Music director mickey j meyer interview

America, tollywood, indian, films, movies, entertainment, reviews, ratings, film star interviews, pictures,, travel, Money,Movies, box office, gossip, film industry news, indian songs, music, latest box office hits, telugu movie, albums,stills,Audio,songs, telugu, cine, actors, actresses, film star, indian culture, USA, AP, Andhra,DVD,VCD, CD,VHS, tapes, India, andhra

The 25 year old young music director Mickey J Meyer is widely appreciated for his tunes in films e 10th Class and Notebook

Mickey J Meyer interview.GIF

Posted: 05/11/2012 01:22 PM IST
Music director mickey j meyer interview

Mickey_J_Meyer_interview

Mickey_J_Meyer‘హ్యాపీడేస్’, ‘కొత్త బంగారులోకం’, ‘లీడర్’ లాంటి సినిమాల సంగీతంలో ఒక మృదుత్వం ఏదో ఉంటుంది. చెవులకు మరింత ఇంపుగా వినిపించే ఒక తాజా శబ్ద సమాహారమేదో దాగుంటుంది. ప్రస్తుతం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాలకు పనిచేస్తున్న యువ సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్ అంతరంగం...

ఇదిగో, దీనివల్ల నేను సంగీత దర్శకుడిని అయ్యాను అనే డిఫైనింగ్ మూమెంట్ అంటూ ఏమీలేదు నా జీవితంలో. జస్ట్, అయ్యానంతే! మరి సంగీతం పట్ల నేనెందుకు ప్రేమను పెంచుకున్నాను! దీన్ని ప్రేమ కూడా అనను. సంగీతం నాకు సంతోషాన్నిస్తుంది. కాబట్టి, ఈ పని చేస్తున్నాను. అంతకుమించి ఇంకే కారణమూ లేదు. అయితే సంగీతం నాకు పరిచయమైంది నాన్నవల్లే.

వ్యాపారం... సంగీతం...

మా తాతయ్య కాలంలోనే మావాళ్లు ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. కాబట్టి, నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే! తార్నాకలో మాకు టెఫ్లాన్ తయారీ యూనిట్ ఉండేది (ఇప్పుడు లేదు). నాన్న (లలిత్ జైన్) ఆ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా, సంగీతం కోసం సమయం వెచ్చించేవారు. అభిజిత్, సోనూ నిగమ్, కైలాష్ ఖేర్ లాంటి గాయకులతో సంగీత విభావరులు ఏర్పాటు చేసేవారు.ఇంట్లో కూడా తలత్ మహమూద్, మహమ్మద్ రఫీ పాటలో, కర్ణాటక సంగీతమో, గజల్సో, ‘యానీ’ ఆల్బమ్సో వింటూ ఉండేవారు. అమ్మకూ, అన్నయ్యక్కూడా సంగీతం పట్ల అభిరుచి ఉంది. అలా, ఆ గొప్ప సంగీతమంతా నాకు తెలియకుండానే నేనూ వింటూ పెరిగాను. సికింద్రాబాద్‌లోని సెయింట్ మార్క్ స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే, అజీజ్ మాస్టర్ ఇంటికి వచ్చి గజల్స్ నేర్పేవారు. అప్పుడే హార్మోనియం చూట్టం! నాకు పరిచయమైన మొదటి ఇన్‌స్ట్ట్రుమెంట్. ఆయన ద్వారా కొన్నిసార్లు ఆకాశవాణి బాలల కార్యక్రమాల్లో గజల్స్ పాడాను కూడా.

రెహమాన్ ‘డ్రీమ్స్’...

సంగీతం ఏదో నేర్చుకున్నాను, పాడుకుంటున్నాను తప్ప, దానికో లక్ష్యం ఉండాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. అయితే, రెహమాన్‌ను విన్నాక అంతా మారిపోయింది. ఆయన్ని వినగలగడం ఒక అదృష్టంగా భావిస్తాను. అంత పిచ్చి ఆయన కంపోజిషన్స్ అంటే. రోజా, జెంటిల్‌మెన్ లాంటి సినిమాల పాటలు విన్నాక, నేనూ సంగీత దర్శకుడినైపోవాలనిపించింది. ఆ సమయంలోనే శేఖర్ కమ్ముల తీసిన ‘డాలర్ డ్రీమ్స్’ సినిమా వచ్చింది. అలాంటి దర్శకుడికి నేను బాగా సూట్ అవుతాననిపించి వెళ్లి కలిశాను. నా సర్టిఫికెట్స్ చూపించాను. అవకాశముంటే నేనే పిలిపిస్తాను, అని చెప్పి పంపేశారు. ఇలా జరిగిందేమిటి? సంగీత దర్శకుడిని అయిపోవాలి, అని మనసులో పడిపోయింది. ఇక తిరగడం మొదలుపెట్టాను.

దర్శకులు తేజ, దశరథ్, నిర్మాత కేఎల్ నారాయణ లాంటి ఎందరినో కలిశాను. ఊహూ లాభం లేదు. అయితే, వెళ్లి కలిసినప్పుడు మనమేంటో ప్రూవ్ చేసుకోవడానికి నాలుగు డెమో ట్యూన్స్ సిద్ధం చేసుకున్నాను. అప్పుడో మిత్రుడు వీటికి పాటలు కూడా రాయించు, వినిపించడానికి బాగుంటుందని చెప్పాడు. అందుకని గీతరచయిత కులశేఖర్ ఫోన్ నంబర్ సంపాదించాను. ఆయన పాటలు రాసిచ్చారు. నా ఉత్సాహాన్ని గమనించి ఆయనే దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు పరిచయం చేశారు.

Mickey_J_Meyer1పోతే పోనీ... వస్తాయ్ హ్యాపీడేస్

భరద్వాజ అప్పుడు కొత్త సబ్జెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ఇతడికి తెలుగు కూడా సరిగ్గా మాట్లాడ్డం రాదు, ఊరి వాతావరణం తెలియదు, అనకుండా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. నా పట్ల ఇంప్రెస్ అయ్యారు. అలా మొదటి సినిమా ‘పోతే పోనీ’(2005) అవకాశం వచ్చింది. పాటలన్నీ కూడా కులశేఖరే రాశారు. తర్వాత దర్శకుడు చందు నా మ్యూజిక్‌ని మెచ్చి, తన ‘టెన్త్‌ క్లాస్’, ‘నోట్‌బుక్’ సినిమాలకు అవకాశం ఇచ్చారు. వీటితో సంగీతపరంగా గుర్తింపొచ్చినా, మంచి హిట్ పడక నేను ఎస్టాబ్లిష్ కాలేదు.ఓరోజు అనుకోకుండా శేఖర్ కమ్ముల ఆఫీస్ నుంచి ఫోన్! వెళ్లి కలిశాను. ఇంజినీరింగ్ యూత్ బేస్డ్ స్టోరీ (హ్యాపీడేస్) చెప్పారు శేఖర్. ఇందులో సంగీతానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, అంత బరువు నువ్వు మోయగలవా? నిజాయతీగా చెప్పమన్నారు. నేను చేస్తానన్నాను. ఒక సాంగ్ డెమో ఇవ్వమన్నారు. నాక్కొంచెం ఉక్రోషం వచ్చింది. నేను ఆల్రెడీ మూడు సినిమాలు చేశాను, అందులో ఏదైనా వినమన్నాను. వాళ్ల ఆఫీసులో వాళ్లు ఏదైనా ఫ్రెష్ డెమో ఇవ్వమంటే, ఇక అప్పుడు కొత్త ట్యూన్ కట్టుకుని వెళ్లి వినిపించాను. శేఖర్ చాలా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇదే నాక్కావాలన్నంత సంబరపడ్డారు. ఆ పాట: ‘హ్యాపీడేస్... హ్యాపీడేస్...

’కొత్త బంగారులోకంలో విషాదం

హ్యాపీడేస్ విడుదలైంది (2007). సక్సెస్ రుచి చూపించింది. ఓరోజు నేను ఇంటికి వెళ్లగానే, నాన్న గుమ్మంలోనే ఎదురొచ్చి, దగ్గరికి తీసుకుని, గట్టిగా హత్తుకుని, ‘ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు’ అన్నారు. ఆయన్ని మెప్పించే స్థాయికి వచ్చాననుకున్నాను. తర్వాత, ‘కొత్త బంగారులోకం’ (.శ్రీకాంత్ అడ్డాల)తో మరో మంచి ఆల్బమ్ చేయగలిగానన్న తృప్తి లభించింది. అయితే, కేబీఎల్ చూట్టానికి నాన్నవాళ్లు థియేటర్‌కు వెళ్లారు. వెళ్తుండగానే నాన్న హఠాత్తుగా పడిపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్తే బ్రెయిన్ హెమరేజ్ అని తెలిసింది. పెద్ద షాక్! ఇంకా దారుణం, ఆయన క్రమంగా తన జ్ఞాపకశక్తిని కోల్పోవడం మొదలుపెట్టారు.  ఏడాది క్రితం నాన్న శాశ్వతంగా కన్నుమూశారు.

అమెరికా భార్య...

‘లీడర్’(2010; ద.శేఖర్ కమ్ముల) విడుదలైన తర్వాత, డిస్టర్బ్‌డ్‌గా ఉండటంవల్ల కొంతకాలం అమెరికాలో గడిపాను. పాత గాయాల్ని మాన్పడానికి కొత్త మనుషులు కావాలేమో! ఆ సమయంలో ఒక బంధువు ద్వారా షారన్ పరిచయమైంది. తను ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేసేది. ఇద్దరమూ క్రమంగా ప్రేమలో పడ్డాం. నేను సంగీత దర్శకుడిని, సినిమాలకు పని చేస్తాను, ఇవేవీ తనకు తెలియదు. అదే నాకు నచ్చింది. జస్ట్, నేనొక మనిషి, తనొక మనిషి, అంతే! పెళ్లి కూడా అక్కడే జరిగింది.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్...

ఇప్పుడు శేఖర్ కమ్ముల తాజా చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో పాటు, శ్రీకాంత్ అడ్డాల ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’(ని. ‘దిల్’ రాజు) చేస్తున్నాను. పాటలు బాగా కుదిరాయనుకుంటున్నాను. ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా, అని ఎదురుచూస్తున్నాను. సంగీతం నాకు సంతోషాన్నిస్తుంది. అంతమాత్రాన ఇది చేయకపోతే నాకు వేరే జీవితం లేదు అనుకోను. చేయగలను కాబట్టి చేస్తున్నాను. చేయకపోయినా కూడా ఫైన్. నేను ఇంకోరకంగా కూడా బాగా ఉండగలను. ఒక పది సాలిడ్ ఆల్బమ్స్ చేయాలి. ఆ తర్వాత నేను సినిమాలకు పనిచేయకపోయినా సరే!

ప్రొఫైల్...

పూర్తి పేరు: మిక్కీ జైన్ మేయర్Mickey_J_Meyer2
పుట్టినరోజు: 22 ఫిబ్రవరి 1981
తల్లిదండ్రులు: హేమ, లలిత్ జైన్
అన్నయ్య: తరుణ్
పుట్టి, పెరిగింది: హైదరాబాద్
భార్య: షారన్
కూతురు: విల్లో (ఒక చెట్టు పేరు)
సంగీత దర్శకత్వం  వహించిన చిత్రాలు:పోతే పోనీ, టెన్త్ క్లాస్, నోట్‌బుక్,

హ్యాపీడేస్, హరే రామ్,కొత్త బంగారు లోకం, గణేష్, మరో చరిత్ర, లీడర్.
డ్రీమ్ ప్రాజెక్ట్: జానపద పాటల ఆల్బమ్ చేయడం.
లక్ష్యం: ఫ్యామిలీని బాగా చూసుకోవడం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Interview with fight masters ram laxman
Real heroe rangaswamy elango  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles