I too can run country says rakhi sawant

I too can run country says Rakhi Sawant, Item girl Rakshi Sawant, Shivsena Uddhav Thakare, Narendra Modi, AAP Arvind Kejriwal

I too can run country says Rakhi Sawant

మోదీ పాలిస్తే నేనూ ఆ పని చెయ్యగలను- రాఖీ సావంత్

Posted: 01/24/2014 03:56 PM IST
I too can run country says rakhi sawant

పాలిస్తే అంటే ఇక్కడ పాలించటం- అంటే దేశాన్ని పాలించటం అని అర్థం.  ఒక చాయ్ వాలా దేశాన్ని పాలించగలిగితే ఆ పని నేనూ చెయ్యగలనంటోంది ఐటమ్ గాళ్ రాఖీ సావంత్. 

ఎన్నికలు జరిగేంత వరకూ ఇలాంటి వ్యాఖ్యానాలు ఇంకా చాలా వింటాం.  వ్యాఖ్యానాలు చేసినవాళ్ళు వార్తలలోకి ఎక్కుతారు, వాళ్ళకి కావలసింది కూడా అదే.

రాఖీ సావంత్ మోదీ గురించి పై వ్యాఖ్యలు చెయ్యటానికి ముందు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ఆఆపా నిర్వాహకుడు అరవింద్ కేజ్రీవాల్ ని ఐటమ్ గాళ్ తో పోలుస్తూ, ఐటమ్ గాళ్ రాఖీ సావంత్ అతని కంటే బాగా పరిపాలించగలదని అన్నారు.  కేజ్రీవాల్ ని ఆయన ఐటమ్ గళ్, మదారీ (కోతిని ఆడించేవాడు), జోకర్ అంటూ వ్యాఖ్యానించారు. 

ఈ సందర్భంలో ఉద్ధవ్ థాకరే ఆఆపా నాయకుడు కుమార్ విశ్వాస్ నర్సుల మీద చేసిన వ్యాఖ్యలు, దరిమిలా చెప్పిన క్షమాపణలను గుర్తుచేసారు. 

ఉద్ధవ్ చేసిన వ్యాఖ్యలకు, తాను ఢిల్లీని పాలించగలనన్న నమ్మకాన్ని ప్రకటించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాఖీ సావంత్ పనిలో పనిగా నరేంద్ర మోదీని కూడా అందులోకి లాగుతూ ఒక చాయ్ వాలా దేశాన్ని నడపగలిగితే ఒక ఐటమ్ గాళ్ గా తానుకూడా ఆ పని చెయ్యగలనని చెప్పింది.

రాఖీ సావంత్ మీద శివసేన వ్యాఖ్యానించటం ఇది మొదటిసారి కాదు.  సానియా మిర్జా పెళ్ళి చేసుకుని పాకిస్తాన్ పోతున్నప్పుడు మా దేశం నుంచి వెళ్ళవలసినవాళ్లు మరొకరున్నారు తెలుసా- రాఖీ సావంత్ అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles