అమ్మ..అమ్మ అంటూ.. తెలంగాణ దేవత అంటూ ఆమెకు పూజలు చేశారు. తెలంగాణ ప్రాంతంలో భోనాలు మాదిరే అమ్మకు పండగ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ముందుగా అమ్మకు ఒక భక్తుడు.. తెలంగాణ లో చిన్న గుడి కట్టుకోని పూజలు చేయటం ప్రారంభించాడు. అతను చిన్న వ్యక్తిమే కాదు.. కాంగ్రెస్ పార్టీ ఎంపీ పొన్నం ప్రభాకర్. అమ్మ ఉన్న భక్తితో తెలంగాణ లో ముందుగా గుడి కట్టిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఇంతకీ అమ్మ పేరు చెప్పలేదు కదు.. ఇటలీ నుండి తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ప్రత్యేకంగా వచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో అమ్మకు భజన చేసే భక్తులు చాలా మంది ఉన్నారు. మరోక నేత అయితే ఏకంగా అమ్మకు పెద్ద గుడి కట్టాలని స్థలం కోసం వేట సాగిస్తున్నారు. అలాంటి అమ్మకు తెలంగాణ బంద్ కారణంగా కష్టాలు వచ్చినట్లు సమాచారం.
సోనియా గాంధీకి ఫ్లెక్సీలతో కట్టిన గుడిని కూల్చివేశారు. అందుకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీన్ని నిరసిస్తూ సోనియా చిత్రపటానికి పాలభిషేకం చేశారు. తెలంగాణ చౌక్‌లో సోనియాగాంధీ ఫ్లెక్సీలతో కట్టిన గుడిని కొంతమంది బీజేపీ మహిళా కార్యకర్తలు కూల్చివేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని త్వరతగతిన ఏర్పాటు చేసేందుకు సోనియా గాంధీ చొరవే కారణమంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెకు గుడి ఏర్పాటులో నిమగ్నమైయ్యారు. ముందుగా సోనియా గాంధీకి ఫ్లెక్సీలతో గుడిని ఏర్పాటు చేశారు.
అయితే దీన్ని నిరసించిన బీజేపీ మహిళా కార్యకర్తలు ఆగుడిని కూడా కూల్చివేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 14 మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీంతో బీజేపీ శ్రేణులు టూటౌన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించాయి. మహిళల పట్ల పోలీసులు విచక్షణరహితంగా ప్రవర్తించారని బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు.
ఒక మహిళ మెడ నుంచి మంగళసూత్రాన్ని కూడా తెంపేశారని వారు ఆరోపిస్తున్నారు. మేము తెలంగాణ కు సపోర్టు అంటూ చెప్పే బీజేపి పార్టీ నాయకులే తెలంగాణ రాష్ట్రం ఇచ్చే సోనియా గాంధీ గుడి కూల్చివేశారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గుడి కట్టుకుంటే.. తెలంగాణ బిజేపి మహిళలు కూల్చివేశారు.ఈవిషయం తెలుసుకున్న అమ్మ భక్తులు చాలా బాధపడుతున్నారు. వెంటనే అమ్మ గుడిని కూల్చిన బిజేపి నాయకులపై చర్యలు తీసుకోవాలని అమ్మ భక్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం అమ్మకు తెలిస్తే ఎంత బాధపడిపోతుందని ఆ గుడికట్టిన భక్తుడు అల్లాడిపోతున్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more