Botsa satyanarayana may join bjp soon

Botsa Satyanarayana may join BJP soon, Former APCC President Botsa, Former Minister Purandheswar, Congress bus yatra

Botsa Satyanarayana may join BJP soon

పురంధేశ్వరి బాటలోనే బొత్సా

Posted: 03/25/2014 09:59 AM IST
Botsa satyanarayana may join bjp soon

విశ్వసనీయ వర్గాల నుండి వచ్చిన సమాచారం ప్రకారం మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ కూడా భారతీయ జనతా పార్టీలో చేరవచ్చని తెలుస్తోంది.  పురంధేశ్వరి ఇప్పటికే భాజపా లో చేరారు, కావూరి సాంబశివరావు కూడా భాజపాలో చేరటానికి వేదిక సిద్ధం చేసుకున్నారు. 

పురంధేశ్వరి ఆమెకు ఇష్టమైన విశాఖపట్నం నుంచి పార్లమెంట్ కి పోటీ చెయ్యవచ్చు.  కానీ బొత్సా, కావూరి విషయంలో ఇంకా శాసన సభకా లేక పార్లమెంటుకి పోటీకి టికెట్ లభిస్తుందా అన్నది స్పష్టం కాలేదు. 

కాంగ్రెస్ సీమాంధ్రలో తుడిచిపెట్టుకుని పోయిందన్న భావనలో ఉన్న కాంగ్రెస్ నాయకులలో కొందరికి ప్రత్యామ్నాయం చూసుకోక తప్పటం లేదు.  బస్ యాత్రలో పాల్గొనకపోవటం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో బొత్సాసత్యనారాయణ త్వరలో భాజపాలోకి దూకుతారని తెలుస్తోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles