Sankarambadi sundarachari biography who wrote andhra pradesh state song for telugu people

ankarambadi sundarachari news, sankarambadi sundarachari history, sankarambadi sundarachari life story, sankarambadi sundarachari story, sankarambadi sundarachari biography, sankarambadi sundarachari family, sankarambadi sundarachari wikipedia, sankarambadi sundarachari wikipedia in telugu, sankarambadi sundarachari photos, sankarambadi sundarachari writings, telugu literatures,

sankarambadi sundarachari biography who wrote andhra pradesh state song maa telugu talliki mallepudanda for telugu people

తెలుగు ప్రజలకు రాష్ట్రగీతం అందించిన సుందరాచారి

Posted: 11/19/2014 04:46 PM IST
Sankarambadi sundarachari biography who wrote andhra pradesh state song for telugu people

తెలుగు రచయితల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న శంకరంబాడి సుందరాచారి... తెలుగు ప్రజలకు ఉమ్మడి ఆంధ్రరాష్ట్రానికి రాష్ట్రగీతమైన ‘‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’’ అందించారు. ఆయన మాతృభాష తమిళం అయినప్పటికీ.. తెలుగుసాహిత్య రంగంలో మంచిపాత్రను పోషించారు. ఇతర రచయితలతో పోల్చుకుంటే ఈయన వ్యవహారశైలి చాలా భిన్నంగా వుంటుంది. అందుకు ఉదాహరణగా.. ఆంధ్రపత్రికలో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఒక ప్రముఖునిపై పద్యం రాయవలసి వచ్చింది. అయితే ఆయన వ్యక్తులపై పద్యాలు రాయకూడదని భీష్మించుకుని.. ఆ ఉద్యోగాన్నే వదులుకున్నారు.

జీవిత విశేషాలు :

1914 ఆగస్టు 14వ తేదీన సుందరాచారి జన్మించారు. ఈయన మాతృభాష తమిళం అయినప్పికీ.. తెలుగులో ప్రావీణ్యం పొందారు. మదనపల్లెలో ఇంటర్మీడియెట్ వరకు చదివారు. బ్రాహ్మణోచితములైన సంధ్యావందనము వంటి పనులు చేసేవాడు. ఒకనాడు తండ్రి మందలించగా జంధ్యాన్ని తెంపివేసాడు. దాంతో తండ్రి మరోసారి మందలించగా.. అందుకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఆయన కడుపు నింపుకోవడం కోసం ఎన్నో పనులు చేశారు. తిరుపతిలో హోటలు సర్వరుగా, రైల్వే స్టేషనులో కూలీగా,  ఆంధ్ర పత్రికలో అచ్చుదోషాలు దిద్దేవాడిగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా... ఇలా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు ఆయన నిర్వర్తించారు.

సాహితీ వ్యాసంగం :

శంకరంబాడి సుందరాచారి గొప్ప కవి. తేటగీతిలో ఎన్నో పద్యాలు వ్రాసాడు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రగీతమైన ‘‘మా తెలుగు తల్లికి’’ కూడా తేటగీతిలో రాసిందే! ఆ గీతంలో ఆయన రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన నేపథ్యంలో.. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి గౌరవించింది. మహాత్మాగాంధీ హత్య జరిగినపుడు ఆవేదన చెంది ‘‘బలిదానం’’ అనే కావ్యం వ్రాసారు. ‘‘సుందర రామాయణం’’ అనే పేరుతో రామాయణం రచించారు. అలాగే సుందర భారతం కూడా వ్రాసారు. తిరుపతి వేంకటేశ్వర స్వామి పేరు మకుటంగా ‘‘శ్రీనివాస శతకం’’ రచించాడు. ఇవే కాక జపమాల, బుద్ధగీతి అనే పేరుతో బుధ్ధ చరిత్ర కూడా రాసారు. ‘‘ఏకలవ్యుడు’’ అనే కావ్యం, ‘‘కెరటాలు’’ అనే గ్రంథాలను రచించారు. ‘‘సుందర సుధా బిందువులు’’ అనే పేరుతో భావ గీతాలు వ్రాసారు. జానపద గీతాలు వ్రాసారు... స్థలపురాణ రచనలు చేసారు.

ఇలా ఈ విధంగా సాహితీరంగంలో ఎన్నో సేవలు చేసిన ఆయనను ‘‘శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం’’ ‘‘ప్రసన్న కవి’’ అని గౌరవించింది. ఆయనను భావకవి అనీ, అహంభావకవి అనీ కూడా అనేవారు. సుందరకవి అన్నది ఆయన మరోపేరు. ఈవిధంగా సాహిత్యరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. 1977 ఏప్రిల్ 8వ తేదీన తుదిశ్వాస విడిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles