Kiran kumar refuses to go to delhi

Kiran Kumar refuses to go to Delhi, Chief Minister Kiran Kumar, Digvijay Singh, T Bill in AP Assembly

Kiran Kumar refuses to go to Delhi

ఢిల్లీకి రాలేనని స్పష్టం చేసిన కిరణ్ కుమార్

Posted: 01/24/2014 02:09 PM IST
Kiran kumar refuses to go to delhi

ఏఐసిసి ఛీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఢిల్లీ వచ్చి శాసనసభలో జరుగుతున్న దానిమీద తనతో సమావేశమై విషయావగాహన చేస్తారని గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.  రాష్ట్ర పునర్విభజన బిల్లు ముసాయిదా మీద కిరణ్ కుమార్ రెడ్డి నుండి వివరణాత్మకమైన నివేదికను కోరిన దిగ్విజయ్ సింగ్ కి కిరణ్ కుమార్ నుంచి నకారంలో సమాధానం వినవలసివచ్చింది.

శాసనసభలో సమావేశాలు జరుగుతుండటం వలన తన అవసరం ఇక్కడ ఉందని, అందువలన తాను ఢిల్లీకి రావటం కుదరదని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేసారు. 

ఈరోజు కిరణ్ కుమార్ తప్పకుండా ఢిల్లీకి వస్తారని విశ్వసించిన దిగ్విజయ్ సింగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నప్పుడు ఈరోజు విభజన బిల్లు మీద కిరణ్ కుమార్ తో అన్ని విషయాల మీద కూలంకషంగా చర్చిస్తానని చెప్పారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles