Niels henrik david bohr biography who made foundational contributions to understanding atomic structure and quantum theory

Niels Henrik David Bohr latest news, Niels Henrik David Bohr news, Niels Henrik David Bohr life story, Niels Henrik David Bohr wikipedia, Niels Henrik David Bohr wikipedia in telugu, Niels Henrik David Bohr biography in telugu, Niels Henrik David Bohr researches, Niels Henrik David Bohr family, Niels Henrik David Bohr family, Niels Henrik David Bohr projects

Niels Henrik David Bohr biography who made foundational contributions to understanding atomic structure and quantum theory

పరమాణు వ్యాసార్థాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ‘నీల్స్ బోర్’!

Posted: 11/18/2014 02:39 PM IST
Niels henrik david bohr biography who made foundational contributions to understanding atomic structure and quantum theory

సాధారణంగా ఒక వస్తువు రూపం ఎలావుంటుంది దాని బాహ్యఆకారాన్ని బట్టి తెలుసుకోవచ్చుగానీ.. అది ఎలా ఏర్పడింది..? ఎటువంటి సమూహాలతో ఏకమై వుంది..? ఆ వస్తువు అదే ఆకారంలో ఏర్పడ్డానికి కారణమేమీ..? అన్న విషయాలను మాత్రం ఎవరూ తెలుసుకోలేకపోతారు. అసలు వాటిగురించి ఆలోచించరు కూడా! ఎందుకంటే అటువంటివాటిపై ఎవరికీ అవగాహన వుండదు. కానీ ఒక వస్తువు ఏర్పడ్డానికి అందులో అంతులేని పరమాణువులు కారణమని తెలిపి, వాటి రూపాలను స్పష్టంగా తెలియపరిచాడు ఒక శాస్త్రవేత్త! అతనే నీల్స్ బోర్! పరమాణువు గురించి స్పష్టమైన అవగాహనను కల్పించిన వారిలో ఒకడిగా నీల్స్‌బోర్‌ పేరు పొందాడు.

జీవిత విశేషాలు :

 1885 అక్టోబర్‌ 7న  జర్మనీలోని కోపెన్‌హగెన్‌లో నీల్స్ బోర్ జన్మించాడు. ఇతని తండ్రి జర్మనీలోని విశ్వవిద్యాలయంలో ఫిజియాలజీ ప్రొఫెసర్‌. తన బాల్యంనుంచే విద్యలో అత్యంత ప్రతిభను ప్రదర్శించిన నీల్స్ బోర్... 22ఏళ్ల వయస్సులో తన తండ్రి పనిచేసిన యూనివర్సిటీలోనే తలతన్యతపై పరిశోధనలు చేసి ‘బంగారు పతకా’న్ని సాధించాడు. ఆ దెబ్బతో ఇతని ప్రతిభ ఏంటో అప్పటికే ఆ ప్రాంతమంతా వ్యాప్తి చెందింది. ఇక 26ఏళ్లలో పీహెచ్‌డీ సంపాదించిన బోర్‌, ఆపై ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జిలో ఉండే కావండిష్‌ లేబరేటరీలో సర్‌ ఎర్నెస్ట్‌ రూథర్‌ఫర్డ్‌తో కలిసి పనిచేశాడు. అక్కడ పూర్తిగా పరిశోధనల్లోనే పూర్తిగా లీనమైపోయిన నీల్స్ బోర్.. తన 28ఏటకే పరమాణు నిర్మాణాన్ని ప్రకటించి సంచలనం సృష్టించాడు. అతడు ప్రకటించిన ఆ పరమాణు నమూనా ఆధారంగానే రసాయన శాస్త్రాన్ని, విద్యుచ్ఛక్తిని మరింతగా అర్థం చేసుకోడానికి సులభతరమైంది. అంతేకాదు.. పరమాణు శక్తిని ఉత్పాదించి అభివృద్ధి పరచడానికి కూడా దోహద పడింది.

పరిశోధనలు :

ఏ పదార్థమైన పరమాణువులతో నిర్మితమైందన్న విషయం అందరికీ తెలిసిందేకానీ.. కంటికి కనిపించని ఆ పరమాణువు నిర్మాణం ఎలా ఉంటుంది? దాని లోపలి దృశ్యం ఎలా ఉంటుంది? అన్న విషయాలను కళ్లకు కట్టినట్టు చూపించిన తొలి శాస్త్రవేత్త నీల్స్‌బోర్‌. హైడ్రోజన్ పరమాణు వ్యాసార్థాన్ని గణించాడు. పరమాణువు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు కక్ష్యల్లో తిరుగుతూ ఉంటాయని, ఆ కక్ష్యల్లో శక్తి స్థిరంగా ఉంటుందని ప్రవేశపెట్టిన నీల్స్ బోర్... ఆ కక్ష్యలను ‘స్థిరకక్ష్యలు’గా నామకరణం చేశాడు. బయటి కక్ష్యలలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఆ మూలకపు రసాయన ధర్మాలను నిర్ణయిస్తుందని ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం ఎంతో ప్రాచుర్యం పొందింది. అణు, పరమాణు నిర్మాణాలను వివరించడానికి తొలిసారిగా సంప్రదాయ యాంత్రిక శాస్త్రాన్నీ (classical mechanics), క్వాంటమ్‌ సిద్ధాంతాన్ని అనుసంధానించిన తొలిశాస్త్రవేత్త, రూపశిల్పి ఆయనే! పరమాణువుల నిర్మాణం, అవి వెలువరించే కిరణాల ఆవిష్కరణకు గాను ఆయనకు 1922లో నోబెల్‌ బహుమతి లభించింది.

పరమాణు నిర్మాణం :

పరమాణు కేంద్రకం చుట్టూ పరిభ్రమించే ఎలక్ట్రాన్లు... ఎక్కువ శక్తిగల కక్ష్య నుంచి తక్కువ శక్తిగల కక్ష్యలోకి దూకినప్పుడు కాంతి రూపంలో శక్తిని వికిరణం చేస్తాయని బోర్‌ తెలిపాడు. ఎలక్ట్రాన్‌ వెలువరించే ఈ శక్తి వికిరణం విడివిడిగా ప్యాకెట్ల రూపంలో వెలువడుతుంది. అలా వెలువడిన ఒక ప్యాకెట్‌ శక్తి(క్వాంటం)ని ‘ఫోటాన్‌’ అంటారు. అధిక ఉష్ణోగ్రతకు గురిచేసినప్పుడు మూలకాలు వెదజల్లే కాంతిని గాజు పట్టకం ద్వారా ప్రసరింప చేస్తే వేర్వేరుగా వర్ణపటాలు వెలువరిస్తాయని.. వాటిని బట్టి ఆయా మూలకాలను గుర్తించవచ్చని ప్రకటించాడు. బోర్‌ పరిశోధనల ఆధారంగానే ఆవర్తన పట్టిక రూపకల్పన, కేంద్రక విచ్ఛిత్తిపై సమగ్ర అవగాహన సాధ్యమయ్యాయి. శాస్త్రీయరంగంలో నీల్స్ అందించిన సేవలకు గానూ ఎన్నో బహుమతులు, పురస్కారాలు లభించాయి. అవికూడా ఎంతగాఅంటే.. ఆయనకు లభించిన పురస్కారాలు శాస్త్రలోకంలో మరే శాస్త్రవేత్తకూ లభించలేదంటే ఎంతటి గొప్ప శాస్త్రవేత్తో అర్థం చేసుకోవచ్చు.

యావత్తు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల్లో తనకంటూ చెరిగిపోని ఒక ప్రత్యేక ముద్రవేసుకున్న శాస్త్రవేత్త నీల్స్‌ హెన్రిక్‌ డేవిడ్‌ బోర్‌.. తన 77వ ఏటలో (1962 నవంబర్ 18) తుదిశ్వాస విడిచాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles