Star studded september month

Movies in August postponed, Movies in September crowded, Attarintiki daredi, Yevadu, Bhai, golemal, Ramayya Vastavayya

star studded september month

తారలు దిగివస్తున్న మాసం సెప్టెంబర్?

Posted: 08/06/2013 04:24 PM IST
Star studded september month

వచ్చే నెలలో సినీ ప్రేమికులకు కన్నుల పండుగేనని, అభిమాన తారలు వెండి తెరను అలంకరించి వేడుక చేయబోతున్నారని వారి వారి అభిమానులంతా చాలా ముచ్చట పడుతున్నారు.  ఈ వారంలో విడుదల కావలసిన పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది, రామ్ చరణ్ ఎవడు కూడా సెప్టెంబర్లోనే విడుదల కావొచ్చని సమాచారం. 

అవి కాకుండా మామూలుగానే సెప్టెంబర్ నెలలో విడుదలకు సిద్ధమౌతున్న సినిమాలు ఉండనే ఉన్నాయి.  అవి జూనియర్ ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్య, నాగార్జున భాయ్, రామ్ చరణ్ తుఫాన్ జంజీర్ లు, వెంకటేష్ రామ్ ల చిత్రం గోల్ మాల్ లు. 

అయితే ఇవన్నీ ఒకే నెలలో విడుదలైతే తారలు దిగిరావటమేమో కానీ చుక్కలు కనిపిస్తాయంటున్నారు నిర్మాతలు.  నిర్మాణానికి, విడుదలకూ సమయం పడితే ఖర్చు కూడా అలాగే పెరుగుతుంది కాబట్టి నిర్మాణాన్ని అనుకున్న కాలంలో ప్రణాళిక ప్రకారం పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా విడుదల చేస్తేనే నిర్మాతలకు లాభం.  కానీ ఇలా అగ్రతారల చిత్రాలు పొటీ పడితే థియేటర్లకు కొదవు, జేబుకి చిల్లు ఖాయం కాబట్టి అన్ని అగ్రనాయకుల సినాలు సినిమాలనూ ఒకేసారి కాకుండా జాగ్రత్తగా ఒక ఒడంబడికకు వచ్చి అందరి ప్రయోజనాన్నీ ఆలోచించి విడుదల చెయ్యాలి కాబట్టి వీటి విడుదల తేదీలన్నీ తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. 

దీనితో పాటు రాజకీయ వాతావరణం కూడా, ఈ సంవత్సరం పడ్డ వర్షాలు, తుఫాన్లు, అల్పపీడనాలలాగానే ఎప్పడు ఎలాంటి పరిస్థితులను కల్పిస్తాయో ఊహించనలవి కాకుండా ఉంది.  అందువలన, అభిమానుల ఆశలమీద నీళ్ళు చల్లటం కాదు కానీ, అందరికీ అనుకూలమైన వినోదమైన సినిమాల విషయంలో ఏమీ చెప్పలేకుండా ఉంది.  ఇది ఇలాగే కొనసాగితే కొత్త సినిమా నిర్మాణాల విషయంలో కూడా నిర్మాతలు వెనకంజవేసే అవకాశముందని సినీ పరిశ్రమలో భయపడుతున్న విషయం.  వేలాది మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, పంపణీదారులు ఆధారపడ్డ సినిమా పరిశ్రమలో పరిస్థితులను చూసి ఆదుర్దా పడటం సహజమే కదా

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more