Shilpa's Trouble starts to Jagan Before Join

Shilpa mohan reddy joins ysrcp

Jagan Shilpa Mohan Reddy, Shilpa Head Ache to Jagan, YSRCP Kurnool, Jagan Nandyala Ticket, Shilpa Mohan Reddy YSRCP, Shilpa Left TDP

Shilpa Mohan Reddy Officially announced that Join YSRCP. but, YSRCP local leaders objected it.

శిల్పా వైసీపీ చేరిక అసలు మంచిదేనా?

Posted: 06/13/2017 01:19 PM IST
Shilpa mohan reddy joins ysrcp

అధికార పార్టీకి గుడ్ బై చెబుతూ ప్రతిపక్షంలోకి చేరిపోయేందుకు సిద్ధమైపోయాడు కర్నూలు సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి. భూమా మరణం అనంతరం నంద్యాల నియోజకవర్గం పై వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ఈ మాజీ మంత్రికి చంద్రబాబు నుంచి చుక్కెదురు కావటం, జగన్ నుంచి సీట్ కన్ఫర్మ్ హామీ దక్కటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమౌతోంది. వారం రోజులుగా కార్యకర్తలతో ఎడతెరపని చర్చలు జరిపిన శిల్పా చివరికి పార్టీ మారాలనే నిర్ణయానికే వచ్చాడు.

భూమా నాగిరెడ్డి మరణించి మూడు నెలలు కావస్తుండటం, మరో మూడు నెలల్లో తప్పనిసరిగా ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ఈసారైనా టికెట్ ఇస్తారేమోనని ఆశలు పెట్టుకున్నాడు. కానీ, అనధికారికంగా భూమా ఫ్యామిలీకే టికెట్ కన్ఫర్మ్ కాగా, తన పెదనాన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో నంద్యాలను తీర్చి దిద్దుతామని అఖిలప్రియ ఇప్పటికే ప్రకటించింది. దీంతో రేపు (జూన్ 14న) జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుని, ఆ వెంటనే అభ్యర్థిగా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. కానీ, ఆ వెంటనే ఓ కొత్త సమస్య మొదలయ్యే పరిస్థితులూ కనిపిస్తున్నాయి.

అయితే ఇంతకాలం నంద్యాల స్థానంపై ఆశలు పెట్టుకున్న ఇతర వైకాపా నేతలు ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమకు గనుక టికెట్ అనౌన్స్ చేయకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, వేల మంది కార్యకర్తలతో తాము పార్టీ మారతామని జగన్ కు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు కూడా. అంతేకాదు సాధారణంగా ఇలాంటి జపింగ్ లు జరిగినప్పుడు త్వరగానే అసంతృప్తులు బయటపడటం, పైగా జగన్ వైఖరి పట్ల త్వరగానే అవగాహనకు వచ్చేయటం లాంటివి కూడా జరిగే అవకాశం లేకపోలేదు. ఈ లెక్కన శిల్పా లాంటి గొంతెమ్మ కోర్కెల నేతలను కంట్రోల్ చేయటం జగన్ కు తలకు మించిన భారమే అవ్వక తప్పదంటున్నారు విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  Shilpa Mohan Reddy  YSRCP  

Other Articles

Today on Telugu Wishesh