నాయకుడు అంటే తాను నడుస్తూ, నలుగుర్ని నడిపిస్తూ, అందర్ని కలుపుకొని పోయేవాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రంగంలోనైనా నాయకుడిగా ఎదగాలంటే చాలా కష్టం. నాయకత్వ లక్షణాలు ప్రతి వ్యక్తిలో ఉన్నా, కొందరు మాత్రమే నాయకులుగా ఎదుగుతారు...ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందుండి నడుస్తారు... నలుగుర్ని నడిపిస్తారు. క్రికెట్ రంగానికి వస్తే భారత జట్టును ప్రపంచ నెంబర్ వన్ జట్టుగా తీర్చి దిద్దడంలో ముఖ్యపాత్ర పోషించిన మహేంద్ర సింగ్ ధోని ఒక క్రికెటర్ గానే కాకుండా, కెప్టెన్ గా జట్టులో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నాడు ఈ మహిమాన్విత కెప్టెన్ గా, భారత క్రికెట్‌లో ఒక సంచలనంగా పేరు తెచ్చున్నాడు ఈ జార్ఘండ్ డైనమెట్. నిన్నటితో 32 సంవత్సరాలు పూర్తి చేసుకొని వడివడిగా 33వ పడిలోకి అడుగుపెట్టిన ధోని గురించి కొన్ని విషయాలు...... 1981, జూలై 7 న ఝార్ఖండ్ లోని రాంచీ లో జన్మించారు. ధోని కుటుంబం ఉత్తరాఖండ్ నుండి తన తండ్రి వృత్తి రీత్యా ఝార్ఖండ్ కు వచ్చారు. ధోనికి చిన్నతనం నుండే క్రికెట్ అంటే పిచ్చి. తనకు ఉన్న ఆసక్తిని చిన్నతనం నుండే అదే తన కెరీర్ గా మలుచుకున్న ధోని అంచెలంచెలుగా ఎదిగి టీం ఇండియా ఆటగాడిగానే కాకుండా సమర్థవంతమైన నాయకుడిగా ఎదిగి జట్టును నడిపిస్తున్నాడు. ధోనీ బ్యాటింగ్ స్టైలే వేరు. హెలికాప్టర్ షాట్లతో సిక్సర్లు కొట్టడంలో మహీకి బ్యాట్‌తో పెట్టిన విద్య. 2005తో ఇండియా జట్టులో తెరంగ్రేటం చేసిన ధోని, పాకిస్తాన్ పై 5 వ వన్డే లో 148 పరుగులు సాధించి వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. ఇక్కడి నుంచి మహీ ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఒక నెల తర్వాత జైపూర్‌లో శ్రీలంకపై 300 పరుగుల లక్ష్య ఛేదనలో 15 ఫోర్లు, 10 సిక్సర్లతో 183 పరుగులతో జట్టును విజయపథాన నిలిపాడు.
ఇప్పటివరకు ధోని 77 టెస్టులు, 225 వన్డేలు, 41 టి.20 లు ఆడాడు. వన్డేల్లో 7313, టెస్టుల్లో 4209, టి.20 లో 748 పరుగులు చేసాడు. అందులో టాప్ స్కోర్ టెస్ట్ లో 223, వన్డేల్లో 183, టి.20 లో 48 పరుగులు సాధించాడు. కెరీర్ తొలినాళ్లలో ధోనీలోని వీరబాదుడే ఈ స్థాయికి తెచ్చాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.... తన చిన్ననాటి స్నేహితురాలైన సాక్షిని పెళ్లి చేసుకున్న ధోని పలు సందర్భాల్లో నా విజయాల్లో ఈమెది కూడా ఓ భాగం ఉంటుందని చెప్పాడు. క్రికెట్ పరంగా గ్రిల్ క్రిస్ట్ ని ఇష్టపడే ధోని, సచిన్ కి వీరాభిమాని. బాలీవుడ్ స్టార్ అమితాబ్ అన్నా, సింగర్ లతా మంగేష్కర్ అన్నా ఆయనకు విపరీతమైన అభిమానం. ఇక తన విజయరహ్యానికి కారణం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో కూల్ గా ఆలోచించడం, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడమే చెబుతున్న ధోని ఇంకా కొన్ని కాలాలా పాటు భారత జట్టుకు సేవలందించి, జట్టును విషయపథంలో నడిపించాలని, ప్రస్తుతం గాయం కారణంగా విండీస్ సిరీస్ కి దూరం అయిన ధోని త్వరగా కోలుకోవాలని కోరుకుందాం
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more