union ministers different comments on special status to AndhraPradesh

Special status to andhrapradesh is given after bihar assembly elections

special status to AndhraPradesh, union home ministry, central minister nirmala sitaraman, comments on AndhraPradesh special status issue, AndhraPradesh special status issue, union minister venkaiah naidu, AndhraPradesh, special status issue, dont politicalise special status issue, kiran reddy joe, dawood ibrahim, rajnath singh, narendra modi, delhi elections, bihar assembly elections, kiran rejjijoe, haribai parthibhai

union minister venkaiah naidu, home ministry, and central minister nirmala sitaraman different comments on AndhraPradesh special status issue

ప్రత్యేక హోదాను చంపేసి.. సజీవం చేస్తున్నారా..?

Posted: 05/08/2015 09:21 PM IST
Special status to andhrapradesh is given after bihar assembly elections

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా అంశంలో కేంద్రం దోబుచులాడుతుందన్న విపక్షాల విమర్శలకు బలం చేకూరుతుంది. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదాను కల్పించే అంశంలో కేంద్రం ఓ వైపు దానిని చంపేసి.. మరో వైపు ఈ అంశాన్ని సజీవంగా వుంచేందుకు ప్రయత్నం చేస్తుందన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి. అయితే ఆంద్రప్రదేశ్ ప్రత్యేక హాదా అంశాన్ని చాలా సీరియస్ గానే తీసుకున్న కేంద్రం బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం దీనిపై చర్యలు తీసుకునే అవకాశం వుందని కూడా స్పష్టమవుతుంది.

కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పలుమారు పలు మాటలు మార్చారు. విజయవాడలోని ఓ కార్యక్రమంలో ప్రస్తుత సమయంలో కేంద్రమే ఆర్థికంగా చతికిల బడిందని, ఇలాంటి తరుణంలో ప్రత్యేక హోదా రాదని అవేదనను వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కొద్దికాలం ఈ అంశంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరువాత ఇటీవల పార్లమెంటులు స్వయంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించలేమని స్వయంగా పార్లమెంటులో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

దీంతో నిరసలు పెల్లుబిక్కాయి. ముఖ్యంగా నవ్యాంధ్ర రాష్ట్రంలో నిరసలు అధికమయ్యాయి. ఈ క్రమంలో నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించేందుకు అన్ని రాష్ట్రాలు అంగీకరించాల్సిన అవసరం వుందని ఒకసారి..ఆ తరవాత మరో అడుగు ముందుకేసి.. తనకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతో ఎలాంటి సంబంధం లేదని, తాను కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని మరోమారు చెప్పారు వెంకయ్య. తాజాగా.. ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశమని, దీనిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని చెప్పారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ గుంటూరులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ధర్న చేయగా, ప్రత్యేక హోదా కోసం పార్టీలు అడగాల్సిన అవసరం లేదని, ప్రజలకు మాత్రమే అధికారముందని అన్నారు. అయితే పార్టీలలోని వారు ప్రజలు కారని వెంకయ్య ఉద్దేశ్యం కావచ్చు.

ఈ విషయాన్ని పక్కన బెడితే.. ముంబాయి బాంబు దాడుల కేసులో సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం విషయంలోనూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గడియకో మాట చెబుతోంది. ముందుగా హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి పార్లమెంటులో ప్రకటన చేస్తూ.. అయన ఎక్కడున్నాడో తమకు తెలియదని సమాధానం ఇచ్చారు. ఈ అంశంపై విమర్శలు వెల్లువెత్తగానే.. మరో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజ్జుజూ రంగంలోకి దిగి విపక్షాల విమర్శలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. ఇక కేంద్ర హోం మంత్రి ఈ అంశంపై ఈ నెల 11న పార్లమెంటులో ప్రకటన చేయనున్నారు.

ఈ అంశాన్ని తీసుకుని కేంద్ర వైఖరిని అర్థం చేసుకుంటే.. నవ్యంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించే అంశంలోనూ.. కేంద్ర కొంత కాలం ఈ అంశాన్ని పక్కన బెట్టి.. బీహార్ ఎన్నికల అనంతరం ఈ అంశాన్ని పార్లమెంటులో పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడే ఈ అంశాన్ని తీసుకుని పార్లమెంటులో పెడితే.. తమ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా కల్పించాలని బీహార్ అడిగే అవకాశాలున్నాయి. అయితే అక్కడ కూడా బిజేపి అధికారంలోకి వచ్చే అవకాశాలున్న పక్షంలో ఈ అంశాన్నే ప్రచారాస్త్రంగా మలుచుకుని ఎన్నికలకు వెళ్లాలని బీజేపి బావిస్తుంది.

ఢిల్లీ ఎన్నికలకు ముందు స్వతంత్ర హోదా కల్పిస్తామన్న బీజేపి.. అక్కడ పరాజయం పాలైన తరువాత.. ఆ ఊసును ఎత్తదాటినికి కూడా ఇష్టపడటం లేదు. అదే క్రమంలో బీహార్ లో ఓటమి పాలైన పక్షంలోనూ బీజేపి ప్రత్యేక హోదాను పక్కన బెట్టి ఒక్క అంద్రప్రదేశ్ ప్రత్యేక హాదాను మాత్రమే పార్లమెంటులో పెట్టనుంది. అదికూడా పునర్విభజన చట్టంలో సవరణలు తీసుకువచ్చి.. ఈ అంశాన్ని చట్టంగా మార్చనుంది. దీంతో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా రావచ్చునని.. అయితే ఇందుకోసం కొంత సమాయం వేచి చూడాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అనధికారికంగా చెప్పినట్లు సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : venkaiah naidu  home ministry  special status  Andhra Pradesh  

Other Articles