Modi is bjp self destruction mantra

Modi is BJP self destruction mantra, Narendra Modi, Jaswant Singh, LK Advani, Digvijay Singh, Congress spokesman Abhishek Singhvi

Modi is BJP self destruction mantra

భాజపాకి నమో నాశన మంత్రం!

Posted: 03/25/2014 03:26 PM IST
Modi is bjp self destruction mantra

వైరి పక్షం బలహీనపడటం సంతోషమే కానీ దాన్ని కూడా అందరితో పంచుకోవాలి కాబట్టి నాయకులు తరచుగా శత్రు పక్షంలోని నాయకుల వైఫల్యాలను ఎండగడుతుంటారు.  అలాంటి ప్రయత్నమే జరుగుతోంది భాజపా ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ విషయంలో. 

భాజపా నాయకుడు జస్వంత్ కోరిన చోట పార్టీ టికెట్ ఇవ్వకపోవటాన్ని నరేంద్ర మోదీ చర్యగా కాంగ్రెస్ పార్టీ అభియోగం.  నిన్న దిగ్విజయ్ సింగ్ అదే మాట అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి కూడా అలాగే అన్నారు.  అంతే కాదు మోదీ వలన భాజపాలో పుట్టిన ముసలం ఆ పార్టీని నాశనం చేస్తుందని వాళ్ళు తమ ఉద్దేశ్యాలను కూడా వెల్లడించారు. 

పార్టీ వీడకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా రాజస్థాన్ లోని బార్మర్ లో నామినేషన్ దాఖలు చేసిన జస్వంత్ సింగ్ ఎలాగూ నమో (నరేంద్ర మోదీ) వలన భాజపా నాశనమౌతుందని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లుగా శపించారు.  ఈ రోజు సింఘ్వి మోదీ విషయంలో మాట్లాడుతూ, అద్వానీ, జస్వంత్ సింగ్, హరిన్ పాఠక్, రాణా, చౌబే, లజ్జీ టండన్ లే మోదీని విశ్వసించకపోతే ఇక దేశమెలా విశ్వసిస్తుందని ప్రశ్నించారు.  మీ వాళ్ళే మిమ్మల్ని ఆదరించకపోతే దేశమెలా ఆదరిస్తుందన్నారు సింఘ్వి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles