Dr y s rajasekhara reddys 64th birth anniversary

dr y.s. rajasekhara reddys 64th birth anniversary, ysr jayant, ysrcp, ys vijayamma, ysr family, ysr congress party, ys jagan, jagan-ysr, ys bharathi,

Dr Y.S. Rajasekhara Reddys 64th birth anniversary

మహానేత వై‌యస్ రాజశేఖ‌రరెడ్డి జయంతి వేడుకలు

Posted: 07/08/2013 11:32 AM IST
Dr y s rajasekhara reddys 64th birth anniversary

ఇప్పటివరకు రాజకీయ నాయకులుగా ప్రజల మనసును గెలుచుకున్న నాయకులు ఇద్దరే. ఒకరు నటుడు నందమూరి రామారావు, మరోకరు వైఎస్ రాజశేఖరరెడ్డి. ఈ ఇద్దరికి తెలుగు ప్రజలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈరోజు దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖ‌రరెడ్డి 64వ జయంతి వేడుకలు వైసీపీ పార్టీలో, వైఎస్ అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకల సంద‌ర్భంగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ కేంద్ర కార్యాల‌యంలో ర‌క్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల కూడా ర‌క్తదానం, ఉచిత వైద్యసేవ‌లు, పుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. వైయస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలోని సమాధిస్థలి దగ్గర అంజలి ఘటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి వైయస్‌ భారతి, వైయస్‌ కొండారెడ్డి తదితరులు ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌కు వెళ్ళి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టింది. 9.30 గంటలకు మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో అల్‌షిఫా మానసిక వికలాంగుల కేంద్రంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ.

10 .00గంటలకు ఎస్టీ విభాగం ఆధ్వర్యంలో పద్మ మానసిక పునరావాస కేంద్రంలో దుప్పట్ల పంపిణీ.

10.30 గంటలకు నగర మహిళా విభాగం ఆధ్వర్యంలో రాస్ స్వచ్ఛంధ సంస్థలో పండ్లు పంపిణీ.

10.45 గంటలకు శంకరాపురంలోని అంధుల పాఠశాలలో వైఎస్సార్ సీపీ కువైట్ కమిటీ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ

11.00 గంటలకు అమ్మ ఒడిలో జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ

11.30 గంటలకు రిమ్స్‌లో వైఎస్సార్ టీయూసీ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ.

11.45 గంటలకు సాయిబాబా అనాథ శరణాలయంలో ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో అన్నదానం.

12.15 గంటలకు ఆర్తీహోంలో నగర యువజన విభాగం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.

 

12.30 గంటలకు అంధుల పాఠశాలలో రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తార. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా తెలుగువిశేష్ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తుంది.... 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles