Gujarat Patidar leader Hardik Patel quits Congress బీజేపి గాలానికి చిక్కిన పటీదార్ ఉద్యమ నేత.!

Only opposes pm hardik patel s resignation letter from cong hints his next move

Hardik Patel, Gujarat state congress working President, Gujarat Patidhar movement, Rahul Gandhi Gujarat Assembly Elections, hardik patel resigns, Gujarat Congress, Hardik Patel BJP, Narendra Modi, opposes PM, Patidhar movement, Gujarat, Congress, Gujarat Assembly Elections 2022, BJP, gujarat, Politics

Patidar leader Hardik Patel, who joined the Congress a little over three years ago, resigned from the party and is believed to be prepping to join the BJP ahead of state elections in Gujarat later this year. Patel’s resignation letter - was scathing in its criticism of the Congress and its leaders who he said, did not have a roadmap for the people, were non-serious and behaved as if they hated Gujarat and Gujaratis.

బీజేపి గాలానికి చిక్కిన పటీదార్ ఉద్యమ నేత.!

Posted: 05/18/2022 09:53 PM IST
Only opposes pm hardik patel s resignation letter from cong hints his next move

గుజరాత్ కాంగ్రేస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పటీదార్ ఉద్యమ నేత హర్థిక్ పటేల్.. సరిగ్గా ఎన్నికలకు ముందు తన మనసు మార్చుకున్నారు. 24 గంటల ముందు తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించిన తరువాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పిన ఆయన.. అందుకు భిన్నంగా ఏకంగా అగ్రనేతను టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పిస్తూ.. పార్టీకి రాం రాం పలికారు. గత గుజరాత్ ఎన్నికలకు ముందు పటీధార్ ఉద్యమంతో గుజరాత్ పటేళ్లను ఒక్కతాటిపైకి తీసుకువచ్చి ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు తీసుకువెళ్లిన నేతలో ఇంతటి నిలకడలేని తత్వం ఎందుకు వచ్చిందా.? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హార్థిక్ పటేల్ కు బీజేపి గాలెం వేసిందా.? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే ఆయన రాజీనామా చేసిన లేఖ పరిశీలిస్తే మాత్రం అదే కరెక్టు అనిపిస్తోంది. ఏ పార్టీతో విభేధించి ఆయన పటీధార్ ఉద్యమాన్ని నడిపించారో.. అదే పార్టీలో చేరడం అసాధ్యమన్న వాదనలను తోసిపుచ్చుతూ హార్థిక్ కాషాయం వైపు మొగ్గుచూసుతున్నారని ఆయన రాజీనామా లేఖ స్ఫస్టం చేస్తోంది. తనకు బీజేపి పార్టీ అంటే వ్యతిరేకత లేదని చెప్పకనే చెప్పిన హర్థిక్.. కేవలం ప్రధానమంత్రి నరేంద్రమోడీని మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. దీంతో ఆయన త్వరలోనే బీజేపి కండువా కప్పుకుంటారన్న విషయం కూడా రమారమి రూడీ అయ్యింది.

కాగా, గత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అంతా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని భావించిన తరుణంలో కేవలం సుడిగాలి పర్యటనలు, భావ్వోద్వేగాల ప్రసంగాలతో అక్కడి ఓటర్లను చివరి నిమిషంలో తనవైసుకు తిప్పుకున్నారు ప్రధాని మోడీ. సముద్రంలో ల్యాండింగ్ చేయడం లాంటి ప్రచారాలతో ఆకట్టుకోవడంతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలకు తన మార్కు సంచలన అరోపణలు చేసి.. గుజరాత్ ఓటర్లకు అలోచించే అవకాశం ఇవ్వకుండా.. కేవలం ఎన్నికల ప్రచారం చివరి రోజున చేసిన వ్యాఖ్యలు ఎన్నికలలో బీజేపికి గెలుపును తెచ్చిపెట్టింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీలు తన హత్యకు పాకిస్థాన్ వ్యక్తులకు సుఫారీ ఇచ్చారని అభియోగాలు చేసిన విషయం తెలిసిందే.

అయితే అది కేవలం ఎన్నికలలో ఓటమి తప్పదని తెలిసి ప్రధాని మోడీ బలమైన అరోపణలు చేశారని నిదానంగా వ్యక్తమైంది. ఒకవేళ అదే నిజమైతే మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీలపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు..ఎందుకు అరస్టు చేయలేదన్న సందేహం మాత్రం ప్రతీ గుజరాత్ వాసీతో పాటు భారత ప్రజల్లోనూ ఉత్పన్నమయ్యింది. తన సోంత రాష్ట్రంలో ఓటమిని మూటగట్టుకుంటే ఇక తరువాతి సార్వత్రిక ఎన్నికలలో కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని భావించే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఇక ఈ వ్యాఖ్యలపై అటు మన్మోహన్ సింగ్ కానీ రాహుల్ గాంధీ కానీ అదే స్థాయిలో ఖండించిన దాఖలాలు కూడా లేకపోవడం గమనార్హం. ప్రధాని మోడీ చేసినవి పక్కాగా అసత్యాలు

ఇదిలాఉంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన పార్టీ అని ఆ పార్టీ నేతలే చెబుతుంటారు. ఇక ఇలాంటి చారిత్ర కలిగిన పార్టీలో ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. ఇక దీనికి తోడు కాంగ్రెస్ పార్టీపై చాలానే జోకులు కూడా పేలుతుంటాయి. ఈ చారిత్రక పార్టీలో ఎగిరెగిరి దంచినా.. గమ్మున దంచుకుంటూ పోయినా ఒకే రకంగా కూలి అన్న విమర్శలు ఉన్నాయి. అయితే వీటన్నింటికీ చెక్ పెట్టేలా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్కడిక్కడ వార్నింగ్ ఇస్తూనే వున్నారు. పార్టీ కోసం పనిచేసేవారికి తగు గుర్తింపు ఇస్తామని, అలాగే ప్రతీ చిన్న విషయాన్ని మీడియా ఎదుట రచ్చ చేయడం ఇకప సహించబోమని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు.

మరి త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి వెళ్తున్న గుజరాత్ లో మళ్లీ జిమ్మికులకు అవకాశం లేదని భావించిన బీజేపి.. ముందుకు అపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగానే పటీధార్ ఉద్యమనేత హర్థిక్ పటేల్ ను టార్గెట్ చేసిందని తెలుస్తోంది. ఇక రాజీనామా లేఖలో హర్థిక్ ప్రస్తావించిన అంశాలు కూడా బీజేపి ప్రోద్భలంతోనే జరిగినట్టుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ ఇమేజ్ బిల్డప్ చేసుకునే ప్రతీసారి.. దానిని డ్యామేజ్ చేయడంలో బీజేపి నేతలు ముందుటారు. రాహుల్ ఇమేజ్ ను పాతాళానికి తీసుకెళ్లిన సందర్భంలోనే నరేంద్రమోడీ ప్రధానిగా తిరుగులేని మెజారిటీని సోంతం చేసుకున్నారు.

ఇక అదే ఒరవడిని కోనసాగించిన బీజేపి.. ఈ సారి తామ నేతలు కాకుండా కాంగ్రెస్ ను వీడుతున్న హార్థిక్ పటేల్ కు ఆ బాధ్యతలను అప్పగించింది. దీంతో గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా లేదని.. ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు విదేశాలలో పార్టీలకు హాజరుపై చూపించే ఆసక్తిని గుజరాత్ పై చూపడం లేదని విమర్శఇంచారు. గుజరాతీ అన్నా, గుజరాతీయులు అన్నా సుముఖత లేదని అర్థమవుతోందని ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమవుతున్నాయి. మరి అల్ ఈజ్ వెల్ అనుకుంటూ ముందుకు సాగుతున్న గుజరాత్ బీజేపికి హర్థిక్ రాకతో కలసి వస్తుందా..? లేక గతంలో కాంగ్రెస్ పార్టీకి మిగిల్చిన నిరుత్సహం.. పరాభవమే మిగులుతుందా.? అన్నది వేచిచూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles