దేశంలో మహిళల మీద అత్యాచారాలు ఎక్కువౌతున్న సమయంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సత్యదేవ్ కటారే మాటలు అందరికీ షాక్ ఇచ్చింది. బహిరంగ సభలో బాహాటంగా సత్యదేవ్ అత్యాచారాలకు మహిళలనే కారణంగా చూపుతూ, జబ్ తక్ కోయీ మహిళా టేఢీ నజర్ సే హసేగీ నహీఁ తబ్ తక్ కోయీ ఆద్మీ ఉసే ఛేడేగా నహీఁ అంటూ ప్రాసలో చెప్పారు. క్రీగంటితో కవ్వించకపోతే ఏ మగవాడూ ఆమె వెనక పడడు అని అన్నారాయన.
మహిళల దుస్తుల మీద, వాళ్ళ ప్రవర్తన మీద, సోషల్ గా తిరగటం మీదా, రాత్రి పూట స్నేహితులతో గడపటం మీదా చాలా మంది వ్యాఖ్యానించారు. నిజమే కావాలని ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు. ఎవరి జాగ్రత్తలో వాళ్ళుండాలి. ఎంతో కాలంగా తెలిసినవాళ్ళని కూడా నమ్మవద్దు. ఎందుకంటే తెలిసినవాళ్ళు చేసిన అత్యాచారాలే ఎక్కువున్నాయి. వాళ్ళని నమ్ముతారు కనుక వాళ్ళకి ఆ పని సులువవుతుంది కాబట్టి.
అయితే ఇవన్నీ ముందు జాగ్రత్తలు మాత్రమే కానీ అవే కారణాలు కావు. కవ్వించే విధంగా చూడటం, నవ్వటం, ఇవన్నీ చేస్తున్నది బయట కనిపించే మహిళలు కాదు. సినిమాలలో, వ్యాపార ప్రకటనలలో కనిపించే మహిళలు. వాళ్ళు చేసిన కవ్వింపుకి యువత దొరికిన అవకాశాన్ని వదులుకోకూడదనుకోవటం జరుగుతోంది. మరో విషయమేమిటంటే ముందు వాళ్ళకి కూడా ఆ ఆలోచన ఉండకపోవచ్చు. కానీ తీరా సాన్నిహిత్యం లభించిన తర్వాత, అంతకు ముందే చూసిన సినిమాలో, వీడియోలో మనసులోకి వచ్చి మనసు అదుపు తప్పిన సంఘటనలే ఎక్కువగా ఉంటాయి.
ఒకవేళ మహిళలు కవ్వించటం వలనే అత్యాచారం జరుగుతుందంటే, మరి చిన్న పిల్లలు, వయసుకి రానివాళ్ళు, లైంగికంగా ఎదగనివాళ్ళు ఏం కవ్విస్తారు. అందువలన స్విచ్ ఉన్నది ఒకచోట లైటు వెలిగేది మరోచోట అన్నట్లుగా, విరివిగా లభిస్తున్న వీడియాలు, సినిమాలలో విపరీతమైన శృంగార ధోరణి, ఎలా చేస్తే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చన్నది తెలుసుకుని ఆవిధంగా కేమెరా ముందు కనపడని ప్రేక్షకులను కవ్వించటం చేస్తున్న మహిళలను తప్పు పట్టాలి కానీ బయట సమాజంలో ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు, అదే అత్యాచారాలకు కారణమన్నది సరికాదు.
మహిళల మీద అభాండం వేసిన సత్యదేవ్ కటారే నిజానికి అక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం కోసం భిండ్ లో ఏర్పాటైన బహిరంగ సభలో మాట్లాడారు. ఆయన ఈ మాటలు మాట్లాడిన సమయంలో మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో నాలుగు సంవత్సరాల బాలిక అత్యాచారానికి గురై హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతున్నది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more