ఆచార్య ఆత్రేయగారి అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. ఈయన తన బాల్యం నుంచే నాటకాలలో వుండే పద్యాలను తప్పులు లేకుండా రాగయుక్తంగా చదివేవారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కుంటూనే నాటకాలను రచించేవారు. తెలుగు సినీపరిశ్రమలో రంగప్రవేశం చేసిన తరువాత ఆచార్య ఆత్రేయగా తన పేరును మార్చుకున్నారు.
ఈయన తెలుగులో ఎన్ని సుప్రసిద్ధ నాటకాలను, కథలను, సినిమాలోని పాటలను - మాటలను రచించడమే కాక.. దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. ప్రముఖ నటుడయిన కొంగర జగ్గయ్యగారు.. ఆత్రేయగారి మరణానంతరం ఈయన రాసిన పాటలు, నాటకాలు, నాటికలు, కథలు మొదలైన రచనలన్నీ ఏడు సంపుటాలలో ప్రచురించి.. ఆప్తమిత్రుడైన ఆత్రేయగారికి గొప్ప నివాళిని అర్పించారు.
బాల్యం - జీవితం :
1921వ సంవత్సరంలోని మే 7వ తేదీన కృష్ణమాచార్యులు, సీతమ్మ దంపతులకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సుళ్లూరుపేట మండలంలో గల మంగళపాడు గ్రామంలో ఆత్రేయగారు జన్మించారు. ఈయనకు చిన్నప్పటి నుంచే నాటకాల మీద ఎంతో ఆసక్తి వుండేది. తన బాల్యంలోనే ఈయన నాటకంలో వుండే పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. రచనల మీద ఎంతో ఆసక్తి వుండేది. చుట్టూ వున్న వాతావరణ పరిస్థితులు, సమాజంలో వున్న మధ్య తరగతి కుటుంబాల సమస్యలను తీసుకుని, ఆత్రేయగారు ఎన్నో నాటకాలను రాశారు. అందులో ‘‘ప్రవర్తన’’, ‘‘ఎన్.జీ.వో’’ వంటి నాటకాలు ఎంతో ప్రాచుర్యం చెంది, ఆంధ్ర నాటక కళా పరిషత్ అవార్డులను గెలుచుకున్నారు.
అదేవిధంగా ‘‘కప్పలు’’ అనే నాటకం ఎంతో ప్రాచుర్యం చెందింది. అలాగే ప్రాంతాలవారీగా సంబంధించిన కొన్ని నాటకాలను ఈయన రచించారు. రాయలసీమ క్షామ పరిస్థితుల గురించి వివరించే ‘‘మాయ’’ నాటకం, స్వాతంత్ర్యం తరువాత దేశంలో జరిగిన హిందూ, ముస్లింల హింసాకాండల గురించి తెలిపే ‘‘ఈనాడు’’ నాటకం, లోక కల్యాణం (శాంతి)ని కాంక్షించే ‘‘విశ్వశాంతి’’ వంటి నాటకాలను తనదైన శైలిలో రచించి, అందరి ఆదరాభిమానాలను పొందారు. ‘‘సామ్రాట్ అశోక’’, ‘‘గౌతమ బుద్ధ’’, ‘‘భయం’’ వంటి నాటకాలను కూడా రాశారు. ఇందులో ముఖ్యంగా ‘‘విశ్వశాంతి’’ నాటకానికి రాష్ట్రస్థాయి బహుమతి కూడా లభించింది.
ఆత్రేయగారు కేవలం నాటకాలనే కాదు.. చలన చిత్రాలకు సంబంధించిన కథలను, గీతాలను, మాటలను కూడా రచించారు. 1950వ సంవత్సరంలో విడుదలయిన ‘‘దీక్ష’’ సినిమాకు మొట్టమొదటిసారిగా గీతాలను రచించారు. ఆ తరువాత అదే సంవత్సరంలో ‘‘సంసారం’’ చిత్రానికి తొలిసారి కథను రచించి, అందించారు. ఈయన రచించిన పాటలు చాలావరకు మనసుకు సంబంధించిన ప్రస్తావన ఎక్కువగా వుండడంతో ‘‘మనసు కవి’’గా పేరు పొందారు.
ఆత్రేయ గురించి కొన్ని విషయాలు :
ఆత్రేయగారు తన రచనలను ఎంతో మనోహరంగా తీర్చిదిద్దుతారో... అంతే ఎక్కువ సమయాన్ని కూడా తీసుకునేవారు. నిర్మాతలు కుదిర్చిన సమయంలో రాయకుండా.. వారిని రాత్రింబవళ్లు ఆయన చుట్టూ తిప్పుకుంటూ ఏడిపించేవాడని ఓ ఛలోక్తి. అయితే ఆయన మాత్రం దానికి సమాధానంగా.. ‘‘నేను కూడా రాసే సమయంలో ఎంత ఏడుస్తానో ఎవరికి తెలుసు’’ అని చెప్పేవారు. ఆయన తన పాటలలో మంచి హావభావాలను పలికించేవిధంగా ద్వంద్వ అర్థాలను ప్రతిఫలించేవారు. దాంతో ఆయనకు బూత్రేయ అని పేరు వచ్చింది.
ఒకానొక సందర్భంలో ఆత్రేయగారు ఏదో ఒక చిత్రానికి పాట రాయవలసి వచ్చినప్పుడు ఎక్కువ సమయాన్ని కేటాయించారు. దాంతో ఆ సినిమా నిర్మాత ఈయన మీద కస్సుబుస్సుమన్నాడు. అప్పుడు ఆయన బస చేస్తున్న హోటల్ పేరు ‘‘చోళ’’. అందుకే పాటరాయడానికి ‘‘పల్లవి’’ తట్టడంలేదని తెలివిగల సమాధానం చెప్పి... వెంటనే వేరే హోటల్ కు తన బసను మార్చుకున్నారు. తరువాత వెంటనే ఆ పాటను హావభావాలు కలిగిన మాటలలోనే పూర్తి చేసేశారు. ఇందులో విశేషమేమిటంటే... ఆయన ఇంతకుముందు బస చేసిన చోళ హోటల్, పాటలో వుండే పల్లవిలను చోళులకు, పల్లవులకు మధ్య బంధాన్ని కలుపుతూ విశ్లేషించారన్నమాట. ఎందుకంటే చోళులకీ, పల్లవులకీ ఎలాగో పడదు కాబట్టి!
ఇలా ఈయన గురించి కథలను చెప్పుకుంటే పోతే ఒక పెద్ద పుస్తకాన్నే తయారుచేయాల్సి వస్తుంది. అలాగే సినిమాలలో ఈయనగారు రాసిన మాటలు కూడా ఎంతో ఉత్సాహాన్ని, సందేశాలను కూడా మనకు పంచి పెడతాయి. అందులో ముఖ్యమైనవి కొన్ని ప్రేమ్ నగర్ సినిమాలో రాసిన మాటలు...
1. డోంట్ సే డ్యూటీ. సే బ్యూటీ. బ్యూటీని చెడగొట్టేదే డ్యూటీ.
2. నిలకడ కోసం, ఏ మాత్రం నిలకడ లేని వా దగ్గర కొచ్చారా ? (ఇంటర్వ్యూ సన్నివేసం)
3. ఇక్కడనుంచే మా అధికారం ప్రారంభం అవుతుంది. అహంకారం విజృంభిస్తుంది. ఇక్కడి వందల వేల ఎకరాల స్ధలం అంతా మాదే. కాని, చివరకు మనిషికి కావలసింది అటు ఆరడుగులు. ఇటు రెండడుగులు.
ఇలా ఈ విధంగా సాగిన ఈయన సినీ జీవితంలో ‘‘వాగ్ధానం’’ అనే సినిమాకు దర్శకత్వంతోపాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. తెలుగు సాహిత్యరంగానికి ఈయనగారు అందించిన సేవలకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీవారు గౌరవ డాక్టరేట్ ప్రధానం కూడా చేశారు. తెలుగు పాటలను మనసుతో ఆస్వాదించే విధంగా అందించిన ఈ మనసు కవి చివరకు 1989 సెప్టెంబరు 13వ తేదీన కన్నుమూశారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more