harish rao supporting rtc strike says union leader ashwathama reddy

Harish rao supports our strike says union leader

harish rao supporting rtc strike, harish rao, jana reddy, rtc strike, andhra pradesh, telangana, aswathama reddy, union leader, TMU leader Ashwathama Reddy, Telangana mazdoor Union

TMU leader Ashwathama Reddy said that Telangana minister Harish Rao is supporting RTC strike.

ఆర్టీసీ సమ్మెకు.. హరీష్ రావు మద్దతు

Posted: 05/09/2015 05:49 PM IST
Harish rao supports our strike says union leader

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కోనసాగుతున్న ఆర్టీసీ సమ్మె రాష్ట్ర ప్రజలను అనేక ఇబ్బందులు పాలు చేస్తుంటే.. ప్రభుత్వంలో భాగంగా కొనసాగుతూ.. మంత్రి పదవిని అనుభవిస్తున్న వారు మాత్రం సమ్మెకు మద్దతు పలుకుతున్నారట. ఆయనెవరు అనేగా మీ సందేహం అయనే తెలంగాణ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు. నిజమా..? రాష్ట్రంలో కోనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వాని ఇబ్బందులకు గురిచేయడానికే హరీష్ ఈ విధంగా ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలుకుతున్నారా..? అన్న అనుమానాలు ఇప్పుడు ఆర్టీసీ భవన్ చుట్టూ చక్కర్లు కోడుతున్నాయి.

హరిష్ రావు కత్తి కాదు చురకత్తి అంటూ విమర్శలు గుప్పించే పలువురు ప్రత్యర్థి పార్టీ నేతలే.. ఇలాంటి పుకార్లు పుట్టించి వుంటారని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. ఈ విషయాన్ని చెప్పింది ప్రత్యర్థి పార్టీల నేతలు కాదు. స్వయంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్మిక నేత ఆశ్వత్థామా రెడ్డి. తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాలకు గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్న హరీశ్ రావు సమ్మెకు కూడా కార్మిక సంఘాల పక్షాన మద్దతు పలుకుతున్నారట. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగానా అంటే.. అవుననే అంటున్నాయి కార్మిక సంఘాలు.

టీడీపీ నేత రేవంత్ చేసిన విమర్శలు అప్పుడే ఆచరణకు నోచుకుంటున్నాయా..? అన్న సందేహాలు కూడా మరో వర్గంలో ఆసక్తిని రేపుతున్నాయి. అయితే హరీష్ ఆర్టీసీ సమ్మె దెబ్బకు రెండు పిట్టలు అన్న మరో టాక్ కూడా వినబడుతోంది. ఇటీవల జరిగిన ప్లీనరిలో తనను పక్కన బెట్టారన్న హరీష్ రావు తన సత్తాను మామకు తెలియజేసేందుకే సమ్మెకు సై అని తమ కార్మిక సంఘం నేతలతో చెప్పించారని ఒక వర్గం వారు భావిస్తున్నారు. ప్లీనరీ మొత్తం తన సహచర మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన నేపథ్యంలో.. ఆయన అమెరికా పర్యటన ముగించుకుని వచ్చే వరకు కూడా దీనిని కొనసాగించాలని ఆర్టీసీ కార్మిక సంఘం భావిస్తుంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harish rao  supports  rtc strike  union leader ashwathama reddy  

Other Articles