Interview with fight masters ram laxman

Interview with Fight Masters Ram Laxman. simha, prema kavali, dookudu, dukudu, shakti, teen maar, Fight masters, Ram Laxman, old people, prakasam district

Interview with Fight Masters Ram Laxman. simha, prema kavali, dookudu, dukudu, shakti, teen maar, Fight masters, Ram Laxman, old people, prakasam district

Interview with Fight Masters Ram Laxman.gif

Posted: 05/15/2012 12:48 PM IST
Interview with fight masters ram laxman

Interview_with_Fight_Masters_Ram_Laxman1

Ram-Laxmanరామ్ లక్ష్మణ్... తెలుగు సినిమాలలో దాదాపు వీరే ఫైట్ మాస్టర్లు. ఎన్నో వైవిద్యమైన ఫైట్లను హీరోల చేత వినూత్నంగా చేయిస్తూ సినీ ఇండస్ట్రీలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. పూర్వ కాలంలో రామాయణంలో రాముడు – లక్ష్మణుడు అన్న దమ్ముల బంధానికి ఎంత పేరు తెచ్చారో వీళ్ళ ఆత్మీయ బంధం కూడా అలాగే ఉంటుంది. మరి వీరు మనతో మంచుకున్న విషయాలు మీకోసం....

1968 సంవత్సరంలో ప్రకాశం జిల్లాలోని కారం చేడు మండలంలో నందిగుంట గ్రామంలో మనోహరమ్మ, రంగారావులకు జన్మించారు. వీరికి ఇద్దరు అక్కయ్యలు, ఒక అన్నయ్యా ఉన్నారు. చదువు విషయానికి వస్తే... ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడంతో ప్రాథమిక స్థాయిలోనే మానేశారు. వారికున్న కొంచెం పొలంలో వాళ్ళ నాన్న వ్యవసాయం చేసేవారు. వారి నాయనమ్మ ఈ ఇద్దరికి ఉదయాన్నే అన్నం మూటకట్టి కర్రకు తగిలించి ఇచ్చేదట. దాన్ని పట్టుకొని పశువుల్ని కాయడానికి వెళ్ళేవారు. వారికి పదహారేళ్ళ వయస్సు వచ్చేసరికి వాళ్ళ ఊళ్లో వారికో గురువు దొరికాడు. అదే, వూరి మధ్యలో బండరాయి. ఓ సారి పెద్దవాళ్ళందరూ దాని దర్గర కూర్చొని ‘మన తాతలు తండ్రులూ దీన్ని ఎత్తగలిగారు. మనలో ఎవ్వరమూ ఎత్తలేకపోతున్నాం‘ అని మాట్లాడుకుంటుండగా విని, ఎలాగైనా ఆ రాయిని లేపాలని నిర్ణయించుకొని.. రోజు రాత్రయ్యేసరికి దాని దగ్గరికెళ్ళి కుస్తీలు పడేవాళ్ళు. ఏడాది తరువాత... ఓ రోజు అందరూ చూస్తుండగా విడివిడిగా ఆ రాయిన ఎత్తేశారు. అప్పట్నుంచి వూళ్లో వారి పేరు మారు మ్రోగింది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనే వాళ్ళకు అర్థమయింది.

సినిమాల్లోకి :

Ram-Laxman1

వీరి ప్రయత్నాలు వాళ్ళ నాన్నకు తెలియడంతో... తన స్నేహితుడి ద్వారా పక్క ఊళ్లో ఉండే రాజు అనే ఫైట్ మాస్టర్ దగ్గరకు తీసుకొని వెళ్ళారు. ఆయనతో మేం 1987లో చెన్నై బయలుదేరి వెళ్లారు. చెన్నై వెళ్లిన రెండేళ్ళకు ఫైటర్లుగా అవకాశం వచ్చింది. మొదట్లో సినిమాల్లో హీరోలతో ఫైట్లు చేసే గ్యాంగ్ ఉండేవారు. సంవత్సరం పని చేశాక.. మనం నటులుగా ఎందుకు చెయ్యకూడదని అనుకొని ‘కలియుగ రామలక్ష్మణులు’ పేరుతో ఓ కథను తయారు చేసుకొని సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఏఎమ్ రత్నం లాంటి వాళ్ళను కలిశారు. ఎక్కడా కథ ఓకే కాలేదు. ఈతరం ఫిలిమ్స్ అధినేత పోకూరి బాబురావు గారి దగ్గరికి వెళ్తే.. మీరు యాక్షన్ కథ చేస్తే క్లిక్ అవుతుంది అనడంతో దాంతో యాక్షన్ నెంబర్ వన్’ కథ సిద్ధం చేసుకున్నారు. కానీ అదే టైంలో మహేష్ బాబు సినిమా ‘వంశీ’ సినిమా షూటింగ్ మొదలైంది. అందులో ఫైటర్లుగా చేస్తున్నసమయంలో వారి స్నేహితుల సలహా మేరకు ఫైట్ మాస్టర్లుగా చేద్దామని ఫిక్స్ అయ్యారు. వెంటనే సురేష్ బాబు గారికి ఫోన్ చేసి, ఫైట్ మాస్టర్లు అవ్వాలనుకుంటున్నాం అని చెప్పడంతో ఆయన ‘అవకాశం ఇస్తాను’ రండి అని అనడంతో...  2001లో ఫైట్ మాస్టర్లుగా పరిచయం అయ్యారు. ‘ఇడియట్ సినిమా’తో మంచి పేరు రావడంతో... రాజమౌళి ‘సింహాంద్రి’ సినిమాలో అవకాశం ఇచ్చారు.  అలా మెళ్ళిమెల్లిగా సినిమాలు చేసుకుంటూ... పెద్ద హీరోలు నాగార్జునతో ‘కింగ్’ మహేష్ బాబుతో ‘ఖలేజా’ ఎన్టీఆర్ రీసెంట్ సినిమా ‘దమ్ము’ పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ ఇంకా చాలా సినిమాల్లో నటించారు.

Ram-laxman2అవార్డులు :

ఆర్య సినిమాకి మొదటి సారి ఉత్తమ ఫైట్ మాస్టర్లుగా నంది అవార్డు గెలుచుకున్నారు. తరువాత ఆంధ్రుడు, ఢీ, నేనింతే, రైడ్ లకు నందులు గెలుచుకున్నారు. ప్రస్తుతం అధినాయకుడు, రెబల్ సినిమాలకు ఫైట్ మాస్టర్లుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు రెండు వందల సినిమాలకు ఫైట్లు కంపోజ్ చేశారు. మేం ఈ స్థాయికి రావడానికి కారణం మమ్మల్ని ప్రోత్సహిస్తున్న దర్శక నిర్మాతలే చలవే అంటున్నారు. మరి వీరు మన్ని సినిమాలకు ఫైట్లు కంపోజ్ చేయాలని ఆశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Padmasri dr d nageshwar reddy interview
Music director mickey j meyer interview  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles