Kcr asked collectors to work hard on dalits

kcr asked collectors to work hard on dalits, telangana cm kcr, cm k chandrasekhar rao,telangana dalits, k chandrasekhar rao, dalit group angry on kcr

kcr asked collectors to work hard on dalits

కేసిఆర్ పై పగబట్టిన తెలంగాణ దళిత?

Posted: 06/25/2014 03:54 PM IST
Kcr asked collectors to work hard on dalits

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ లో..దళిత ప్రేమ పొంగిపోతుంది. వారి నోటి పదవి అనుభవిస్తున్న  కేసిఆర్ .తెలంగాణలోని  దళితులపై వరాల ప్రేమ కురిపిస్తున్నారు. కానీ కేసిఆర్ మాటలను దళితులు నమ్మటంలేదు. దాని కారణం ఈ చిన్నఉదాహరణనే , ఎన్నికల సమయంలో  తెలంగాణ రాష్ట్రానికి  తొలి ముఖ్యమంత్రిని చేస్తానని కేసిఆర్  నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల మద్య  చెప్పటం జరిగింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది.  అందుకే ఒక దళిత బిడ్డ..కేసిఆర్ పై పగ బట్టి,  కోర్టులో పిటిషన్ వేయటం జరిగింది.

ఈరోజు సిఎం కేసీఆర్‌పై నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో  ప్రైవేటు పిటిషన్‌ దాఖలైంది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన కేసీఆర్‌ మాట తప్పి మోసం చేశారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిటీషనర్‌ సతీష్‌ మాదిగ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ విషయంపై బంజారాహిల్స్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసీఆర్‌పై కేసు నమోదు చేయ

డానికి పోలీసు అధికారులు కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. పోలీసుల నిర్లక్ష్యం చేయడం వల్లే కోర్టును ఆశ్రయించాల్సి వస్తోందని చెప్పారు. ఫిర్యాదుపై స్పందించిన మూడో అదను చీఫ్‌ మెట్రో పాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కేసును జులై 2వ తేదీకి వాయిదా వేశారు.

Telanga-Dalits

అయితే ఇలాంటి పట్టించుకోని  సీఎం కేసిఆర్ మాత్రం తెలంగాణలోని దళితులకు  ఇవి చేయాలని గట్టిగా చెబుతున్నారు. దళితుల అభివృద్ధిని ఒక సవాలుగా స్వీకరించి పని చేస్తానని సీఎం కెసిఆర్ పేర్కొన్నారు.  10 జిల్లాల కలెక్టర్లతో జరిగిన సమావేశంలో సీఎం కెసిఆర్ మాట్లాడుతూ దళిత వాడల నుంచి పేదరికాన్ని పారద్రోలేందుకు యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఈ యుద్ధానికి జిల్లాల కలెక్టర్లే సారధులుగా వ్యవహరించాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటి వరకూ దళితుల అభివృద్ధి పేరుతో ప్రచారం జరిగిందే తప్ప మార్పు శూన్యమని కెసిఆర్ వ్యాఖ్యానించారు. వచ్చే ఐదేళ్ల కాలంలో దళితులను ఎపిఎల్ పరిధిలోకి తీసుకు రావాలన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో దళితుల అభివృద్ధికి 15.4 శాతం నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఎస్సీల అభివృద్ధికి జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని కెసిఆర్ కోరారు. ప్రతి జిల్లాకు దళితుల అభివృద్ధి కోసం సగటున రూ.600 కోట్లు కేటాయిస్తామని చెప్పారు.

వచ్చే ఐదేళ్లలో దళితుల అభ్యున్నతికి రూ.4000 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ప్రతి దళిత వాడలో విద్యావంతులతో అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయాలని సిఎం, కలెక్టర్లను ఆదేశించారు.  ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి కేటాయిస్తామని చెప్పారు. మహిళల పేరు మీదే భూముల రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు.

దళితులకు ఇప్పటికే 1, 2 ఎకరాల భూమి ఉంటే, మిగతా భూమి సమకూరుస్తామని తెలిపారు. దళితులకు భూమి కేటాయింపులపై అధికార యంత్రాంగం చిత్తశుద్దితో పని చేయాలన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ శాఖను ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖగా మారుస్తున్నట్లు కెసిఆర్ చెప్పారు.

ఎప్పటికప్పుడు దళితుల స్థితిగతులు తెలుసుకునేందుకు జిల్లాల కలెక్టర్లు ఆయా దళిత వాడల్లో పర్యటించాలన్నారు. దళితుల అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ప్రతి మండలంలోనూ ఒక అధికారిని నియమించనున్నట్లు కెసిఆర్ ప్రకటించారు. కేసిఆర్ ఈరకంగా దళితులపై ప్రేమ కురిపిస్తున్న.. తెలంగాణ దళితులు మాత్రం  నమ్మటంలేదు.     దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని  మాట తప్పిన మనిషిగా దళితులు గుర్తించారు. అందుకే ఆయన ఎన్ని వరాలు, ఎంత ప్రేమ కురిపించి నమ్మెస్థితిలో దళితుల లేరని అర్థమవుతుంది.  ‘‘అద్దం పగిలిపోతే..గతంలో పారేస్తారు.. కానీ  ఇప్పుడు అతికిస్తున్నారు’’, కానీ ‘‘ఒక్కసారి  నాయకుడి మీద నమ్మకం పోతే....తిరిగి రావటం చాలా కష్టమని ..దళిత సంఘాలు’’ అంటున్నాయి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles