సినిమాలకు స్వస్తి చెప్పి, రాజకీయాలలో బిజీ అయిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మెగాస్టార్ చిరంజీవి డాన్సులు చూసి చాలా కాలం అయింది. అప్పుడెప్పుడో తన కొడుకు మగథీర సినిమాలో ఒకటి రెండు స్టెప్పులు వేసి ఆ తరువాత డాన్సులు వేయని చిరు తాజాగా తనదైన శైలిలో డాన్సు వేసి అందర్ని అలరించడమే కాకుండా తనలో ఇంకా ఆ జోష్ తగ్గలేదని నిరూపించాడు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా రాజధానిలో జరుగుతున్న ప్రపంచ పర్యాటక సదస్సు ఈనెల 12 నుండి ప్రారంభం అయింది. ఈ సదస్సుకు విచ్చేసిన వివిధ దేశాల డెలిగేట్ల కోసం శిల్పకళా వేదికలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో చిరంజీవి చిందేశారు. ఈ విందులో ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాలలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు తమ తమ కళలలను ప్రదర్శించి విదేశీ ప్రతినిధుల బృందాన్ని అలరించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రీయ నృత్యం, చిందు యక్షణ గానం, తప్పెట గుళ్లు, పులివేషాలు, పగటి వేషాలు, కొమ్ముకొయ్య నాట్యాలు చేస్తున్న సమయంలో చిరంజీవి ఉత్సాహాన్ని ఆపుకోలేక వేదిక పైకి వెళ్లి డప్పు దరువుకు అనుగుణంగా నాట్యం చేశారు. విద్యార్థులతో చిరంజీవి కాసేపు చిందేశారు. చిరంజీవి స్టెప్పులేసి అందర్ని మంత్రముగ్ధుల్ని చేసి అక్కడి వారికే కాకుండా తమ అభిమానుల్లో చాలా కాలం తరువాత జోష్ నింపారు. ఈ స్టెప్పులు చూసిన చిరు ఫ్యాన్స్ ఆయనలో ఏ మాత్రం జోష్ తగ్గలేని తెగ ఆనందపడిపోతున్నారు. తన 150 సినిమా త్వరగా చేయాలని కోరారు. తరువాత చిరంజీవి మాట్లాడుతూ... యువతీ యువకులు సంప్రదాయ కళలు నేర్చుకొని ప్రతిభ కనబర్చడం అభినందనీయం, హర్షనీయమని చెప్పారు. ఏదేమైనా చిరంజీవి పర్యాటక శాఖకు వన్నె తేవడానికి తనదైన శైలిలో ప్రత్నిస్తున్నాడనటంలో ఎటువంటి సందేహం లేదు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more