Poonawalla slams congress dynasty politics రాహుల్ గాంధీపైకి కుటుంబం నుంచే దూసుకోచ్చిన కత్తి..

Poonawalla alleges process to elect congress party president rigged

Shehzad Poonawalla, AICC president, Rahul Gandhi, Surname, merit, Congress, Gujarat Elections, BJP, Rigged, constitutional process, Maharastra

Congress leader and Maharashtra Congress secretary Shehzad Poonawalla questioned the process to elect party President, calling it "rigged" and said Vice President Rahul Gandhi must first resign from his post.

రాహుల్ గాంధీపైకి కుటుంబం నుంచే దూసుకోచ్చిన కత్తి..

Posted: 11/30/2017 02:58 PM IST
Poonawalla alleges process to elect congress party president rigged

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీకి పదోన్నతి కల్పిస్తున్న క్రమంలో మళ్లీ అదే పరాభవం ఎదురుకానుంది. గతంలో సోనియా గాంధికీ ఎదరురైనట్లుగానే రాహుల్ కు కూడా అలాంటి ఘటనలు ఎదురుకానున్నాయి. అయితే సోనియాగాంధీకి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తుల నుంచి ఎదురైన పరాభవం.. రాహుల్ విషయానికి వచ్చేసరికి కుటుంభానికి చెందిన వ్యక్తుల నుంచే ఎదురదాడి మొదలయ్యింది. అయితే స్వతహాగా వ్యాపారవేత్త అయిన షెహజాద్ పొన్నావాలాను ఎక్కడో ఇరికించిన బీజేపీ అయనను ప్రేరేపించి ఇలాంటి వ్యాక్యాలు చేయిస్తుందన్న అరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి.

మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతగా, వ్యాపారవేత్తగా కొనసాగుతున్న షెహజాద్ పొన్నావాలా రాహుల్ గాంధీకి కుటుంభానికి చెందిన బందువే. అదెలా అంటే రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా వాద్రా భర్త రాబర్ట్ వాద్రా అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రాబర్ట్ వాద్రా సోదరి మోనికా వాద్రాను షెహజాద్ పొన్నావాలా సోదరుడు తెహసీన్ పొన్నావాలకు ఇచ్చి గత ఏడాది ఏప్రిల్ మాసంలో ఘనంగా వివాహం చేసిన విషయం తెలిపిందే. ఈ వివాహానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ లు కూడా హాజరయ్యారైన విషయం తెలిసిందే.

అలాంటి కుటుంబానికి చెందని వ్యక్తే సొంత మనిషిపై విమర్శలు చేయడం రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో దూసుకెళ్లున్న రాహుల్ గాంధీపై విమర్శలు చేసే సాహసానికి ఎందుకు ఒడిగట్టాడని కొందరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నా.. ఇది బీజేపి ప్రణాళికలో భాగమేనని, గుజారత్ లో ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న రాహుల్ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు ఈ కుతంత్రాలకు పాల్పడుతుందని అరోపిస్తున్న వారు వున్నారు. అందుకనే కాంగ్రెస్ ఎన్నికల అంశాన్ని తెరపైకి తీసుకోచ్చారని అన్నారు.

గత కొంత కాలం క్రితమే రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడిగా చేయాలని నిర్ణయించగా, అది కాస్తా వాయిదా పడుతూ వస్తుంది. అయితే సరిగ్గా గుజరాత్ ఎన్నికలు ముగిసిన తరువాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని పార్టీ వర్గాలు వెల్లడించిన నేపథ్యంలో ఇన్నాళ్లు దానిపై ఊసే ఎత్తని పొన్నావాలా సరిగగ్గా గుజరాత్ ఎన్నికలకు ముందు దిగజారుడు వ్యాక్యలు చేయడం ఎంతవరకు సమంజసమని పార్టీ నేతలు ప్రవ్నించారు. పార్టీ అద్యక్ష ఎన్నికల పేరుతో ఓ నాటకం జరుగుతోందని అయన విమర్శించడాన్ని ఖండించారు.

ఇంతకీ షహజాద్ పోన్నావాలన ఏమన్నారంటే.. కాంగ్రెస్ పార్టీలో అధ్యుడి ఎన్నికల పేరుతో ఓ నాటకం జరుగుతొందని అన్నారు. ఈ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ యావత్తూ ముందస్తు ప్రణాళిక ప్రకారం జరుగుతోందని ఆ పార్టీ సంచలన విమర్శలు చేశారు. ఎన్నిక యావత్తూ రిగ్గింగేనని అభివర్ణించారు. ఇదేమీ వాస్తవ ఎన్నిక కాదని, సిగ్గుపడాల్సిన ఎన్నికని అన్నారు. ఒక కుటుంబంలోని ఒక వ్యక్తిని పైకి తెచ్చేందుకు జరుగుతున్న డ్రామాగా ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తప్పును తాను ఎత్తి చూపుతున్నానని అందుకు ఏ మాత్రం బాధ లేదని అన్నారు.

కాంగ్రెస్ లోని ఎంతో మందికి ఈ విషయమై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ ఎవరూ నోరు మెదపడం లేదని విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ముందుగా తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ఆపై అధ్యక్ష ఎన్నికలకు పోటీ పడాలని అన్నారు. ఈ ఎన్నిక పారదర్శకంగా జరిగేట్టయితే బాగుంటుందని, ఇదే విషయాన్ని రాహుల్ కు లేఖ ద్వారా తెలిపానని అన్నారు. పూర్తి రిగ్ అయిన ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని, అసలు ఈ విధానమే తప్పుల తడకని, ఈ ఎన్నికల్లో ఓటు వేసే కాంగ్రెస్ నేతలెవరూ సక్రమంగా నమోదైన వారు కాదని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh