Vishnu vaman shirwadkar biography famous humanitarian writer

vishnu vaman shirwadkar news, vishnu vaman shirwadkar biography, vishnu vaman shirwadkar history, vishnu vaman shirwadkar marathi writer, marathi famous writers, vishnu vaman shirwadkar life story, vishnu vaman shirwadkar photos

vishnu vaman shirwadkar biography famous Humanitarian writer : The biography of vishnu vaman shirwadkar who fought for Disadvantaged groups people.

‘కుసుమగ్రాజ్’ కలంపేరుతో సుపరిచితులైన బహుముఖ ప్రజ్ఞశాలి

Posted: 03/04/2015 06:05 PM IST
Vishnu vaman shirwadkar biography famous humanitarian writer

విష్ణు వామన్ శిర్వాద్కర్... ఈయన గురించి ఒక్కమాటలో చెప్పలేం! ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఈయన... అంచలంచెలుగా ఎదుగుతూ ఎన్నో రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. సమాజంలో అంటరానివారిపై జరుగుతున్న ఆకృత్యాలను అణిచివేసేందుకు నిరసనకారుడిగా అవతారమెత్తిన విష్ణు.. వారికి మద్దతుగా కలం పట్టి ఎన్నో రచనలు చేశారు. ఎన్నో కథలు, నాటకాలు, నవలలు, లఘు కథాచిత్రాలను రచించిన ఈ మానవతావాది.. ప్రసిద్ధ మరాఠీ కవిగా చిరస్థాయిలో నిలిచిపోయారు.

స్వాతంత్ర్యానికి ముందు పూజారులు అంటరానివారిగా భావిస్తున్న కొందరు వర్గాలను దేవాలయాల్లో అనుమతించేవారు కాదు. అటువంటి వర్గాల ప్రజలను విముక్తి కలిగించడం కోసం ఈయన ఐదు దశాబ్దాలుగా కవితలు, నవలలు, లఘు కథలు, వ్యాసాలు, నాటకాలు, ఆరు ఏక పాత్రాభినయనాల నాటకాలు వ్రాసారు. అలా ఆ విధంగా ఈయన రచించిన ఎన్నో రచనలు ఇతరులను ఉత్తేపరిచాయి. ఈ రచనల ద్వారా ఎందరో స్ఫూర్తిపొంది సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టడంలో పాలుపంచుకున్నారు.

జీవిత చరిత్ర :

1912 ఫిబ్రవరి 27న పూణేలో విష్ణు వామన్ శిర్వాద్కర్ జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యను పింపాల్గన్ లోనూ ఉన్నత విద్యను నాశిక్ లోని న్యూ ఇంగ్లీషు పాఠశాలలోనూ పూర్తిచేసారు. ముంబై విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ పూర్తిచేసారు. మొదట ఈయన బాల్యనామం విష్ణు వామన్ శిర్వాద్కర్ వుండేది కానీ.. తరువాత ఆయన తన నామాన్ని ‘కుసుమాగ్రజ్’గా మార్చుకున్నారు.

సమాజసేవ కోసం పాటుపడిన విష్ణు :

ఆ రోజుల్లో పూజారులు హిందూమతంలో అంటరానివారిగా భావిస్తున్న కొన్ని వర్గాలను దేవాలయ ప్రవేశానికి అనుమతినిచ్చేవారు కాదు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆయన తన 20వ ఏట నాశిక్ లో జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి తోడ్పడ్డారు. ఆ సమయంలోనే ఆయన మొదటిసారి "జీవనలహరి" అనే కవితా సంకలనాన్ని ప్రచురించారు.

1942 ఆయన జీవితంలో ముఖ్యమలుపు. ఆయన ‘కుసుమగ్రాజ్’ కవితా సంకలనాన్ని ప్రచురించి మరాఠీ సాహిత్యంలో పితామహునిగా వెలుగొందారు. ఆయన స్వంత ఖర్చులతో "విశాఖ" ప్రచుచించారు. ఈ రచన స్వాతంత్ర్యోద్యమంలో బానిస వ్యవస్థ నిర్మూలనకు ఒక సంకేతాన్ని అందించింది.

1950లలో ఆయన నాశిక్ లో ‘ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ గుడ్’ - ‘లోకహితవాతి మండల్’ను ప్రారంభించారు. ఆయన సమాజికంగా అణగదొక్కబడినవారికి సామాజిక స్ఫూర్తి కలిగించే ఉద్దేశ్యంతో ఈ సంస్థను స్థాపించారు.

1990 లో నాశిక్ లో "కుసుమాగ్రజ్ ప్రతిష్టాన్" అనే సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం ఏమిటంటే.. వివిధ సాంస్కృతిక కార్యకలాపాలను ప్రోత్సహించడమే. ఈ సంస్థ సమాజంలో అణగారిన వర్గాలకు అవసరమైన సహాయాన్ని అందిస్తుంది.

మరికొన్ని విషయాలు :

మరాఠీ సాహిత్యంలో విష్ణు చేసిన కృషికి ప్రతి సంవత్సరం ఆయన పుట్టిన రోజు అయిన ఫిబ్రవరి 27వ తేదీన "మారాఠీ భాషా దినం" గా జరుపుకుంటారు. 1987లో ఆయనకు ప్రతిష్టాత్మకమైన సాహిత్య అవార్డు ‘జ్ఞానపీఠ అవార్డు’ లభించింది. 1985లో ఆయనకు ‘గణేష్ గడ్కారీ అవార్డు’ వచ్చింది. 1986లో పూణే విశ్వవిద్యాలయం ఆయనకు "డి.లిట్" ను అందజేసి సత్కరించింది. 1988లో ఆయనకు సంగీత నాట్య లేఖన్ అవార్డు వచ్చింది.

సమాజంలో ఎన్నో సేవలు అందించి, అందిరలోనూ స్ఫూర్తి నింపిన విష్ణు వాసన్ శిర్వాద్కర్.. 1999 మార్చి 10న మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vishnu vaman shirwadkar  famous indian wrters  

Other Articles