మెగాస్టార్ చిరంజీవి అంటే అంచలంచెలుగా ఎదుగుతూ సినీ సామ్రాజ్యంలో మకుటం లేని మహారాజుగా ఎదిగిన సుప్రీం స్టార్ చిరంజీవి. సినీ ప్రపంచంలో ఒక సంచలనం స్రుష్టించిన ఘనత ఒక్క చిరంజీవికే దక్కుతుంది. ఒకానొక సమయంలో తోటి హీరోలు చిరంజీవిని చూసి అసూయపడేలా చిరంజీవి ప్రజాభిమానం సంపాదించుకున్నారు. అదేమి త్రుణప్రాయంగా వచ్చింది కాదు.. ఆయన ఒక్కొ మొట్టు ఎక్కడానికి ఆయన పడ్డ కష్టం మాటల్లో చెప్పలేనిది. చెపితే భారతం అంత ఉంటుంది.. ఆయన చరిత్రరాస్తే రామాయణం అంత ఉంటుందనే విషయం ప్రతిఒక్కరి తెలుసు. ఆయన స్వయం క్రుషే ఈ రోజు కేంద్ర మంత్రి స్థాయికి చేర్చింది. రంగుల ప్రపంచంలో ఆయన కన్న కలలు సాకారం కావటానికి చిరంజీవి నిరంతరం కష్టపడితే గానీ ఈ స్థాయికి రాలేరు. ఒక స్థాయిని చేరుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం అనేది ప్రధానమైన అంశం. అయితే ఆ విషయంలో మెగా స్టార్ చిరంజీవి 100 శాతం సఫలక్రుతులయ్యారు. ఆయన సినీ జీవితం ప్రారంభం నుండి చిత్తశుద్దితో మెలిగే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు ఎన్ని లోటుపాటులు వచ్చినా దాన్ని తట్టుకుంటూ , ప్రజల గుండెల్లో మాత్రం మెగా ఇమేజ్ ని సుస్థిరం చేసుకున్నారు.
ఇప్పటి వరకు తన సినీ జీవితంలో అద్బుతమైన 149 సినిమాలను మనకు అందించారు. అయితే ఆయన జీవితం మరో మలుపు తిరిగే విధంగా .. ప్రజా సేవలో పాలుపంచుకుంటానని రాజకీయ పార్టీని ఏర్పాటు చెయ్యటం జరిగింది. అప్పటికే ఆయనలో సామాజికంగా సేవ ఎంతో నిండి ఉన్న విషయం తెలిసిందే. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చాలా దగ్గరైన విషయం తెలిసిందే. సినీ చరిత్రలో తను చూడని రికార్డులు లేవని, అలాగే రాజకీయ చరిత్రలో కూడా పాత రికార్డులను తుడిపివేద్దామని.. స్వర్గీయ ఎన్టీఆర్ 9 నెలల్లో సాధించిన రాజకీయ చరిత్ర రికార్డును చిరంజీవి కేవలంలో 8 నెలల్లోనే సాధించేద్దామని ఓ ప్రణాళికగా వేసుకుని, పార్టీని స్థాపించడం జరిగింది. అప్పటికి అభిమానుల్లో, సాధారణ ప్రజల్లో చిరంజీవి అంటే ఒక మెగా స్టార్ గానే ఉన్నారు. అయితే చిరంజీవి ఒకటి తలిస్తే.. దైవం మరోటి తలంచింది. చిరంజీవి మాత్రం కుటిల రాజకీయాల్లో వెనకబడిపోయారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను శాశించే స్థాయికి ఎదగాలన్న చిరంజీవి కోరికలో ఎలాంటి లోపం లేదు కానీ, ఆయన పక్కన చేరిన రాజకీయ నాయకుల కుట్రకు చిరంజీవి పార్టీకి తీరని దెబ్బ తగిలింది. చిరంజీవి రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేని కొందరు రాజకీయ నాయకులు కుట్రలు, కుతంత్రాలతో, డబ్బుతో ఓటులను దక్కించుకొని .. దూరపు కొండాలు నునుపు అనే సామెతను చిరంజీవికి గుర్తుచేశారు. కులం పేరుతో వచ్చిన పార్టీగా నక్కలాంటి రాజకీయనాయకులు ఆడిన నాటకంలో చిరంజీవికి అవమానం జరిగింది. నమ్మిన ప్రజలే చిరంజీవిని నవ్వులుపాలు చేసిన విషయం తెలిసిందే. కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు పావటం సహజంగా జరుగుతుంది.
కానీ ప్రజలు మాత్రం పాత నీరుకు బాగా అలవాటుపడిపోయి.. కొత్త నీరును వదిలేసుకున్నారు. దానితో రాష్ట్ర ప్రజలు తీరాని కష్టాలను కొనితెచ్చుకున్న విషయం మనకు తెలిసిందే. చేతులు కాలిన తరువాత ఆకులుపట్టుకుంటే ఏం లాభం అనే విషయాన్ని ప్రజలు తెలుసుకునేలోపే.. భారీగా నష్టం జరిగిపోయింది. సామాజిక న్యాయం చేస్తానని .. ప్రతి ఇంటి గడపతొక్కిన ప్రజా నాయకుడ్ని.. రాష్ట్ర ప్రజలు నిలువున ముంచేశారు. అలాంటి ప్రజలు మీద నమ్మకపోయిన నాయకుడిగా, ఆయనను నమ్ముకున్న నాయకులకు న్యాయం చెయ్యాలనే ఉద్దేశంలో.. ఒక విపత్త పరిస్థితుల్లో.. తన రాజకీయ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చెయ్యవలిసి వచ్చింది. ఇలా చేసినందుకు ప్రజలు, కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు, చిరంజీవి బురద జల్లే ప్రయాత్నలు చేసి విఫలమయ్యారు. అయితే చిరంజీవి మాత్రం మౌనంతో తన రాజకీయ జీవితాన్ని సాగించారు. మౌనమే అన్నిటికి సమాధానం చెబుతుంది. సమయం వచ్చినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పటానికి ఆయన సిద్దంగా ఉన్నారు. ఇప్పటి వరకు సాగిన రాజకీయ ప్రస్థానం ఒక ఎత్తు అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు చిరంజీవికి ఎదురీత కానున్నాయి. రాష్ట్ర విభజన ప్రకటన ఇచ్చిన తర్వాత చిరంజీవి స్పందించిన తీరు, చేస్తున్న ప్రకటనలు సీమాంద్ర ప్రజలను ఆగ్రహాతులను చేస్తున్నాయి.
రాష్ట్రంలో ఒక ప్రక్కన అల్లకల్లోలం అవుతుంటే, కనీసం దాని నిమితమై ఆ ప్రాంతానికి చెందిన వాడిగా తన వంతు బాధ్యతగా, ఏమైనా చెయాలనే తపన గానీ, చిత్తశుద్ది గానీ, ఆయన కళ్లల్లో గానీ కనపడటం లేదు. దీంతో దండలు వేసి, అభిమానించిన ప్రజలే ఇప్పుడు చిరంజీవి పై మండిపడుతున్నారు. అయితే ప్రజలకు చిరంజీవి ఇప్పుడు గుర్తుకు వచ్చాడా? ఓటు వేయ్యండి.. మీకు సామాజిక న్యాయం చేస్తానని చెప్పినప్పుడు చిరంజీవి ప్రజలకు గుర్తుకు రాలేదా? అని సీనియర్ రాజకీయ నాయకులు అడుగుతున్నారు. ఆరోజు ఓటు హక్కుతో ప్రజారాజ్యం పార్టీని గెలిపించి ఉంటే.. ఈ రోజు ఇలాంటి సమస్య వచ్చేది కాదని అంటున్నారు. తప్పు మన వద్ద పెట్టుకొని చిరంజీవి పై నిందాలు వెయ్యటం మంచి కాదు. చిరంజీవి కంటే ముందు చాలా మంది మన సీనియర్ నాయకులు ఉన్నారు. వారి సంగతి ఏమిటి? వారిని నిలదీయ్యండని రాజకీయ మేథావులు అంటున్నారు. ఎవరు ఒప్పుకున్నా , లేకున్నా చిరంజీవి సినీ ప్రస్థానం ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయం . అందుకనే సినీ వినీలాకాశంలో ఆయన్ని ప్రజలు మెగాస్టార్ ని చేశారు. కానీ ప్రజా సేవ తన లక్ష్యంగా వచ్చిన చిరంజీవి ప్రజలే మోసం చేసారు కాబట్టి ఆయన రాజకీయ విమర్శలు అనవసరం. తన సొంత విషయాలను గురించి మాట్లాడే హక్కు మనకు లేదు. ఆయన వ్యక్తి విషయాలపై విమర్శించే హక్కు ఎవ్వరికి లేదు.
ఎందుకంటే.. రాష్ట్రాన్ని కొన్ని సంవత్సరాల నుండి దోసుకొని.. లక్ష కోట్లు సంపాదించుకున్నా నాయకులు ఉన్నారు. కట్ట బట్టలతో రాజకీయల్లో చేరి.. కోట్లకు పగడలేత్తిన బడా బాబులు చాలా మంది ఉన్నారు. దమ్మున్న ప్రజలా ముందు అలాంటి నాయకుల దుమ్ముదులపండి. మెగా స్టార్ చిరంజీవి ఇప్పటి వరకు వ్యక్తి గానీ, రాజకీయ పరంగా, సినీ పరంగా గానీ, ఏ ఒక్కరి ఆయన హనీ చెయ్యలేదనే విషయం ప్రతి ఒక్కరు తెలిసిందే. ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి మరకలేని మహారాజుగా మెగాస్టార్ ఉన్న విషయం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని మైనస్ పాయింట్స్, ఫ్లస్ పాయింట్స్ ఉంటాయి.
అలాగే చిరంజీవి జీవితంలో అతి తక్కు మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అంతమాత్రన ఆయన జీవితం పై విమర్శలు చెయ్యటం మంచిది కాదు. ఏదైమైన ఈ రోజు ఆగష్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. అయితే చిరంజీవి ఆశించిన, కోరుకున్న అందలానికి 2014లో మరో అవకాశం రాబోతుంది. మరళ వచ్చే పుట్టిన రోజు నాటికి చిరంజీవి జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో వేచి చూద్దాం.. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకొందాం...
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more