గుమ్మడి వెంకటేశ్వరరావు అంటే తెలియని వారు తెలుగునాట ఉన్నారంటే అది అతిశయమే. అద్వితీయమైన గుణచిత్రనటనతో ఆయన తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ముద్రవేసుకున్నాడు. పౌరాణిక చిత్రాలు, సాంఘిక చిత్రాలు, జానపద చిత్రాలు, చారిత్రక చిత్రాలు ఏవిధమైన చిత్రమైనా అయన తనవేషంలో జీవించాడు. తండ్రిగా, అన్నగా, తాతగా వేషమేదైనా దానిని తన నటనతో పండించడం అతడికి కరతలామలకం. అన్ని రకాల వేషాలు ఆయన ధరించినా సాత్విక వేషాలలో ఆధిక్యత సాధించి ప్రేక్షకులను మెప్పించాడు. అయన తన పూర్తి పేరుతో కంటే ఇంటి పేరైన గుమ్మడి పేరుతోనే తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచి పోయాడు. ఆంధ్రుల పంచకట్టులోని హందాతనాన్ని ప్రతిబింబించిన ఏకైక నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు. తెలుగు విశ్వవిద్యాలయం మహామంత్రి తిమ్మరుసు(1962)లో కధానాయకుడి పాత్రకు జీవం పోసిన గుమ్మడిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.
జాతీయ సినిమా బహుమతులకు న్యాయనిర్ణేతగా మూడు సార్లు, రెండు సార్లు నంది బహుమతుల సంఘం సభ్యునిగా మరియు రెండు సార్లు నంది బహుమతుల సంఘం అధ్యక్షునిగా పనిచేశాడు. ఎన్టిఆర్ అవార్డు మరియు రఘపతి వెంకయ్య అవార్డు న్యాయ నిర్ణేతగా వ్యవహరించాడు. ఆయన తనజీవిత చరిత్ర తీపిగుర్తులు చేదు జ్ఞాపకాలు అన్న పేరుతో రచించాడు. ఆయనకిద్దరు (1995) లో ఆరోగ్యం సరిగాలేక గొంతు సరిగా పనిచేయనప్పుడు, ఇతరుల గొంతు వాడటంఇష్టంలేక నటించటం మానుకున్నాడు. మరల జగద్గురు శ్రీ కాశినాయన చరిత్ర (2008) లో ఆయన వయస్సు మరియు గొంతు సరిపోతుంది కాబట్టి నటించాడు. తెలుగు సినిమా రంగములో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు జననం జూలై 9, 1927, మరణం.జనవరి 26, 2010 ) తెలుగు చలనచిత్రరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా అనుభవమున్న నటుడు.
ఈయన 500కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించాడు. గుమ్మడి కి ఐదుగురు కుమార్తెలు మరియు ఇద్దరు కుమారులు. గుమ్మడి స్వగ్రామము గుంటూరు జిల్లా తెనాలి సమీపములోని రావికంపాడు. ఈయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి బసవయ్య, తల్లి బుచ్చమ్మ. ముగ్గురు తమ్ములు, ఒక చెల్లి ఉన్నారు. కుటుంబ సభ్యుల అప్యాయతానురాగాల మధ్య గారాబంగా గుమ్మడి జీవితం గడిచింది. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన కారణంగా బంధాలు అనుబంధాలు అనుభవ పూర్వకంగా తెలుసుకోవడానికి అయనకు అవకాశం కలిగింది. తన తండ్రి బసవయ్య, పెదనాన్న నారయ్యలు, రక్తసంబంధంతోనే కాక స్నేహానుబంధంతో మెలిగేవారని గుమ్మడి మాటలలో తెలుస్తుంది.
గుమ్మడి వెంకటేశ్వరరావు నాయనమ్మకు అమ్మమ్మ 103 సంవత్సరాలు జీవించడం వారి కుటుంబంలో ఒక విశేషం. గుమ్మడి కమ్యూనిష్టు భావాలతీ ప్రభావితుడై ఉన్నాడని అందువలన కళాశాలలో సీటు ఇవ్వవద్దని అభర్ధన చేయడం వారికి గుమ్మడి మీద విశ్వాసం కలగలేదన్న దానికి నిదర్శనం. స్వాతంత్ర్య పోరాట వీరుడైన కళాశాల ప్రిన్చిపాల్ తమ విద్యార్ధులలో చాలా మందికి రాజకీయప్రవేశం ఉన్నదని తాము వారిని సరి అయిన త్రోవలో నడిపించగలమని పెద్దలకు నచ్చచెప్పి కళాశాలలో చేర్చుకున్నాడు. ఆయన సహవిద్యార్ధి ప్రముఖ చలనచిత్ర నటి సీనియర్ శ్రీరంజని కుమారుడైన ఎమ్. మల్లిఖార్జున సాహచర్యంతో ఆయనలో కలిగిన విపరీత చలనచిత్ర మోహం వలన, ఇంటర్ పరీక్షలో అపజయం ఎదురైంది.
ఈ అపజయంతో అవకాశం లభించిన పెద్దలు, ఆయనను వెనుకకు పిలిచి వ్యవసాయపు పనులను అప్పగించారు. అంతటితో ఆయన విద్యార్ధి జీవితం ఒక ముగింపుకు వచ్చింది. ఒకసారి ఆయనను మాధవపెద్ది వెంకట్రామయ్య స్వయంగా పిలిచి ఆయనకు దుర్యోధన పాత్రకు ఎలా మెరుగు పెట్టాలో నేర్పించి అబ్బురపరిచాడు. ఆ తరువాత వారిరువురికి పెరిగిన పరిచయం మాధవపెద్ది వెంకట్రామయ్య నాటకంలో గుమ్మడి వెంకటేశ్వరరావు దుర్యోధన పాత్ర వహించి, మాధవపెద్ది వెంకట్రామయ్య కర్ణపాత్ర వహించి నటించే వరకు వచ్చింది. ఆ నాటకంలో నటించిన అనంతరం ఆయన గుమ్మడి వెంకటేశ్వరరావుతో " నాటకం బాగా చేసావు కాని నాటకంలో నటించడానికి కావలసిన ఆంగికాఅభినయం కంటే సాత్విక అభినయం అధికంగా ఉంది. చలన చిత్రాలలో ప్రయత్నిస్తే అభివృద్ధిలోకి వస్తావు " అని సలహా ఇచ్చాడు. ఆ తరువాత గుమ్మడి మనసు చలనచిత్ర రంగం వైపు మొగ్గింది.
గుమ్మడి వెంకటేశ్వరరావు తొలి సారిగా చలనచిత్ర నటనాభిలాషతో, మల్లిఖార్జునరావుతో కలిసి మద్రాసుకు ప్రయాణం చేసాడు. మద్రాసులో కె.ఎమ్.రెడ్డి, హె.ఎమ్.రెడ్డి వంటి వారిని కలిసి అవకాశం కొరకు అర్ధించి చూసాడు. వారు ఆయనకు సుముఖమైన సమాధానం ఇవ్వక పోవడంతో తిరిగి తెనాలి వెళ్ళి యధావిధిగా జీవితం సాగించాడు. సౌందరరాజ అయ్యంగార్ ఆయనకు అవకాశం ఇవ్వడానికి మొగ్గు చూపడంతో గుమ్మడి వెంకటేశ్వరరావు చలనచిత్ర జీవితం ఆరంభం అయింది. గుమ్మడి వెంకటేశ్వరరావును తంతిద్వారా మద్రాసుకు రప్పించి చిత్రంలో అవకాశం ఇచ్చి వెయ్యి రూపాయల పారితోషికం ఇచ్చి చెప్పినప్పుడు రమ్మని చెప్పి పంపారు. ఆ చిత్రం పేరు అదృష్టదీపుడు (1950) దానిలో గుమ్మడి వెంకటేశ్వరరావు పాత్ర ముక్కామల అసిస్టెంట్. రెండవ చిత్రం నవ్వితే నవరత్నాలు మూడవ చిత్రం పేరంటాలు, నాలుగవ చిత్రం ప్రతిజ్ఞ వీటన్నింటిలో చిన్న చిన్న పాత్రలు మాత్రమే లభించాయి. తదుపరి, అవకాశాలు లేవని, తిరిగి వెళ్ళాలని భావించిన సమయంలో, ఎన్.టి. రామారావుతో కలిగిన పరిచయం వలన ఆయన గుమ్మడి వెంకటేశ్వరరావును తిరిగి వెళ్ళవద్దని, తన స్వంత చిత్రంలో మంచి పాత్ర ఇస్తానని వాగ్దానం చేసాడు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్.టి. రామారావు ఆయనకు తన స్వంత చిత్రం పిచ్చిపుల్లయ్య చిత్రంలో ప్రతినాయక పాత్ర ఇచ్చాడు.
ఆ చిత్రంతో గుమ్మడి జీవితం మరో మలుపు తిరిగింది. ఎన్.టి.రామారావు తన తరువాతి చిత్రం తోడు దొంగలు చిత్రంలో ప్రధాన పాత్ర అంటే తోడుదొంగలుగా అయన, ఎన్.టి.రామారావు నటించారు. ఆ చిత్రం విజయం సాధించక పోయినా దానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు లభించడం విశేషం. గుమ్మడి వయసులో చిన్నవాడే అయినా అనేక చిత్రాలలో ఆ ఇరువురి నటులకు తండ్రిగా, మామగా నటించాడు. నటించిన పాత్రలో ఒదిగిపోతూ అన్నిరకాల పాత్రలూ ధరించాడు. పౌరాణిక, జానపద, చారిత్రిక, సాంఘిక చిత్రాలన్నిటిలోనూ పాత్రలు పోషించాడు. అత్యంత విరుద్ధమైన వశిష్ట, విశ్వామిత్ర పాత్రలు రెంటిని గుమ్మడి ధరించి ప్రశంసలు అందుకున్నాడు. గుమ్మడి వెంకటేశ్వరరావు నటించిన అర్ధాంగి చిత్రంలో ఆయనకు భార్యగా నటించిన శాంత కుమారి ఆయనకంటే 8 సంవత్సరాలు పెద్దది. అలాగే ఆయనకు పెద్ద కుమారుడిగా నటించిన అక్కినేని నాగేశ్వరరావు ఆయనకంటే 3 సంవత్సరాలు పెద్ద. ఆయన చిన్న కుమారుడిగా నటించిన జగ్గయ్య ఆయన కంటే 1 సంవత్స్దరం పెద్ద. చిత్రాలలో నటించడానికి మద్రాసు వచ్చి తీసుకు వచ్చిన డబ్బులు అయిపోయి రెండు రోజుల మంచినీటితో సరిపెట్టుకున్నాడు.
ఆ తరువాత కంపెనీ డైరెక్టర్ సహాయం చేస్తానని చెప్పిన నిరాకరించి ఖర్చుల కొరకు తన పెళ్ళినాటి ఉంగరం తాకట్టు పెట్టి తిరిగి విడిపించుకున్నాడు. ఆయన జీవితంలో ఆయన భోజనానికి ఇబ్బంది పడిన రోజులు ఇవేనని ఆయనమాటల వలన తెలుసుకోవచ్చు. గుమ్మడి చివరిసారిగా 2008 సంవత్సరంలో జగద్గురు శ్రీ కాశీనాయని చరిత్ర సినిమాలో తన జీవితానికి దగ్గరగా వున్న కాశీనాయన పాత్ర పోషించాడు. గుమ్మడి 'చేదు గుర్తులు, తీపి జ్ఞాపకాలు' పేరుతో జీవనస్మృతుల్ని అక్షరీకరించాడు. తొలి ముద్రణ ప్రతులన్నీ, కొద్ది రోజులలోనే చెల్లిపోవటం గుమ్మడి పట్ల తెలుగు ప్రేక్షకులకున్న అభిమానానికి ఓ ఆనవాలు. నటుడిగా అవకాశాలు వచ్చినా ఆధునిక చిత్రసీమ యొక్క పోకడ నచ్చక చివరి కాలంలో నటనకు దూరంగా ఉన్నాడు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more