K chandrasekhar rao receives threatening letter

Telangana Rashtra Samithi,K Chandrasekhar Rao, k chandrasekhar rao, telangana, trs, Death warning letter to KCR party office,death letter to trs chief kcr, death letter to trs party president kcr

The Telangana Rashtra Samithi claimed that party president K Chandrasekhar Rao was sent a letter by unknown people who threatened to kill...

కేసీఆర్ ని పదిరోజుల్లో చంపేస్తారట

Posted: 08/13/2013 12:35 PM IST
K chandrasekhar rao receives threatening letter

తెలంగాణ ఉద్యమాన్ని దాదాపు పదమూడు సంవత్సరాల నుండి నడుపుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును చంపేస్తామంటూ బెదిరింపు లేఖ పార్టీ కార్యాలయానికి వచ్చింది. ఆంధ్రా నక్సల్స్ పేరిట ఈ లేఖ సోమవారం వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ లేఖను ఎవరు ఎక్కడి నుండి పంపించారో వివరాలు మాత్రం రాయలేదు. ఎర్ర స్కెచ్ పెన్నుతో రాసిన లేఖలో కాల్చి చంపేస్తామంటూ పేర్కొన్నారు. ‘ కేసీఆర్.. యూ విల్ బి షాట్‌ డెడ్ విత్ ఇన్ 10 డేస్ ’ అంటూ అందులో రాసి ఉంది. ఇప్పటికే కెసిఆర్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఇటీవల తెరాస నేతలు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు సెక్యూరిటీని పెంచారు.

కెసిఆర్‌ను చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్, ఇతర ఎమ్మెల్యేలు మంగళవారం రోజు డిజిపి దినేష్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది. ఎవరైనా ఇలాంటి అకృత్యాలకు పాల్పడితే అంతకంటే ఘోరం ఉండదు. ప్రజాస్వామ్యంలో నాయకులను హత్య చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసుకోవడమే. అయితే తెలంగాణ వాదులు మాత్రం సీమాంధ్ర పాంత్రానికి చెందిన వారే ఈ లేఖ పంపించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ లేఖ గురించి పోలీసులు పూర్తి విచారణ జరిపి అందులో నిజానిజాలను వెలికి తీసి , నిందితులను కఠినంగా శిక్షించవలసి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more