బెల్ట్ షాపుల బంద్.. క్రెడిట్ గోస్ టూ రోజా? | Belt Shops Close Babu fear to YCP Fire Brand

Naidu stick to his word on belt shops

MLA Roja, Roja warn babu, Roja Belt Shop Warning, MLA Roja Chandrababu Naidu, Roja Warn Works, Belt Shops Close Credit, Roja Won in Challenge, Roja Babu Belt Shop, Belt Shops Shut Down Decision, Babu Fear to Roja

Andhra Pradesh Government ready to close down belt shops immediately. Political Analysts says Credit gord to YCP Fire Brand MLA Roja. She gave dead line to babu sarkar close all belt shops within 10 days deadline.

బెల్ట్ షాపుల నిర్ణయం పనికి రాదా?

Posted: 07/19/2017 03:00 PM IST
Naidu stick to his word on belt shops

ఏపీలో మహిళా సంఘాలు, ఎన్టీవోలు బెల్ట్ షాపులపై ఉద్యమానికి సిద్ధమైపోతున్నారు. మరోవైపు ప్రతిపక్షం వైసీపీ కూడా ఈ ఛాన్స్ ను అస్సలు మిస్ చేసుకోకూడదని అనుకుంటుంది. ఈ నేపథ్యంలో స్వయంగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు బెల్ట్ షాపులు మూసేయాల్సిందేనంటూ హెచ్చరికలు జారీ చేశాడు. అంతేకాదు ఈ వ్యవహారాన్ని దగ్గరుండి పర్యవేక్షించాలని మంత్రి జవహార్ కు సూచించాడు కూడా.

మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అంటే నేటి నుంచే అమలు చేయాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీచేశాడు. అంతేకాదు అడ్డగొలుగా లైసెన్స్ జారీ చేస్తున్నారన్న విమర్శలకు చెక్ పెట్టేందుకు, వాటిని తగ్గించే సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించాలని అధికారులకు సూచించాడంట. అసలు ఈ టాపిక్ లో ఇప్పుడు ఇంత హడావుడి అవసరమా? అన్న వాటిపై రాజకీయ విశ్లేషకుల మాట.

నిజానికి ఈ ఇష్యూలో మొదటి నుంచి వైసీసీ ఎమ్మెల్యే రోజా మాత్రమే ప్రభుత్వంపై చిత్తశుద్ధితో విరుచుకుపడుతోంది. కొన్ని ఏరియాల్లో మహిళలు స్వచ్ఛందంగా మద్ధతు ఇవ్వటంతో ధర్నాలు నిర్వహించటం, షాపులను పగలగొట్టడం లాంటివి జరిగాయి కూడా. ఈ నేపథ్యంలో దీనిని మరింత ఉధృతం చేయాలని భావించిన ఫైర్ బ్రాండ్ ఫాదర్ ఆఫ్ బెల్ట్ షాప్(చంద్రబాబుకు ఇచ్చిన బిరుదు) పది రోజుల డెడ్ లైన్ విధించింది. ఈ లోపు మూత పడకపోతే ఉద్యమం మరోలా మారుతుందని హెచ్చరించింది కూడా.

ఈ నేపథ్యంలోనే హడావుడిగా కేబినెట్ మీటింగ్, బెల్ట్ షాపుల పై ఉక్కుపాదం వంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. అయితే ఎంత చేసినా అనుకున్న గడువులోపు అది కష్టతరమైన పనే. రెండు నెలల వ్యవధిలో ప్రభుత్వం బెల్ట్ షాపుల పనిపడుతుందని గతంలోనే బాబు చెప్పాడు కూడా. అలాంటప్పుడు రోజా వార్నింగ్ కు భయపడే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ఛాన్సు ఉందని విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLA Roja  Chandrababu Naidu  Belt Shop Shut Down  

Other Articles

 • Farmers protest celebrities twitter account suspended by union govt

  రైతు దీక్షలకు కనిపించకుండా చేస్తున్న కేంద్రం.?

  Jun 12 | కేంద్రంలోని బీజేపి ఒకప్పుడు సోషల్ మీడియాను విరివిగా వాడుకుని అందలాన్ని ఎక్కిందన్న విషయం తెలిసిందే. అప్పట్లో అధికారంలో వున్న యూపిఏ ప్రభుత్వంపై వ్యంగంగా పోస్టులు, వీడియోలు పెట్టి ప్రజలను అలోచింపజేసిన బీజేపి.. దేశంలోని మారుమూల... Read more

 • Extra charges surge on customers by food delivery apps during lockdown

  దడ పుట్టిస్తున్న ఫుడ్ డెలివరీ యాప్ లు.. బిల్లు చూస్తే గుండె గుబేలు..

  Jun 12 | నగర జీవనం చెప్పనలవి కాదు. పోట్ట కూటి కోసం పల్లెలు దాటి పట్టణాలకు వచ్చిన ఎందరెందరో జనం. వ్యాపారాలను విస్తరించుకుంటూ ఆయా రంగంలో పుంజుకోవాలని ఆశలతో కొందరు.. ఏదైనా చక్కని ఉపాది లభిస్తుందని ఇంకోందరు.... Read more

 • Telangana tdp chief l ramana all set to join trs

  కారు ప్రయాణానికి సిద్దమవుతున్న ఎల్ రమణ.?

  Jun 07 | తెలంగాణ తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగలనుందా.? తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన మరో కీలకమైన నాయకుడు కూడా టీఆర్ఎస్ గూటికి చేరువకానున్నాడా.? అంటే ఔనన్న సమాధానాలే వస్తున్నాయి. టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు... Read more

 • Fake indian currency notes rose by 31 in 2020 21 rbi report

  కొత్త 500 నోటు.. అసలుతో పోటీ పడుతున్న నకిలీ కరెన్సీ..!

  Jun 05 | కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్నట్లుంది కేంద్ర ప్రభుత్వం తీరు. చలామణీలో ఉన్న నకిలీ నోట్లను కట్టడి చేయడానికి యావత్ దేశ ప్రజలను నిద్రాహారాలు దూరం చేసి.. డ్యూటీలు, అఫీసులు, పనులు, వ్యాపారాలకు... Read more

 • Critics on removal of harika as tourism brand ambassador

  శాఖలో సమన్వయ లోపం.. మహిళకు అన్యాయం

  Mar 09 | తెలంగాణలో ఓ మహిళకు మంత్రి పదవి లభించడానికి ఏకంగా అరేళ్ల సమయం పట్టిందని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షిగా వైఎస్ షర్మిల చేసిన తీవ్ర విమర్శలతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిదాడి చేయలేని స్థితిలోకి జారుకుంది.... Read more

Today on Telugu Wishesh