Another Big Day for Rajinikanth Political Entry

Rajinikanth birthday set for political entry

Talaiva Rajinikanth, rajinikanth Political Entry, Rajini Birthday, Rajinikanth Birthday New Party, Rajinikanth New Political Party, Rajinikanth Political Entry, rajinikanth 67th Birthday, Rajinikanth Brother Politics

Talaiva Rajinikanth Political entry Date fixed. Super Star 67th Birthday venue for New Party.

రజనీ పొలిటికల్ ఎంట్రీ.. మళ్లీ పోస్ట్ పోన్!

Posted: 06/17/2017 02:56 PM IST
Rajinikanth birthday set for political entry

తమిళనాడు లో అమ్మ మరణం తర్వాత రాజకీయ స్థబ్థత ఏర్పడటం, సరైన నాయకత్వం లేక తంబీలు అల్లలాడిపోవటం చూస్తున్నాం. ఈ క్రమంలో రజనీ రాజకీయ ఆరంగ్రేటం పై బిగ్ డిబేట్ జరుగుతోంది. ఇది చాలదన్నట్లు ఫ్యాన్స్ తో మీటింగ్ పేరిట రజనీ చేసిన పొలిటికల్ వ్యాఖ్యలతో ఎంట్రీ ఖాయమనే అంతా డిసైడ్ అయిపోయారు.

ఇక ఇప్పుడు ఏకంగా డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందంటూ ఓ వార్త ప్రస్తుతం అక్కడ హల్ చల్ చేస్తోంది. డిసెంబర్ 12న 67వ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ అనౌన్స్ మెంట్ జరగబోతుందని చెప్పుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు సోషల్ మీడియాలో అభిమానులు బాబా సింబల్ పార్టీ అంటూ పెద్దగా క్యాంపెయినింగ్ చేస్తున్నారు కూడా.

ఇంకోవైపు రజనీ సోదరుడు సత్యనారాయణ మొన్నీమధ్యే జూలైలో రజనీ పార్టీ అనౌన్స్ మెంట్ జరుగుతుంది అంటూ ప్రకటించాడు. సినిమాల పరంగా రోబో 2, కాలా తో కమిట్ అయిన రజనీ తర్వాత సినిమాలు ఒప్పుకోకపోవటం ఆ అనుమానాలను బలపరుస్తోంది. పైగా అక్కడ రాజకీయ అలజడుల కారణంగా ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలీదు కాబట్టి రజనీ ఇప్పుడు రావటమే కరెక్టని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  New Party  Birthday  Political Entry  

Other Articles

Today on Telugu Wishesh