మాస్టర్ ఎప్పుడు మాస్టరే... ఇటు ఆట లోనూ.... అటు సంపాదనలోనూ. భారత దేశంలో ఉన్న అందరు క్రీడాకారుల్లో ముఖ్యంగా క్రికెట్ లో సచిన్ అంత్యంత సంపన్నుడని వెల్త్ ఎక్స్ సంస్థ ప్రకటించింది. సచిన్ టెండూల్కర్ సంపద 160 మిలియన్ డాలర్లుగా వెల్త్ ఎక్స్ లెక్క కట్టింది. దీంతో అటు పరుగుల్లో... ఇటు సంపాదనలో అత్యధిక ధనవంతుడిగా మాస్టర్ బ్లాస్టర్ చరిత్ర సృష్టించాడు.
హర్యానాతో జరిగిన రంజీ ట్రోఫి మ్యాచ్ లో సచిన్ ముంబై జట్టును ఒంటి చెత్తో గెలిపించి ఘనంగా రంజీ ట్రోఫీలకు కూడా సచిన్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. వెల్త్ ఎక్స్ ప్రకటించిన వివరాల ప్రకారం ప్రస్తుత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కంటే సచిన్ టెండూల్కర్ ఆస్తి మూడు రెట్లు, యువరాజ్ సింగ్ కంటే ఐదు రెట్లు, రాహుల్ ద్రావిడ్ కంటే 8 రెట్లు, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే 10 రెట్లు ఎక్కువ అని వెల్లడించింది.
సచిన్ 160 మిలియన్లతో అగ్రస్థానంలో ఉండగా, ధోని 50 మిలియన్లతో 2వ స్థానం, యువరాజ్ 30 మిలియన్లతో 3వ స్థానం, రాహుల్ ద్రావిడ్ 20 మిలియన్లతో 4వ స్థానం, కోహ్లి 15 మిలియన్లతో 5వ స్థానంలో ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. మొన్నటి వరకు ఎండార్స్ మెంట్లతో దూసుకెళ్లిన ధోని కంటే సచిన్ సంపాదన మూడు రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం.ఇక ఇప్పుడిప్పుడే దూసుకొస్తున్న యువ కెరటం కోహ్లీ సంపాదనలో కూడా దూసుకొస్తున్నాడు.
నిన్న ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో ఆకట్టుకున్న కోహ్లీ భవిష్యత్తులో సచిన్ సెంచరీల రికార్డును అధికమించ వచ్చనే అభిప్రాయాన్ని సునీల్ గవాస్కర్ వెలిబుచ్చాడు. నవంబర్ లో జరిగే వెస్టిండీస్ సిరీస్ లో తన 200వ టెస్ట్ ఆడనున్న సచిన్ .. ఆతర్వాత క్రికెట్ గుడ్ బై చెప్పడంతో.. అప్పటి నుండి మైదానంలో సచిన్ లోటు స్పష్టంగా కనిపిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more