Aap kejriwal lost two places

AAP Kejriwal lost two places, Aam Admi Party lost in Varanasi, Arvind Kejriwal loses political ground, Kejriwal lost political war

AAP Kejriwal lost two places

ఆప్ కా క్యాహోగా జనాబే ఆలి...

Posted: 05/17/2014 08:57 AM IST
Aap kejriwal lost two places

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రెంటికీ చెడ్డ రేవడి తంతుగా మారింది.   ఢిల్లీలో చేజిక్కిచ్చుకున్న అధికారం జాతీయ స్థాయిలో కూడా పొందవచ్చని భావించిన అరవింద్ కేజ్రీవాల్ కలలు నీరుగారిపోయాయి.  కష్టపడి దేశపర్యటన చేసి, మోదీ తో వారణాసిలో తలపడిని కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీలో చేసినట్లుగా చీపుర్లతో స్వీపింగ్ చేసి ఎన్నికలలో కూడా స్వీప్ చెయ్యవచ్చని ఆశపడ్డారు కానీ రాష్ట్రంలో వ్యూహరచనకి జాతీయ స్థాయిలో వ్యూహరచనకి చాలా తేడా ఉంటుందని గమనించలేకపోయారు. 

జాతీయస్తాయి రాజకీయాలలోకి అడుగుపెట్టాలనే తొందరపాటుతోనే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారని అందరూ విమర్శించారాయన్ని.  దాని ప్రభావం బ్రహ్మరథం పట్టిన ఢిల్లీతో సహా ఆయన రోడ్ షోలలో కనిపించి ఆయన మీద నిరసనలు దాడుల రూపంలో కొందరు వెలిబుచ్చటం కూడా జరిగింది.

దానితో అరవింద్ కేజ్రీవాల్ అటు ఢిల్లీ రాష్ట్రాన్నికావాలని వదిలిపెట్టి కావాలని కోరుకున్న పార్లమెంట్ సీటుని దక్కించుకోలేకపోయారు.  ఎంత త్వరగా దేశ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచారో కేజ్రీవాల్ అంతే త్వరగా అందిన అధికారాన్ని వదిలిపెట్టి ఎకె 49 గా మోదీ విమర్శలను ఎదుర్కున్నారు, అంతే త్వరగా రాజకీయాలలో కిందికి జారి కిం కర్తవ్యం అని ఆలోచనలో పడ్డట్టుగా కనిపిస్తున్నారు. 

ప్రజల తీర్పుని శిరసావహిస్తున్నాను అని చెప్పటం కంటే మరో మార్గమేమీ మిగల్లేదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles