Happy birthdaysp balasubramaniam

Twitter,SPB,SP Balasubramaniam,Mani Ratnam,Ilaiyaraaja

Twitter,SPB,SP Balasubramaniam,Mani Ratnam,Ilaiyaraaja

Happy birthday_SP Balasubramaniam.gif

Posted: 06/04/2012 08:26 PM IST
Happy birthdaysp balasubramaniam

456

SP_Balu

నవరస నట సార్వభౌముడు యన్. టీ. ఆర్. పై మునుపటి మన లెజెండ్స్ సాగింది... ఈ మహా నటుడి జయంతి మే 28... మన తెలుగు సినిమా గర్వపడే ఇంకొక నటుడు, 350 సినిమాలకు పైగా నటించిన ఘనత, అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికీ, ప్రేక్షకుల మదిలో సూపర్ స్టార్ గా నిలిచిపోయిన కృష్ణ గారు, ఈ సారి మే 31 తన జన్మ దినాన్ని ఎంతో నిరాడంబరంగా జరుపుకున్నారు...

తెలుగు సిని పరిశ్రమలోనే అత్యధిక సినిమాలు చేసిన నటుడు కృష్ణ... అటు ఫ్యామిలీ హీరో గానే కాక, హాలివుడ్ తరహా కౌబాయ్ పాత్రలు, జేమ్స్ బాండ్ తరహా సినిమాలు, 'సింహాసనం' వంటి అత్యంత భారి బడ్జేట్ సినిమాలు, ఎందరో తలపెట్టి వదిలేసినా 'అల్లూరి సీతారామ రాజు' వంటి ఆణిముత్యాలు, ఇలా ఒకటేమిటి, కృష్ణ గారు తాను చేసిన ప్రతీ పాత్రకి తన వంతు న్యాయం చేసారు... ఒక విధం గా చెప్పాలంటే అప్పటి తరం నటులలో చాలా కాలం వరకు, చిరంజీవి, నాగార్జున వంటి నటులు అగ్ర కధానాయకులుగా కొనసాగటం ఒక దశాబ్దం పూర్తీ అయిన రోజులలో కూడా, కృష్ణ గారు తనదైన పంధాలో దూసుకుపోయి, 'నంబర్ వన్' వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు అందించారు... ఆయన లాగానే ఆయన వారసుడు ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పటి కటినమైన పోటీలో కుడా అగ్ర కథానాయకుడిగా దూసుకుపోతున్నాడు...

ఇక జూన్ 2, సిని పరిశ్రమ లో ఒక మణి పూసా పుట్టిన రోజు... నలుగురి దారిలో వెళ్ళడం ఈ దర్శకునికి అస్సలు నచ్చదు... సినిమాలు ఒక మూస ధోరణిలో వచ్చే 80 ల సమయం లోనే, ఒకరిని ప్రేమించి, ఇంకొకరిని పెళ్ళాడి, భర్త తో విడాకుల వరకు వెళ్లి, పెళ్లి లోని గొప్పతనాన్ని తెలుసుకుని, తిరిగి భర్త తో జీవించే ఒక యువతీ జీవితం లోని వివిధ కోణాలని ఆవిష్కరించే కధతో 'మౌనరాగం' వంటి సినిమా అందించిన ఘనత ఈ దర్శకునిది... 'అంజలి' వంటి మనసుకు హడ్డుకునే సినిమా తీయాలన్న, 'సఖి' వంటి ప్రేమ కథ అందించాలన్న, నేటి యువతరం ఆలోచనలకు అడ్డం పట్టే 'యువ' వంటి సినిమా అయిన, 'రోజా','ఇద్దరు', 'గురు', 'విలన్' ఇలా ఒకటేమిటి, మణి రత్నంగారు చిత్రీకరించే ప్రతీ సన్నివేశం ఒక చరిత్ర... ఈ రోజు దర్శకులు గా రాణిస్తున్న ఎందరికో ఈ దర్శకుడే ఆదర్శం... మణి రత్నం గారు తీసిన సినిమాల్లో ఫ్లాప్లు కూడా లేకపోలేదు... కాని అత్యంత అధికంగా సాంకేతిక విలువలతో, సమాజం లోని ఏదో ఒక కోణాన్ని ఆవిష్కరించేలా కధలు రాయడం లో, సినిమాలు తీయడం లో ఈయన దిట్ట... 'విలన్' అపజయం తరువాత కాస్త వెనుకడుగు వేసిన ఈ దర్శకుడు, తన రాబోయే సినిమాలతో మరింత పుంజుకోవాలని, ఈ జన్మ దిన సందర్భంగా ఆశిద్దాం...

యావత్ భారతీయ సిని సంగీత ప్రపంచం లో, ఎటువంటి హంగులు లేకుండా, డిజిటల్ ఎఫెక్ట్స్ ని ఏమాత్రం ఉపయోగించకుండా, సంగీత వాయిద్యాలనే వాడి, తన సంగీత గ్యానం తో, గాయకుల చే స్వరాలూ సరిగ్గా పలికించగలిగే నైపుణ్యం తో, ప్రక్రుతి అంత స్వచ్చమైన సంగీతం తో నాటికి, నేటికి మాస్ట్రో గా పిలిపించుకుంటున్న సంగీత జ్ఞ్యాని ఈ ఈయన... కొంతమంది ఈయనని దైవం ల కొలుస్తారు, ఇంకొంతమంది ఈయనకి అహం ఎక్కువ అంటారు... ఏది ఏమైనా, సంగీతం పై మన అభిరుచి యెంత మారిన, ఇప్పటికి ఈయన పాటలు మనల్ని మైమరపిస్తాయి... ఈయనే, అగ్ర గాయకుడు యస్. పీ. బాల సుబ్రహ్మణ్యం గారు, 'రాజ' అని పిలుస్తూ గర్వపడే మాస్ట్రో ఇళయరాజా... స్వరాలతో జీవనం చేసే ఈ సంగీత దర్శకుడు, సినిమాలకి స్వరాలూ సమకూరుస్తు సంగీతం నేర్చుకున్నారు అంటే నమ్ముతార??? కాని ఇది నిజం... అయితే సంగీతం అనేది దైవ వరం అని చెప్పేందుకు ఇళయరాజా గారే ఒక ఉదాహరణ... ఏ సంగీత వాయిద్యం అయినా అవలీలగా వాయించే వారట ఈయన చిన్నప్పటి నుండి... ఈ నైపున్యమే, రాజ గారిని యస్. పీ. గారి ట్రూప్లో చేరి, ఆ తరువాత సిని ప్రపంచం వైపు అడుగేసేలా చేసింది... ఈ జూన్ 3 తన జన్మ దినం జరుపుకున్న మాస్ట్రో, ఈ సంవత్సరం మనందరికీ గౌతమ్ మీనన్ దర్శకత్వం లో 'ఎటో వెళ్లి పోయింది మనసు' అనే ప్రేమ కధ లో తన స్వరాలతో మైమరపించబోతున్నారు...

ఇక జూన్ 4 న, ఆ పరమేశ్వరుడి పూర్తీ అనుగ్రహం పొందిన ఒక స్వరం పుట్టింది... తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్న చందంగా, ఈ మహా గాయకుడు ఎంతో మందిలా ఇంగినీరింగ్ విద్యని అభ్యసించి ఉద్యోగాస్తుడవుదాం అనుకున్నాడు... కాని చిన్నపాటి నుండి సరదాగా పాడే అనుఫవాన్నే కాలేజి ఫంక్షన్ లో పాట గా ప్రదర్శించడం, అందరి ప్రోత్సాహం తో సినిమాలో గాయకుడిగా ప్రవేశించడం, ఘంటసాల మాస్టర్ వంటి వారి తోడ్పాటు తో అగ్ర గాయకుల జాబితాలో చేరిపోవడం, ఇంచు మించు అన్ని భాషలలో రోజుకి 17 పాటలు పాదేన్తటి బిజీ అవ్వడం, అన్నీ ఒకదాని తరువాత ఒకటి గా జరిగిపోయాయి... ఈ రోజు ఒక మంచి గాయకునిగా రాణించాలంటే యస్. పీ. బాల సుబ్రహ్మణ్యం గారే ఆదర్శం... కేవలం స్వరాలపైనే కాక, ఉచ్చరించే పదాలు, భాషపై కూడా అవగాహన ఉండాలని నమ్మే ఈయన, ఎంతో మంది ఔత్సాహిక గాయనీ గాయకులకు, అద్భుతమైన తన పాటల కార్యక్రమాల ద్వారా ప్రోత్సాహాన్ని అందించారు, అందిస్తూనే ఉన్నారు... ఈయన నిర్వహించిన కార్యక్రమాల ద్వారా పరిచయం అయిన ఎంతో మంది గాయనీ గాయకులూ, ఈ రోజు సిని పరిశ్రమలో తమదైన అవకాశాలతో దూసుకుపోతున్నారు... యస్. పీ. బి. ఇలా మరింతగా మనకి చేరువవ్వాలనే ఆశిద్దాం...

ఇలా మే, జూన్ నెలలు, తెలుగు సిని పరిశ్రమలో తార పధం లో దూసుకుపోయిన, పోతున్న ఎందరో ఆణిముత్యాలు జన్మించిన సమయం... మరొక్కసారి ఈ మహానుభావులందరికి, ఆంధ్రవిశేష్ హ్యాట్సాఫ్...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gundamma katha movie completed 50 years
Interview with aamir khan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles