Ys jagan hundred crores debit

ys jagan, jagan, ysrcp, 2014 election, ys jagan hundred crores debit, congress party.

ys jagan hundred crores debit ?

వంద కోట్లు అప్పు చేసిన జగన్ ?

Posted: 03/10/2014 10:14 AM IST
Ys jagan hundred crores debit

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కొత్త కొత్త నిజాలు బయటపడుతున్నాయి.   లక్ష కోట్లు  సంపాదించిన  జగన్, 100 కోట్లు అప్పు చేసినట్లు  మీడియాలో, రాజకీయ నాయకుల మ్యద  హాట్ టాఫిక్ నడుస్తుంది. అయితే ఇందులో ఎంత నిజముందో, ఎంత అబద్దం ఉందో  అంతా ఆ జగన్ కే తెలియాలి.  అయితే  మొత్తం మీద  వంద కోట్ల అప్పు గురించి ప్రచారం బాగా సాగుతుంది. 

ఇటు సిబిఐ కేసలు, అటు ఇడి జప్తులతో జగన్ సతమతవుతున్నాడు. పైగా కేసుల  కోసం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుచేసాడు. మరోపక్క ఆస్తులు, బినామీ వ్యవహారాల దగ్గర అంతా చిక్కుకుంది. దీంతో జగన్ తన పార్టీ నిర్వహణకు, ప్రచారానికి, తన యాత్రలకు జగన్ అప్పులు చేస్తున్నాడని ప్రచారం మొదలైంది.

చాలా మంది దీన్ని నమ్మబుల్ గా లేదని కొట్టి పారేస్తున్నా, కొంతమంది జగన్ సన్నిహితులు నిజమే అంటున్నారు. ఆ మధ్య వంద కోట్ల వరకు రాయలసీమ పెద్దలు కొంతమంది వద్ద పెద్ద మొత్తంలో అప్పుచేసాడని అంటున్నారు. 

అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్న చాలా మంది పార్టీ నాయకులకు జగన్ ఒకటే మాట చెబుతున్నాడు.  ఈ ఎన్నికలకు నేను ఒక్క  రూపాయి కూడా ఇవ్వనని ముందే చెబుతున్నాడని ఆపార్టీ సీనియర్  నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.  జగన్  డబ్బు అంతా స్థిరాస్తుల్లో, ఈడి వ్యవహారాల్లో ఇరుక్కుందని, తానేమీ చేసే స్థితిలో లేనని పార్టీ సభ్యులతో చెప్పినట్లు  సమాచారం. 

అయితే  జగన్ ఇలా ఎందుకు చెబుతున్నాడో,  పార్టీలోని నాయకులకు  అర్థం కావటంలేదట, అంతేకాకుండా రాబోయే  ఎన్నికలకు పైసా ఖర్చుపెట్టలేనిన ముందుగానే చెప్పటంతో.. కొంతమంది నాయకులకు గెలుపు భయం పట్టుకొని గోడ దూకటానికిసిద్దంగా ఉన్నట్లు  పార్టీలో పుకార్లు వినిపిస్తున్నాయి.  ఏదీ నిజమో తెలియలంటే.. కొద్దిరోజులు ఆగాల్సిందే. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles