ఆపద మొక్కుల వాడ..అంటూ.. సీమాంద్ర రాజకీయ నేతలు రాష్ట్ర విభజనను ఎలాగైన ఆపాలనే ఉద్దేశంతో.. కొంతమంది వేడుకుంటున్నారు. ఆపద మొక్కుల వాడ అంటే.. ఆ ఏడు కొండల శ్రీవారిని మాత్రం కాదులేండి. అయిన మన రాజకీయ నేతలకు శ్రీవారిని వేడుకొనే సమయం ఎక్కడ ఉంది చెప్పండి. కానీ సమైక్యాంద్ర కోసం సీమాంద్ర రాజకీయ నాయకుల కొత్త స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటికే.. సమైక్యాంద్ర కోసం ఉద్యమం చేసిన సీమాంద్ర ఉద్యోగులు సమ్మెకు సెలవు చెప్పిన విషయం తెలిసింది. ఈసారి ..కొంత పంథతో సీమాంద్ర నాయకులు ఢిల్లీలో మంతనాలు జరపటానికి సిద్దమవుతున్నారు. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ఒక్క మగాడు.. ఆంద్ర నాయకులకు ఆపద మొక్కుల వాడుగా కనిపిస్తున్నారు. చివరి ప్రయత్నమో, లేక తొలి ప్రయత్నమో తెలియాదు గానీ.. మొత్తం మీద సమైక్యాంద్రకోసం కొంత మంది సీమాంద్ర నాయకులు ధైర్యం చేసి ఢిల్లీలో అడుగులు వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం, దాని ప్రభావం, ప్రజల ఆకాం క్షలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వివరించాలని నిర్ణయించినట్లు సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ఫోరం కన్వీనర్ సాకే శైలజానాథ్ తెలిపారు. హైదరబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో జరిగిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశం అనంతరం మంత్రులు గంటా శ్రీనివాస్, టీజీ వెంకటేష్, విప్ రుద్రరాజు పద్మరాజు, పాలడగు వెంట్రావులతో కలసి ఆయన మాట్లాడారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశ తీర్మానాలను వెల్లడించారు. త్వరలో ఢిల్లికి వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్‌లను కలసి సీమాంధ్ర పరిస్థితిని వివరిస్తామని చెప్పారు. విభజన అంశం అసెంబ్లికి ఏ రూపంలో వచ్చినా వ్యతిరేకిస్తామని, న్యాయస్థానంలో ఎదుర్కొనేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. సమైక్య పోరాటంపై మరోసారి భేటీ కావాలని నిర్ణయించామని, సమావేశం తీర్మానాల వివరాలను సీఎం కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్సలకు అందచేస్తామని శైలజానాథ్ చెప్పారు.
రాష్ట్ర విభజనపై కేంద్రం తన పని తాను పూర్తి చేసుకుపోతున్న తరుణంలో సమైక్యవాదం విన్పించిన నేతలు గట్టిగా పోరాడాల్సింది పోయి బలహీనపడినపడినట్లుగా తెలుస్తోంది. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచటం అలా ఉంచి కనీసం అందరూ కలిసి ముందు కు వెళ్లే పరిస్థితులు కూడా కన్పించటం లేదు. మినిస్టర్ క్వార్టర్స్‌లో జరిగిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమన్వయ కమిటీ సమావేశం తీరే అందుకు నిదర్శనం. నేతల చర్చల్లో సమైక్యాంధ్ర స్ధానంలో విభజన తర్వాత ఏర్పడే విషయాలపై దృష్టి సారించాలన్న బలమైన వాదన వినిపించినట్లుగా తెలుస్తోంది.
సీమాంధ్ర నేతల ఫోరం కన్వీనర్ శైలజానాథ్, గంటా శ్రీనివాసులిద్దరూ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనపై నియమించిన గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్‌ని కలవటం అంటే విభజనకు అంగీకరించటమే అవుతుందని వాదించినట్లుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఐదు కోట్ల మంది సీమాంధ్ర ప్రజల పోరాటాన్ని పట్టించుకో కుండా ఏకపక్షంగా ముందుకు వెళ్తుంటే కేంద్రాన్ని నిలదీయాలన్నారు, సీమాంధ్ర ప్రతినిధులుగా ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత ఉందన్నారు. అందరూ కలిసి ప్రజలకు అండగా నిలిచి కేంద్రానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్దామని గట్టిగా చెప్పినట్లుగా తెలిసింది.
అయితే సీమాంద్ర కాంగ్రెస్ నాయకులే రెండు వర్గాలుగా విడిపోతే.. సమైక్యవాదంలో బలం ఏముంటుంది చెప్పండి. కొంతమంది.. అమ్మ భజన చేస్తున్నారు. మరికొంతమంది .. సీమాంద్ర ప్రజల కోసం, సమైక్యాంద్ర కోసం స్వచ్చమైన మనసుతో పోరాటం చేయటానికి ముందుకు వెళ్లుతున్నారు. రోజు రోజుకి అమ్మ భజన చేసే నాయకులు సీమాంద్రలో పెరిగిపోతున్నారు. ఇలాంటి సమయంలో సమైక్యవాదం ఎంత మరిచి అరిచిన.. అమ్మకు వినిపిస్తుందా? అమ్మకు భజన చేసే నాయకులు సమైక్యనాదం వినిపించకుండా చేసిన ఆశ్చర్యంలేదని రాజకీయ మేధావులు అంటున్నారు. ఏమైన సీమాంద్ర ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుందన్నది కాంగ్రెస్ పార్టీ అనే పచ్చి నిజం తెలుగు ప్రజలకు అర్థమైంది. ఇక చీకటి అంధకారం నుండి సీమాంద్ర ప్రజలు ఎలా బయటపడతారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more