Gundamma katha movie completed 50 years

gundamma katha telugu movie completed 50 years poster, gundamma katha telugu movie completed 50 years wallpaper,gundamma katha telugu movie completed 50 years wallpaper,exclusive,movie information

gundamma katha telugu movie completed 50 years poster, gundamma katha telugu movie completed 50 years wallpaper,gundamma katha telugu movie completed 50 years wallpaper,exclusive,movie information

Gundamma Katha Movie Completed 50 years.gif

Posted: 06/07/2012 01:15 PM IST
Gundamma katha movie completed 50 years

Gundamma_Katha_wallposter

NTR_SVR_ANRఎన్ని సార్లు చూసినా మరో సారి చూడాలనిపించే సినిమాలు కొన్నే ఉంటాయి. వాటిల్లో చక్రపాణి సారథ్యంలో విజయా సంస్థ నిర్మించిన చిత్రాలది అగ్రస్థానం. వినోదానికి పెద్ద పీట వేస్తూ సినిమాలు తీయడం ఆ సంస్థకు ఆనవాయితీ. అందుకే విజయా సంస్థ నుంచి సినిమా వస్తోందంటే చాలు ఆరోజుల్లో ప్రేక్షకులు ఆశగా ఎదురుచూసేవారు. అప్పుడే కాదు విజయావారి సినిమాలు ఎప్పుడు ప్రసారమవుతున్నా టివిలకు అతుక్కుపోవడం ఇప్పటి వీక్షకులకు అలవాటు. అలా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్న మరో విజయా చిత్రం 'గుండమ్మ కథ'.ఈ సినిమాలో ఆసక్తికరమైన మలుపులు ఎన్ని ఉన్నాయో, ఈ చిత్రం తెరకు ఎక్కడంలో కూడా అన్ని మలుపులు కనిపిస్తాయి. ఈ సినిమా విడుదలై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్రనిర్మాణ విశేషాలు మరోసారి గుర్తు చేసుకుందాం..

తాము తయారు చేసుకున్న కథలతోనే సినిమాలు తీయడం విజయా సంస్థకు అలవాటు. అయితే ఓ కన్నడ సినిమాని రీమేక్ చేయడమన్నది 'గుండమ్మ కథ' చిత్రంతోనే ప్రారంభం. జానపద బ్రహ్మగా ప్రసిద్ధి పొందిన విఠలాచార్య కన్నడంలో 'మనే తుంబిద హెణ్ణు' అని సినిమా తీశారు. ఈ చిత్రం ఇతర భాషల రీమేక్ హక్కులు నాగిరెడ్డికి ఇచ్చారాయన. ఆ చిత్ర కథ బాగా నచ్చడంతో తన సోదరుడు బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో నిర్మించాలని నాగిరెడ్డి నిర్ణయించుకుని డి.వి.నరసరాజుతో కూర్చుని స్క్రిప్ట్ తయారు చేయించారు.డైలాగ్ వెర్షన్ కూడా పూర్తయింది. అయితే బి.ఎన్.రెడ్డి వంటి పెద్ద దర్శకుడు అప్ కమింగ్ డైరెక్టర్ విఠలాచార్య తీసిన సినిమాను రీమేక్ చేయడం ఎంతవరకూ సబబు అనిపించి మరో డైరెక్టర్‌ని పెడదామనుకున్నారు నాగిరెడ్డి. దర్శకుడు పి.పుల్లయ్య ఈ కథ అంటే ఆసక్తి చూపించడంతో ఆయనకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించాలనుకున్నారు. అయితే ఈ సినిమా ట్రీట్‌మెంట్ నచ్చక వదిలేశారు పుల్లయ్య. దాంతో ఈ చిత్ర నిర్మాణానికి బ్రేక్ పడింది.

విజయా సంస్థ నిర్మించిన ఈ సినిమానిర్మాణంలోనైనా చక్రపాణి ప్రమేయం తప్పనిసరి. అయితే ఈ సినిమా నిర్మాణంలో చక్రపాణి జోక్యం ntr_jamunaచేసుకోకపోవడానికి కారణం ఆయనకి పిచ్చివాళ్లు, కుంటివాళ్లు పాత్రలుగా ఉండే కథ నచ్చదు. అందులోనూ విజయా సంస్థ పర్మనెంట్ హీరో ఎన్టీఆర్‌తో ఇలాంటి పాత్ర వేయించడానికి ఆయన ఒప్పుకోరు. అందుకే నాగిరెడ్డి ప్రయత్నాల్లో ఆయన జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండిపోయారు. తన బేనరులో ఏడాదికి నాలుగు సినిమాలు తీయాలన్నది నాగిరెడ్డి థియరీ. ఒకటి పోయినా మరొకటి పే చేస్తుందన్నది ఆయన ఆర్గ్యుమెంట్. కథ మంచిది దొరకకపోతే సినిమా తీసి ఎందుకు నష్టపోవాలన్నది చక్రపాణి పాలసీ. అయినా నాగిరెడ్డి మాట కాదనలేక విఠలాచార్య చిత్రం తెలుగులో తీయడానికి ఒప్పుకున్నారు. కమలాకర కామేశ్వరరావుని దర్శకునిగా ఎన్నుకున్నారు. చక్రపాణి, డి.వి.నరసరాజు, కామేశ్వరరావు కూర్చుని కథకి ఓ రూపం తెచ్చారు.

అగ్ర హీరోలిద్దరికీ నూరవ సినిమా

'గుండమ్మ కథ' ఎన్టీఆర్ నటించిన నూరవ సినిమా కావడం గమనార్హం. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా తయారైంది. తమిళంలో ఎన్టీఆర్ పాత్రను జెమినీగణేశన్ పోషించగా, తెలుగులో పోషించిన పాత్రలనే తమిళంలోనూ ఎఎన్నార్, సావిత్రి, జమున, ఎస్.వి.రంగారావు పోషించారు. ఆ రకంగా అక్కినేనికి ఇది నూరవ సినిమా.శత చిత్రాల్లో నటించి స్టార్స్‌ గా వెలుగుతున్న వీరిద్దరు కలిసి నటించిన ఈ చిత్రానికి హీరోల పరంగా కాకుండా గయ్యాళి పాత్ర అయిన గుండమ్మ పేరుతో టైటిల్‌ను నిర్ణయించడం, హీరోలిద్దరూ సహృదయంతో దానికి అంగీకరించడం విశేషంగా పేర్కొనాలి. సాధారణంగా పేరున్న ఇద్దరు హీరోలు నటించే సినిమాల్లో ఎవరో ఒకరికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కానీ కథకుడు చక్రపాణి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎన్టీఆర్, ఎఎన్నార్ పాత్రలకు సమాన ప్రాధాన్యం ఉండేలా తీర్చిదిద్దారు.

anr_jamunaఅగ్రహీరోలతో జమున రీ ఎంట్రీ

'గుండమ్మ కథ' చిత్రానికి ముందు నాలుగేళ్ల పాటు ఎన్టీఆర్, ఎఎన్నార్‌తో వచ్చిన మనస్పర్థల కారణంగా జమున వాళ్లతో కలిసి నటించలేదు. అయితే ఈ చిత్రనిర్మాణ సమయంలోనే చక్రపాణి జోక్యం చేసుకుని వీరి ముగ్గురి మధ్య రాజీ కుదర్చడంతో ఈ సినిమాలో అక్కినేని సరసన జమున నటించారు.

సూర్యకాంతం ఉందిగా..

కన్నడ చిత్రంలోని గుండమ్మ, ఆమె కూతురు, సవితి కూతురు పాత్రలు మాత్రం తీసుకుని మిగిలిన కథ కొత్తగా తయారు చేశారు. కన్నడంలో గుండమ్మకి భర్త ఉంటే, తెలుగులో ఆ పాత్ర తీసేశారు. వితంతువు అయినా ఆమెని రిచ్‌గా చూపించడం కోసం నగలు, పట్టుచీరలు వాడారు. ఈ సినిమా చూసిన తరువాత ఒకాయన చక్రపాణిని అడిగారట.. 'సూర్యకాంతంలో గయ్యాళితనం ఏం చూపించారు?'అని. 'సూర్యకాంతాన్ని పెట్టిన తరువాత ఆవిడ గయ్యాళి అని చెప్పడం ఎందుకు? సీన్లు వేస్ట్' అన్నారట. దటీజ్ చక్రపాణి.

కె.వి.రెడ్డికి నచ్చలేదు

అయిదు దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న 'గుండమ్మ కథ' చిత్రం 1962 జూన్ 7న విడుదలై ఘనవిజయం సాధించింది. జనం ఈ సినిమాని బాగా ఆదరించినా, అగ్ర దర్శకుడు కె.వి.రెడ్డికి మాత్రం ఈ సినిమా నచ్చలేదు. సినిమా ప్రీవ్యూ చూసి ఆయన పెదవి విరిచారు. దీని పై తన అభిప్రాయాలను సరసరాజుతో పంచుకుంటూ.... ‘‘అదేం కథండీ... గుంటూరు జిల్లా సంపన్న వర్గాల కథలా ఉంది.  విడుదలయ్యాక సినిమా హిట్టయిన వార్తని ఆయన చెవిన వేస్తే 'ఈ సినిమాని జనం ఎలా చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదండీ' అన్నారట. ఎప్పుడు ఈ సినిమా కథ ప్రస్తావన తెచ్చిన కె.వి. రెడ్డి ఇదే మాట అనేవారట.

రక్షణనిధికి విరాళం

ఈ చిత్రం సిల్వర్ జూబ్లీ వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహించాలని నాగిరెడ్డి, చక్రపాణి ప్లాన్ చేశారు. అయితే అదే సమయంలో దేశంలో యుద్ధ మేఘాలు ఆవరించడంతో, ఆ కార్యక్రమాన్ని వాయిదా చేసి, జాతీయ రక్షణనిధికి రూ. 25, 116లను అందచేశారు.

Suryakantamరీమేక్ గుండమ్మ కథ ఎప్పుడు?

అలనాటి చిత్రాల్ని రీమేక్ చేయడం తాజా ధోరణి, మల్టీసారర్ చిత్రానికి నిజమైన నిర్వచనంగా నిలిచిన 'గుండమ్మ కథ' సినిమాని మళ్లీ నిర్మించాలనే ప్రయత్నం గతంలో జరిగింది. అగ్రహీరోల వారసులు బాలకృష్ణ, నాగార్జున ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు కానీ గుండమ్మ పాత్ర ఎవరు వేస్తారనే ప్రశ్న ఉదయించడంతో ఆ ప్రాజెక్ట్ అంతటితో ఆగిపోయింది.  మళ్లీ ఇప్పుడు మూడో తరం వారసులు ఎన్టీఆర్, నాగచైతన్య ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తుండటంతో అభిమానుల్లో కొత్తగా ఆశలు చిగురించాయి. గయ్యాళితనం విషయం అటుంచితే రమ్యకృష్ణతో ఆ పాత్ర వేయిస్తే కొత్త గుండమ్మని చూడొచ్చని అనుకుంటున్నారు. అభిమానుల ఆశలు నెరవేరాలని ఆశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Interview with saina nehwal
Happy birthdaysp balasubramaniam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles