Tollywood hero balakrishna 53 birthday celebrations

balakrishna, balakrishna 53 birthday celebrations, balakrishna 53 birthday celebrations photos, balakrishna birthday celebrations photos, balakrishna 2013 birthday celebrations, balakrishna birthday , jayasimha movie lunch, boyapati, balakrishna, devisri prasad

tollywood hero balakrishna 53 birthday celebrations

నందమూరి బాలకృష్ణ బర్త్ డే స్పెషల్

Posted: 06/10/2013 07:27 PM IST
Tollywood hero balakrishna 53 birthday celebrations

53లోకి అడుపెట్టుతున్న టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ.. తన 53వ పుట్టినరోజు వేడుకులను అభిమానుల మద్య ఘనంగా జరుపుకున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు వారుసుడిగా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు బాలకృష్ణ . తండ్రి వారసత్వాన్ని నిలబెట్టి నందమూరి అభిమానుల గుండెల్లో నందమూరి ముద్ర వేయటం జరిగింది. తండ్రి బాటలోనే పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించగల సత్తా ఉన్న హీరోగా వెండితెరపై గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్‌ తనయుడి గా బాలయ్యకు సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఈజీగా లభించినా.. ఎన్టీఆర్‌ పేరుకు ఉన్న విలువ కాపాడం కోసం మాత్రం చాలా శ్రమించాడు.. 1974 లో తాతమ్మకల అనే చిత్రం ద్వారా 14 ఏళ్ల వయసులో ఆయన సినీరంగ ప్రవేశం జరిగింది.

ఆ తరువాత ఆయన రామ్ - రహీం ... వేములవాడ భీమకవి చిత్రాల్లో ఇంపార్టెంట్‌ రోల్స్‌ లో నటించాడు. తరువాత అన్నదమ్ముల అనుబంధం ... దానవీర శూర కర్ణ ... అక్బర్ సలీం అనార్కలి చిత్రాలు నటుడిగా బాలకృష్ణ కి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. 1980 ల్లో వచ్చిన మంగమ్మగారి మనవడు సినిమాతో బాలకృష్ణ హీరోఇజానికి తెరతీస్తూ అఖండ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో పల్లెటూరి బుల్లోడిగా బాలక్రిష్ణని నటనకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.. ఇక ఈ సినిమా తరువాత వచ్చిన ముద్దుల క్రిష్నయ్య ... అనసూయమ్మగారి అల్లుడు ... అపూర్వ సహోదరులు సినిమాలు బాలయ్యకు భారీ సక్సెస్‌లతో పాటు మాస్‌ ఫాలోయింగ్‌ను కూడా అందించాయి.. బాలకృష్ణ సినిమాల్లో ఓ డిఫరెంట్‌ మూవీగా గుర్తింపు తెచ్చుకున్న సినిమా ఆదిత్య 369 ఈ సినిమాలో లో హీరోగా కనిపించిన బాలయ్య కొన్ని సీన్స్‌ లో శ్రీకృష్ణ దేవరాయలుగా కనిపించి అలరించాడు...ఆ పాత్రలో బాలయ్య నటన చూసిన అభిమానులు మరోసారి ఎన్టీఆర్‌ ను గుర్తు చేసుకున్నారు.

ఇక తెలుగు సినిమా ఫ్యాక్షన్‌ ట్రెండ్‌ తీసుకువచ్చిన హీరో కూడా బాలయ్యే. ఆయన సమరసింహా రెడ్డి చిత్రంతో ఫ్యాక్షన్ నేపథ్య చిత్రాలకి శుభారంభాన్ని పలికారు. అంతేకాదు బాలకృష్ణ కెరీర్‌ తడబడుతున్న ఇటీవల కాలంలో కూడా మరోసారి ఫ్యాక్షన్‌ నేపధ్యంతో సాగే సింహా సినిమాతో మరోసారి సక్సెస్‌ అందుకున్నాడు బాలయ్య.. త్వరలో మరోసారి తనకు సింహా లాంటి బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ అందించిన బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో జయసింహా సినిమాతో తన అభిమానులను అలరించాడానికి రెడీ అవుతున్నాడు.. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు.. నేడు జన్మదినం జరుపుకుంటున్న నందమూరి బాలకృష్ణ మరెన్నో సంచలన విజయాలు సాధించాలని తెలుగువిశేష్ కోరుకుంటుంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more