story, ms ramarao history, ms ramarao photos, ms ramarao story, ms ramarao songs, ms ramarao sundarakanda, ms ramarao hanuman chalisa, ms ramarao family members

ms rama rao biography sundarakanda hanuman chalisa famous telugu first singer : MS Rama Rao is the first singer in Film industry who got sundaradasu title.

తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు

Posted: 03/07/2015 06:01 PM IST
Ms rama rao biography sundarakanda hanuman chalisa famous telugu first singer

‘సుందరదాసు’ బిరుదు పొందిన ఎమ్మెస్ రామారావు.. తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. ఈయన తన మధురకంఠంతో ఎన్నో పాటలు పాడి ప్రేక్షకాదరణ పొందిన గొప్ప సింగర్. ఒక మారుమూల గ్రామంలోని సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఈయన... సినీ ఇండస్ట్రీలో చెరిగిపోని చిరకాల ప్రత్యేక గుర్తింపును సాధించారు. గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన 'సుందరకాండము' (రామాయణంలోని ఒక భాగం), తులసీ దాసు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి ఆకాశవాణి పాడటం... ఈ రెండూ ఈయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.

జీవిత చరిత్ర :

1921 మార్చి 7వ తేదీన గుంటూరు జిల్లా అమృతలూరు మండలానికి చెందిన మోపర్రు గ్రామంలో ఎమ్మెస్ రామారావు  జన్మించారు. ఈయన తల్లిదండ్రులు మోపర్తి రంగయ్య-మంగమ్మ! రామారావుకు చిన్నతనం నుంచే పాటల మీద ఎంతో ఆసక్తి వుండేది. ఈయన విద్యాభ్యాసము నిడుబ్రోలు ఉన్నత పాఠశాలలో, గుంటూరు హిందూ కళాశాలలో జరిగింది. రామారావు గారికి 1942 లో లక్ష్మీ సామ్రాజ్యంతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె (వెంకట సరోజిని), ఇద్దరు కుమారులు (బాబూరావు, నాగేశ్వరరావు).

సినీరంగంలో రామారావు ప్రస్థానం :

1941లో ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం చదువుతున్న రోజుల్లో... అంతర్ కళాశాలల లలిత సంగీత పోటీల్లో పాల్గొన్నారు. ఆ పోటీల్లో ఇతరులకంటే ఈయన అద్భుతమైన స్వరంతో అక్కడున్నవారిని మైమరిపించేవారు. దాంతో ఆయన మొదటి బహుమతి గెలుచుకున్నారు. ఆ సమయంలోనే ఆ పోటీలకు జడ్జిలుగా వ్యవహరించిన వారిలో ఒకరైన అడవి బాపిరాజు.. రామారావును చలన చిత్ర రంగంలో ప్రవేశించమని చాలా ప్రోత్సహించారు. ఆ విధంగా ఆయన ప్రోత్సాహించిన మేరకే ఈయన పరిశ్రమలో ప్రవేశించారు.

1944లో ప్రఖ్యాత సినీ దర్శకనిర్మాత వై.వి.రావు తన ‘తహసీల్దార్’ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటిసారిగా ‘ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా’ అనే పాట పాడించారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇది మొట్టమొదటి నేపథ్యగానం. ఇక అప్పటినుంచి ఆయన వెనుదిరగలేదు. 1944 నుంచి 64 వరకు మద్రాసులో వుంటూ తెలుగు చలన చిత్రాలలో నేపథ్య గాయకునిగా కొనసాగారు. అలాగే 5 సంవత్సరాలపాటు కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకుని, కొన్ని పాటలు వ్రాసి గ్రామ్ ఫోన్ రికార్డులు కూడా ఇచ్చారు.

1963లో కొన్ని కారణాల వల్ల మద్రాసు వదిలి రాజమండ్రి చేరుకున్నారు. అక్కడ నవభారతి గురుకులంలో 10 సంవత్సరాలు ఉద్యోగం చేసారు. 1972 నుండి 74 వరకు తులసీదాసు హనుమాన్ చాలీసాను హిందీ నుంచి తెలుగులోనికి అనువదించారు. తన పేరుతో అవినాభావ సంబంధమేర్పడ్డ 'సుందరకాండ' గేయరచన చేశారు. రామారావుకు 1977లో ‘సుందరదాసు’ అనే బిరుదాన్ని ఇచ్చారు. ఈయన ఏప్రిల్ 20, 1992న హైదరాబాదులో సహజ కారణాల వల్ల మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ms ramarao  sundarakanda  hanuman chalisa  telugu famous singers  

Other Articles