ప్రపంచ కళ్లు మొత్తం సచిన్ పై ఉన్నాయి. కానీ ఆయన భార్య అంజలీ మాత్రం అందుకు విరుద్దంగా ఉందని సమాచారం. అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ కు చివరి రెండు టెస్ట్ మ్యాచ్ లు కావడంతో అభిమానులతో, మాస్టర్ కుటుంబ సభ్యుల్లోనూ ఆసక్తిని పెంచింది. మ్యాచ్ చూడటానికి వచ్చిన సచిన్ సతీమణి అంజలీ టెండూల్కర్, కుమారుడు అర్జున్ లు కోల్ కతా చేరుకున్నారు. వెస్టిండీస్ తో జరుగుతున్న తొలిటెస్ట్ తొలి రోజు ఆటలో అంజలీ అనుకున్నట్టే అన్ని జరిగాయి.
మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు బోర్ కొట్టే విధంగా ఉన్న సమయంలో సచిన్ కు కెప్టెన్ ధోని బంతి అందించి బౌలింగ్ కు దింపితే పెద్ద ఎత్తున్న ప్రేక్షకులకు జోష్ వస్తుంది అని అంజలీ అనుకోవటం జరిగింది. అంతే టీ విరామానికి ముందు ఓవర్ సచిన్ కు ధోని బంతి అందించి బౌలింగ్ చేయాలని కోరడంతో ఆనందంతో ఉప్పొంగి పోవడం అంజలితోపాటు అభిమానుల వంతైంది.
ఇక సచిన్ బౌలింగ్ చేపట్టాక అప్పటికే మంచి భాగస్వామ్యం నెలకొల్పిన ఇద్దరు ఆటగాళ్లను విడదీస్తే అద్బుతంగా ఉంటుంది సచిన్ భార్య మనసులో అనుకోవటం జరిగింది. అంజలీ మనస్సులో తలుచుకున్న కొద్ది సేపటికే సచిన్ వికెట్ పడగొట్టడంతో అంజలీ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. సచిన్ కూడా థ్రిల్లింగ్ ఫీల్ అవడంతో అభిమానుల కూడా ఆనందంలో పాలుపంచుకున్నారు.
అయితే సచిన్ భార్య అంజలీ అనుకున్నట్లే అంత జరిగిపోతుంది. పక్కనే ఉన్న జగ్ మోహన్ దాల్మియా.. సచిన్ బ్యాటింగ్ వస్తాడా అని అడగటంతో అందుకు సమాధానంగా సచిన్ భార్య అంజలి సచిన్ బ్యాటింగ్ కు రాడు అని గట్టిగా చెప్పినట్లు సమాచారం. అలా అంజలీ ఎందుకు చెప్పిందో ? దాని వెనుక ఉన్న కారణం ఏమిటి? అంటే సచిన బ్యాటింగ్ చేస్తుంటే చూడటం అంజలీ మరింత ఒత్తిడికి గురి అవుతుందట. అందుకే తాను ముంబై వెళ్లిపోతున్నాను అని అంజలి చెప్పినట్లు సమాచారం.
రెండవ రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే భారత్ రెండు వికెట్లు కోల్పోవడం.. సచిన్ బ్యాటింగ్ రావడంతో అభిమానులు సంతోషం కలిగింది. అయితే తక్కువ స్కోరుకే సచిన్ వివాదస్పదంగా అవుట్ కావడం అందర్ని బాధించింది. మొదటి రోజు జరిగిన ఆటలో సచిన్ భార్య అంజలీ కోరుకున్న విధంగా జరిగింది. కాబట్టి ఈరోజు ఆట జరిగే సమయంలో అంజలీ స్టేడియంలో ఉండి, సచిన్ భారీ స్కోరు చేయాలని కోరుకొని ఉంటే బాగుండేదని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు. కానీ అంజలీ మనసులోని కోరికకు విరుద్దంగా జరగటంతో.. అభిమానులు నిరాశ చెందటం జరిగింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more