KCR’s new strategy: Leak audio make viral సీఎం కేసీఆర్ నయా పంథా: ఎంపిటీసీ భర్తతో టాక్.. ఆడియో లీక్.!

Leak audio phone calls make viral kcr s new publicity strategy

CM KCR, Ramaswamy, Dalitha Bandhu, Audio call leak, CM Audio call leak, Padi Kaushik Reddy, Padi Kaushik Reddy Madannapet Vijender, Padi Kaushik Reddy Audio call viral, Huzurabad By-elections, Etela Rajender By-Elections, Huzurabad, TPCC secretary, KoushikReddy, Phone Call viral, Congress, Audio viral, Etela Rajender, CM KCR, TRS, KTR, Gangula Kamalakar, Harish Rao, Telangana, Politics

TRS chief and Telangana Chief Minister K Chandrashekhar Rao seems to be executing a new strategy. That is to make phone calls to common people in villages and towns and speaking to them on welfare schemes, development programmes of TRS government and ‘leaking’ those audio clips to media and make them viral on social media platforms.

సీఎం కేసీఆర్ నయా పంథా: ఎంపిటీసీ భర్తతో టాక్.. ఆడియో లీక్.!

Posted: 07/24/2021 07:19 PM IST
Leak audio phone calls make viral kcr s new publicity strategy

హుజురాబాద్ ఉప ఎన్నికల అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి ఫోన్ కాల్ ఆడియో లీక్ లు రక్తికట్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన పాడి కౌశిక్ రెడ్డి.. అలా పార్టీ మారడానికి కూడా ఆయన ఫోన్ కాల్ ఆడియో లాక్ కావడమే కారణం. అంతేకాదు.. రాజీనామా చేసిన తరువాత కూడా ఆయన కాంగ్రెస్ నేతతో మాట్లాడిన ఫోన్ కాల్ కూడా వైరల్ అయ్యింది. రానున్న హుజూరాబాద్ ఉపఎన్నికలలో తనకు మద్దుతు పలకాలని ఆయన నేతలను కోరారు.

ఇలా రెండు అడియోలు బయట పడిన తరువాత టీఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డిన ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా స్వాగతం పలికారు. అయితే అప్పటికే తన ప్రచార ఫథక రచనను చేసుకున్నారో.. లేక ఎక్కడ పోగోట్టుకున్నామో.. అక్కడే వెతకాలని అని భావించారో ఏమో తెలియదు కానీ తన సరికొత్త ప్రచార పంథాను అచరణలో పెట్టేశారు. గురుపౌర్ణమి రోజునే అందుకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నారు. ఫాడి కౌశిక్ రెడ్డి తరహాలో ఎక్కడా ఎలాంటి అసంబద్ద వ్యాఖ్యలు చేయకుండా.. ఎవరి మద్దతు కోరకుండా.. తనదైన స్ట్రాటజీని కనబర్చారు.

‘‘మన వాళ్లు బ్రీఫ్డ్ మీ’’ అన్న తరహాలోనే ఈ ఆడియో వున్నా.. నువ్వు రా మాట్లాడుదాం.. మన చేస్తున్నది ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చే బృహత్తర కార్యక్రమం అంటూ దళిత బంధు పథకంపై మాట్లాడారు. అయితే హుజురాబాద్ లో ఇప్పటికే దళిత బంధు పథకాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి.. హుజురాబాద్ నుంచే దీనిని ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన పార్టీకి చెందని ఓ ఎంపీటీసీని ఇక్కడకు రమ్మని అక్కడ అన్నీ మాట్లాడుకుందామని చెప్పడం ఆయన రాజకీయ చతురతే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఈ ఆడియోను లీక్ చేయాలని ముందుగానే వ్యూహాన్ని రచించుకున్న సీఎం సార్.. తనతో పాటు 20 ఏళ్లుగా ఉద్యమంలో పనిచేసిన ఈటెలను తేలికగా తీసిపారేయ్యాలనే ఉద్దేశ్యంతోనే ‘‘ వాడు చిన్నాడు వాడు రాజేందర్ గాడితోటి అయ్యేది లేదు.. పోయ్యేది లేదు’’ అంటూ వ్యాఖ్యానించారు. అది చిన్న విషయం కానీ అంటూ వెంటనే దళిత బంధు పథకం గురించి ప్రచారం చేసారు. కాగా, వాడు చిన్నోడే అయితే ఉధ్యమంలో ఆయనను నెంబర్ 2 స్థానానికి ఎందుకు పరిమితం చేశారు.. అధికారంలోకి వచ్చిన తరువాత ఈటెలను ఆర్థిక మంత్రి, ఆరోగ్యమంత్రిని ఎందుకు చేశారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరి వీటికి సీఎం సార్ ఏం సమాధానమిస్తారో.? వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh