Comedian venu madhav hints poll battle

comedian Venu Madhav, comedian Venu Madhav joins TDP, comedian Venu Madhav to contest from Kodad, comedian Venu Madhav comments on Pawan Kalyan, comedian Venu Madhav on Pawan Kalyan Jana Sena party, Comedian Venu Madhav hints poll battle

Comedian Venu Madhav hints poll battle

బాబు గారి పసుపు కండువా కోసం వేణుమాధవ్ కష్టాలు?

Posted: 03/19/2014 04:10 PM IST
Comedian venu madhav hints poll battle

టాలీవుడ్  కామెడీ నటుడు  వేణుమాధవ్  త్వరలో  పసుపు పుసుకోవటానికి  సిద్దమవుతున్నాడు.  ఇప్పటికే  టాలీవుడ్ నుండి కొంత మంది నటులు  బాబు గారి పసుపు పుసుకున్నారు. ఇప్పుడు  అదే బాటలో మన కమెడీ నటుడు వేణుమాధవ్ కూడా  ఉన్నట్లు తెలుస్తోంది.  

తెలుగుదేశం పార్టీ  అధినేత చంద్రబాబు తో ఈరోజు   నటుడు వేణుమాథవ్ కలిసినట్లు సమాచారం.  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రోజు రోజుకి ప్రజలకి రాజకీయాలపై ఆసక్తి పెరుగుతుంది. సెలబ్రిటీస్ కూడా రాజకీయాల్లో అడుగుపెట్టడానికి ఉత్సాహంగా ఉన్నారు. 

అలాగే వీరికి ప్రజలలో ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని సీనియర్  రాజకీయ నేతలు కూడా వీరిని ఆహ్వానిస్తున్నారు. నటుడు ఆలీ గుంటూరు కాని రాజమండ్రి నియోజకవర్గం నుంచి కాని తెలుగుదేశం తరుపున పోటీ చేయనున్న సంగతి తెలిసిందే.  ఇప్పుడు  అదే బాటలో  కామెడీ  నటుడు వేణు మాదవ్ రానున్న ఎన్నికల్లో టిడిపి తరుపున పోటీ చేయనున్నాడు. 

అయితే వేణు మాధవ్ నల్గొండ జిల్లా కోదాడ నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేయలన్నుకుంటున్నాడు. దీనికి చంద్రబాబు నాయుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. చూస్తుంటే ఈ ఎన్నికల్లో సెలబ్రిటీస్ ఎక్కువగా ఉన్నట్టున్నారు కదా!  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  పొలిటికల్  స్పీచ్ విన్న తరువాత..  నాకు ప్రజా సేవా చెయ్యాలనే ఉద్దేశంతో  టిడిపిలో చేరుతున్నట్లు  వేణుమాధవ్ చెబుతున్నారు.  ఇప్పటికే చాలా టాలీవుడ్ ప్రముఖులు   పసుపు పుసుకొని రెఢీ ఉన్నారు.  ఇక ఎన్నికల బరిలోకి దిగటమే ఆలస్యం.  ఈ ఎన్నికల్లో  గెలుపు ఎవరిని వరిస్తుందో  చూద్దాం.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles